Share News

Earthquake: భూ ప్రకంపనలు.. భయంతో జనం పరుగులు

ABN , Publish Date - Aug 19 , 2025 | 07:48 AM

ధర్మశాల సమీపంలో భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ఇళ్లలో నుంచి జనం బయటకు పరుగులు తీశారు. రిక్టార్ స్కేల్‌పై 3.9గా భూకంప తీవ్రత నమోదు అయింది.

Earthquake: భూ ప్రకంపనలు.. భయంతో జనం పరుగులు
Earthquake in Himachal Pradesh

సిమ్లా, ఆగస్ట్ 19: హిమాచల్‌ప్రదేశ్‌ కంగ్రా జిల్లా ధర్మశాల పట్టణం సమీపంలో భూమి కంపించింది. సోమవారం రాత్రి 9.28 గంటలకు ఈ భూప్రకంపనలు సంభవించాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో.. స్థానికులు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. కానీ, ఎవరికీ ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని ఉన్నతాధికారులు వెల్లడించారు. భూకంప తీవ్రత రిక్టార్ స్కేల్‌పై 3.9గా నమోదు అయిందని తెలిపారు. ధర్మశాలకు 23 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించామన్నారు.

భూమి లోపల 10 కిలోమీటర్ల అడుగు భాగంలో భూమి కంపించిందని అధికారులు తెలిపారు. అయితే రాష్ట్రంలో భూకంపం సంభవించే ప్రాంతాల జాబితాలో కంగ్రా జిల్లా సైతం ఉంది. ఈ ప్రాంతంలో భూకంపం చోటు చేసుకునే శాతం అధికంగా ఉందని ఇప్పటికే ఉన్నతాధికారులు గుర్తించారు.


Cloudburst.jpg

మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌లోని కూలు జిల్లాలో సోమవారం అర్థరాత్రి అంటే 1.30 గంటలకు మేఘ విస్పోటనం కారణంగా మెరుపు వరదలు సంభవించాయి. దీంతో జిల్లాలోని మారుమూల ప్రాంతమైన.. లఘాట్టీ గ్రామంలోని ఇళ్లు, రహదారులతోపాటు వాహనాలు సైతం ఆ వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా ఉన్నతాధికారులు వెంటనే లఘాట్టీ గ్రామానికి చేరుకున్నారు. ఇక ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. అయితే ప్రాణ నష్టానికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

భారత్‌ నుంచి అమెరికాకు 7 రెట్లు పెరిగిన ఎగుమతులు

అడవుల్లో పేలిన ఐఈడీ.. జవాన్‌ మృతి

For More National News And Telugu News

Updated Date - Aug 19 , 2025 | 11:14 AM