Yogi Adityanath: మహాకుంభ్‌లో 34 కోట్ల మంది పవిత్ర స్నానాలు
ABN , Publish Date - Feb 02 , 2025 | 06:51 PM
ఏళ్ల తరువాత రామ్‌లల్లా ప్రతిష్ఠాపన జరిగినప్పుడు సమాజ్‌వాదీ పార్టీ వ్యతిరేకించిందని, అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరు పెట్టడాన్ని వ్యతిరేకించిందని, గత రెండు నెలలుగా ఆ పార్టీ చీఫ్ మహాకుంభ్‌కు వ్యతిరేకంగా టీట్లు చేస్తూనే ఉన్నారని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
అయోధ్య: ఈ శతాబ్దంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంగా ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ్ మేళా (Maha kumbha Mela)లో ఇప్పటి వరకూ 34 కోట్ల మంది త్రివేణి సంగమ స్నానాలు చేశారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) తెలిపారు. మిల్కిపూర్ అసెంబ్లీ నియోజవర్గంలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, ఏళ్ల తరువాత రామ్‌లల్లా ప్రతిష్ఠాపన జరిగినప్పుడు సమాజ్‌వాదీ పార్టీ వ్యతిరేకించిందని, అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరు పెట్టడాన్ని వ్యతిరేకించిందని, గత రెండు నెలలుగా ఆ పార్టీ చీఫ్ మహాకుంభ్‌కు వ్యతిరేకంగా టీట్లు చేస్తూనే ఉన్నారని అన్నారు. ఈరోజు వరకూ 34 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేశారని చెప్పారు.
Delhi Assembly Elections 2025: ఏ ఒక్క మురికివాడను కూల్చం.. మోదీ భరోసా
మిల్కిపూర్ ఉప ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 5న జరుగనుంది. ఈ ఎన్నికలు జాతీయతావాదానికి, ఆనువంశిక రాజకీయాలకు మధ్య జరుగుతున్న పోరుగా యోగి ఆదిత్యనాథ్ అభివర్ణించారు. 2017లో తమ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ల్యాండ్ మ్యాఫియా నడ్డివిరిచామని, యాంటీ ల్యాండ్ మాఫియా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని, డబుల్ ఇంజన్ ప్రభుత్వం ప్రగతిపథంలోకి దూసుకువెళ్తే తమ వ్యాపారాలు దెబ్బతింటాయని ఎస్‌పీ భయపడుతోదని విమర్శించారు. ఇదే పార్టీ ఉత్తరప్రదేశ్ ప్రగతిని అడ్డుకుందని, అయోధ్యలో రామభక్తులపై తూటాలు పేల్చిందని, వారిని ఎంతమాత్రం నమ్మడానికి వీల్లేదని యోగి అన్నారు.
మిల్కిపూర్ ఉప ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీ అభ్యర్థిగా అవథేశ్ ప్రసాద్ తనయుడు అజిత్ ప్రసాద్ పోటీ చేస్తుండగా, ఇండియా కూటమి భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పోటీకి దూరంగా ఉంది. సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. బీజేపీ తమ పార్టీ అభ్యర్థిగా చంద్రభాన్ పాశ్వాన్‌ను బరిలోకి దింపింది.
ఇవి కూడా చదవండి..
Sonia Gandhi: సోనియా గాంధీపై కోర్టులో ఫిర్యాదు చేసిన న్యాయవాది.. ఎందుకంటే..
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాకు భక్తజనం.. ఫిబ్రవరి 1 నాటికి ఎంత మంది వచ్చారంటే..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి