Share News

CEC: మరో 15 రోజులే ఉన్నాయి.. మా తలుపులు తెరిచే ఉంటాయి: సీఈసీ

ABN , Publish Date - Aug 17 , 2025 | 04:42 PM

ఇటీవల జరిగిన ఎన్నికల్లో సిసీటీవీ ఫుటేజ్‌ను షేర్ చేయకపోవడానికి ఓటర్ల ప్రైవేసీని కాపాడాలన్నదే కారణమని సీఈసీ చెప్పారు. సీసీటీవీ ఫుటే‌జ్‌ను ఎన్నికల కమిషన్ షేర్ చేయకపోవడంపై రాహుల్ గాంధీ సారథ్యంలోని పలు వివక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.

CEC: మరో 15 రోజులే ఉన్నాయి.. మా తలుపులు తెరిచే ఉంటాయి: సీఈసీ
CEC

న్యూఢిల్లీ: బిహార్ ముసాయిదా ఎన్నికల జాబితాలో సవరణలకు మరో 15 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ (Gyanesh Kumar) అన్నారు. అన్ని పార్టీలకు సమానంగా ఈసీ తలుపులు తెరిచి ఉన్నాయని చెప్పారు. బీహార్ ఎస్ఐఆర్ కింద ముసాయిదా ఎన్నికల జాబితాపై ఏ రాజకీయ పార్టీకి ఎలాంటి అనుమానులు ఉన్నా తమను సంప్రదించవచ్చని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికలకు సబంధించిన వివిధ అంశాలపై ఆదివారం మధ్యాహ్నం ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.


ఇటీవల జరిగిన ఎన్నికల్లో సిసీటీవీ ఫుటేజ్‌ను షేర్ చేయకపోవడానికి ఓటర్ల ప్రైవేసీని కాపాడాలన్నదే కారణమని సీఈసీ చెప్పారు. సీసీటీవీ ఫుటే‌జ్‌ను ఎన్నికల కమిషన్ షేర్ చేయకపోవడంపై రాహుల్ గాంధీ సారథ్యంలోని పలు వివక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అవకతవకలు చోటుచేసుకోవడమే దానికి కారణమని తప్పుపట్టాయి. దీనిపీ సీఈసీ మాట్లాడుతూ, మెషీన్-రిడబుల్ ఎలక్టోరల్ రోల్స్‌కు సంబంధించి సుప్రీంకోర్టు 2019లో చాలా స్పష్టంగా చెప్పిందని, ఇందువల్ల ఓటర్ల ప్రైవసీకి భంగం కలుగుతుందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొందని తెలిపారు. గత కొద్దిరోజులుగా పలువురు ఓటర్ల ఫోటోలు వాడుకుంటూ వాటిని మీడియాకు ఫార్వార్డ్ చేస్తుండటం చూస్తున్నామని, అలాంటప్పుడు మన తల్లులు, ఆడకూతుళ్ల ఫోటోలతో కూడిన సీసీటీవీ ఫుటేజ్‌ను కమిషన్ షేర్ చేయాలా? అని సీఈసీ ప్రశ్నించారు.


బెంగాల్‌, ఇతర రాష్ట్రాల్లో ఎస్ఐఆర్‌పై..

పశ్చిమబెంగాల్, ఇతర రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ఎప్పుడు నిర్వహించాలనేది ఎన్నికల సంఘం నిర్ణయిస్తుందని, తగిన సమయంలో నిర్ణయాన్ని ప్రకటిస్తామని సీఈసీ తెలిపారు. ఎన్నికల ముందు ఎన్నికల జాబితాను సవరించడం ఎన్నికల కమిషన్ పని అని ఒక ప్రశ్నకు సమాధానంగా జ్ఞానేష్ కుమార్ తెలిపారు.


ఇవి కూడా చదవండి..

వివక్షకు తావులేదు..అన్నీ పార్టీలూ సమానమే: ఈసీ

అంతా కృష్ణమయం... ద్వారకా ఎక్స్‌ప్రెస్‌ వేను జాతికి అంకితం చేసిన ప్రధాని

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 17 , 2025 | 04:47 PM