Share News

56 Indians Georgia: జార్జియా బోర్డర్‌లో భారతీయులకు అవమానం..నెటిజన్ల కామెంట్స్

ABN , Publish Date - Sep 17 , 2025 | 12:21 PM

ఇటీవల జార్జియా సరిహద్దులో జరిగిన ఓ ఘటన గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అన్ని డాక్యుమెంట్స్ ఉన్నా కూడా 56 మంది భారతీయ ప్రయాణికులతో జార్జియన్ అధికారులు అమానుషంగా ప్రవర్తించారని ఓ యువతి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆరోపించింది.

56 Indians Georgia: జార్జియా బోర్డర్‌లో భారతీయులకు అవమానం..నెటిజన్ల కామెంట్స్
56 Indians Georgia

ఇటీవల జార్జియా బోర్డర్‌లో జరిగిన ఓ షాకింగ్ ఘటన గురించి ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. 56 మంది భారతీయ ట్రావెలర్స్‌తో జార్జియా (56 Indians Georgia) అధికారులు అమానుషంగా ప్రవర్తించారని ఓ మహిళ ఆరోపించింది. ఈ సంఘటన సదఖ్లో బోర్డర్‌లో జరిగింది. అది అర్మేనియా నుంచి జార్జియాకి వెళ్ళే ప్రధాన రోడ్డు క్రాసింగ్. ఈ విషయం గురించి ధ్రువీ పటేల్ అనే మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసి, తన అనుభవాన్ని పంచుకుంది.


ఏం జరిగింది?

ధ్రువీ పటేల్ చెప్పిన ప్రకారం, వాళ్ల గ్రూప్‌లో 56 మంది భారతీయులు ఉన్నారు. వారి దగ్గర సరైన ఈ-వీసాలు, డాక్యుమెంట్స్ ఉన్నాయి. అయినా, సదఖ్లో బోర్డర్‌లో జార్జియా అధికారులు వీళ్ళని 5 గంటలకు పైగా చలిలో నిలబెట్టారు. ఫుడ్, టాయ్‌లెట్ సౌకర్యం కూడా లేదు. ఏమీ అందించలేదని వాపోయింది. అంతేకాదు, వీళ్ళ పాస్‌పోర్ట్‌లను తీసుకుని ఎలాంటి సమాచారం ఇవ్వకుండా 2 గంటలకు పైగా సైలెంట్‌గా ఉంచారని తెలిపింది. ఇంకా దారుణం ఏంటంటే, వీరిని కింద జంతువుల మాదిరిగా కూర్చోబెట్టి దారుణంగా ట్రీట్ చేశారట వాపోయింది.

ఆ క్రమంలో వీడియో తీయడానికి ట్రై చేస్తే అడ్డుకున్నారని వెల్లడించింది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే, డాక్యుమెంట్స్ చెక్ చేయకుండానే వీసాలు తప్పుగా ఉన్నాయని అవమానించారని చెప్పింది. ధ్రువీ పటేల్ ఈ అనుభవాన్ని సిగ్గుచేటు, ఆమోదయోగ్యం కాదని పోస్ట్‌లో రాసింది. ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌లను ట్యాగ్ చేసి, భారత్ ఈ విషయంలో గట్టిగా స్పందించాలని కోరింది.


సోషల్ మీడియాలో రియాక్షన్స్

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి కొందరు కూడా తమ అనుభవాలను షేర్ చేశారు. ఇలాంటి ఘటనలు జార్జియాలో కొత్త కాదని, చాలా కాలంగా జరుగుతున్నాయని ఓ వ్యక్తి పేర్కొన్నాడు. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇండియన్స్ జార్జియాకి ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించాడు మరోక వ్యక్తి. కొందరు ఈ సంఘటనను రేసియల్ డిస్క్రిమినేషన్‌తో ముడిపెట్టారు. దీనిపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసకోవాలని ఇంకో యూజర్ అన్నాడు.

2019లో జార్జియా వెళ్లిన ఒక ట్రావెలర్ కూడా ఇలాంటి అనుభవాన్ని షేర్ చేశాడు. రష్యా నుంచి జార్జియాకి వెళ్లే ముందు ఇలాంటివి విన్నాం. కానీ మాకు ఎంట్రీ ఇచ్చారు. అదొక డ్రీమ్ ట్రిప్ అయ్యింది. చాలా సంవత్సరాలుగా భారతీయులకు సమస్యలు సృష్టిస్తున్నారు. ఇది బాధాకరమని పేర్కొన్నాడు. ఈ సంఘటన కేవలం ఒక గ్రూప్‌కి జరిగిన సమస్య కాదు. ఇది భారతీయ ట్రావెలర్స్‌కి విదేశాల్లో ఎదురవుతున్న వివక్షను ప్రస్తావిస్తుంది.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 17 , 2025 | 12:34 PM