14 Year Old Forcibly Married: కర్ణాటకలో దారుణం.. 14 ఏళ్ల బాలికకు బలవంతంగా పెళ్లి చేసి ఆపై..
ABN , Publish Date - Mar 07 , 2025 | 10:58 AM
కర్ణాటకలో తాజాగా దారుణం వెలుగు చూసింది. 14 ఏళ్ల చిన్నారిని బలవంతంగా పెళ్లి చేసుకున్న ఓ ప్రబుద్ధుడు చిన్నారిని భుజాన వేసుకుని తన ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. విషయం పోలీసులకు తెలియడంతో నిందితులపై పోక్సో, బాల్య వివాహ చట్టాల కింద కేసు నమోదు చేశారు.

ఇంటర్నె్ట్ డెస్క్: నిర్మానుష్య ప్రదేశంలో దిక్కులు పిక్కటిల్లేలా బాలిక ఆర్తనాదాలు.. ఆమెను భుజాన వేసుకుని బలవంతంగా తీసుకెళుతున్న 29 ఏళ్ల యువకుడు. వారి వెనకే మౌనంగా నడుచుకుంటూ వెళుతున్న ఓ జంట.. ఇదంతా ఏదైనా సినిమాలో దృశ్యం అనుకుంటే మనం పొరబడ్డట్టే. కర్ణాటకలో ఇటీవల జరిగిన బాల్య వివాహం తాలూకు భయానక దృశ్యాలు ఇవి (14 Year Old Forcibly Married in Karnataka).
పూర్తి వివరాల్లోకి వెళితే.. హోసూర్ జిల్లా తిమ్మతూర్ గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక స్థానికంగా ఉన్న పాఠశాలలో 7వ తరగతితోనే చదువు ఆపేసింది. ఇంటిపట్టునే ఉంటున్న ఆమెకు కుటుంబసభ్యులు తమ బంధువు అయిన 29 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి బలవంతంగా పెళ్లి చేశారు. మార్చి 3న బెంగళూరులో ఈ పెళ్లి జరిగింది. కానీ చిన్నారి మాత్రం తొలి నుంచి ఈ పెళ్లికి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇక వివాహం అనంతరం చిన్నారిని కుటుంబసభ్యులు తమ ఇంటికి తీసుకొచ్చారు. భర్తతో పాటు వెళ్లడం ఇష్టం లేని బాలిక అక్కడి నుంచి తప్పించుకుని తన అమ్మమ్మ ఇంటికి పారిపోయింది.
UP Father kills Daughter: పొరుగింటి వారితో వివాదం.. 5 ఏళ్ల కూతురిని పొట్టన పెట్టుకున్న తండ్రి
అయితే, బుధవారం నాడు, భర్త ఆమె బంధువు ఒకరు బాలికను భుజాన వేసుకుని తమతో పాటు తీసుకెళ్లారు. వారి వెంటనే మరో జంట కూడా వెళ్లింది. ఇందుకు సంబంధించిన దారుణ దృశ్యాలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. మరోవైపు బాలిక అమ్మమ్మ నుంచి ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలిక తల్లి, చిన్నారిని బలవంతంగా వివాహం చేసుకున్న వ్యక్తి, అతడి మేనమామపై బాల్య వివాహ చట్టం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ‘‘బాల్య వివాహ చట్టం, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశాము. బాలికను ప్రశ్నిస్తున్నాము. ఆ తరువాత ఆమెకు భద్రత కల్పించేందుకు వన్ స్టాప్ సెంటర్‌కు తరలిస్తాము’’ అని జిల్లా ఎస్పీ పీ. తంగదురై పేర్కొన్నారు. ప్రస్తుతం బాలిక తన అమ్మమ్మ తాతయ్యల వద్ద ఉన్నది.
Miss Fire: పోలీసు తుపాకీ మిస్‌ఫైర్.. మహిళకు గాయాలు
బాల్యవివాహాల నిరోధక చట్టం ప్రకారం 18 ఏళ్ల బాలికలకు వివాహలు జరిపించడం నేరం. అటువంటి వివాహాలు చెల్లవు. ఇలాంటి పెళ్లిళ్లు చేసేవారు, ఘటనకు సంబంధించిన వారు, మైనర్‌ను పెళ్లి చేసుకున్న వారికి కఠిన శిక్షలు వేస్తారు. నిబంధనలు ఇంత కఠినంగా ఉన్నా కూడా రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, బీహార్, ఏపీ ప్రాంతాల్లో బాల్యావివాహాలు వెలుగు చూస్తున్నాయి.