Share News

Breaking News: పల్నాడు జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లిన విద్యార్థులు గల్లంతు

ABN , First Publish Date - Jan 05 , 2025 | 10:01 AM

Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Breaking News: పల్నాడు జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లిన విద్యార్థులు గల్లంతు
Breaking News Live Updates

Live News & Update

  • 2025-01-05T17:39:15+05:30

    ఈతకు వెళ్లిన విద్యార్థులు గల్లంతు

    • పల్నాడు జిల్లాలో విషాదం

    • సత్తెనపల్లి అమరావతి బ్రాంచ్ కెనాల్‌లో ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు గల్లంతు

    • కాలువలో ఈతకు దిగిన ఐదుగురు బాలురు

    • గల్లంతైన గొపిచందు, చరణ్

    • తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు

    • విద్యార్థుల కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు

  • 2025-01-05T13:17:24+05:30

    అయ్యప్ప సొసైటీలో హైడ్రా కూల్చివేతలు..

    • మాదాపూర్: అయ్యప్ప సొసైటీలో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు.

    • సుమారు రెండు గంటల నుండి కొనసాగుతున్న కూల్చివేతలు.

    • మొదటగా భవనం వెనుక భాగం నుండి నేలమట్టం చేస్తున్న అధికారులు.

    • ఇప్పటి వరకు రెండు అంతస్తుల వరకు గోడలు కూల్చిన బుల్డోజర్.

    • మరికొద్ది సేపట్లో రానున్న భారీ బాహుబలి మిషన్.

    • బాహుబలి మిషన్ వచ్చిన తరువాత పిల్లర్లు కూల్చి నేలమట్టం చేసే అవకాశం.

  • 2025-01-05T13:14:05+05:30

    గుడివాడలో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం.

    • కృష్ణా జిల్లా: గుడివాడలో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం.

    • రైలుపేటలో జరిగిన దారుణ ఘటన.

    • చిన్నారికి గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌లో చికిత్స.

    • ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన టూ టౌన్ పోలీసులు.

    • రైలు పేటలోని బాలిక ఇంటి వద్ద స్వయంగా విచారణ చేపట్టిన గుడివాడ డిఎస్పీ అబ్దుల్ సుబాన్.

    • అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి ఎండూరి జోజి బాబు (42)గా గుర్తింపు.

    • కామాంధుడిని అదుపులో తీసుకున్నట్లు పోలీసు వర్గాల సమాచారం.

    • బాలిక ఇంటి సమీపంలో ముఠా కార్మికుడిగా పనిచేస్తున్న జోజి బాబు.

  • 2025-01-05T13:03:14+05:30

    ప్రారంభమైన వీహెచ్‌పీ హైందవ శంఖారావం సభ

    • అమరావతి: కేసరపల్లిలో ప్రారంభమైన వీహెచ్‌పీ హైందవ శంఖారావం సభ

    • వేదిక పై‌ఆశీనులైన ఉత్తరాది దక్షిణాదికి చెందిన మఠాధిపతులు, పీఠాధిపతులు

    • వీహెచ్‌పీ ప్రతినిధులు గోకరాజు గంగరాజు, అలోక్‌కుమార్, మిలింద్ పరాండ్, కోటేశ్వర శర్మ,

    • సభా వేదిక ముందు ఆహుతులతో కలిసి కింద సీట్లలో కూర్చున్న బిజెపి నేతలు పురంధేశ్వరి, సత్యకుమార్, విష్ణుకుమార్ రాజు, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాసరావు, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, మాధవ్.

    • స్వామీజీల శంఖారావాలతో సభ ప్రారంభం.

    • జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగిన సభా ప్రాంగణం.

  • 2025-01-05T10:47:30+05:30

    కేసర్‌పల్లిలో వీహెచ్‌పీ ఆధ్వర్యంలో హైందవ శంఖారావం.

    • ఆలయాల పరిరక్షణ, స్వయం ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్‌తో జాతీయ ఉద్యమం.

    • దేశ వ్యాప్త పోరాటానికి విజయవాడ నుంచి ప్రారంభం.

    • అన్ని రాష్ట్రాల్లో హైందవ శంఖారావం సభలు.

    • నేడు శంఖారావ సభలో పాల్గొననున్న వీహెచ్‌పీ జాతీయ ప్రతినిధులు, బీజేపీ నేతలు.

    • మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామీజీలు.

    • మధ్యాహ్నం 12 తరువాత సభ ప్రారంభం.

    • భారతీయ సంస్కృతి, జానపద కళా ప్రదర్శనలతో ఆకట్టుకున్న కళాకారులు.

    • జై శ్రీరామ్ అనే నినాదంతో మారుమోగుతున్న సభా ప్రాంగణం, రోడ్లు.

    • హిందూ జాతీయ ఉద్యమానికి మూడు లక్షల మందితో తొలి సభకు నేడు అంకురార్పణ.

  • 2025-01-05T10:43:32+05:30

    చిక్కడపల్లి పీఎస్‌కు అల్లు అర్జున్..

    • సంధ్య థియేటర్‌ ఘటనలో విచారణకు హాజరైన అర్జున్.

    • ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు ఆదేశం.

  • 2025-01-05T10:35:33+05:30

    సినిమాలకు టికెట్ల ధరలు పెంచడాన్ని ఖండించిన సీపీఐ..

    • అమరావతి: ఏపీలో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలకు టికెట్ల ధరలు పెంచడాన్ని ఖండించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.

    • రాత్రి ఒంటిగంట బెనిఫిట్ షో టికెట్ ధర రూ.600, మల్టీప్లెక్స్ టికెట్ కు అదనంగా రూ.175, సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ కు అదనంగా రూ.135 పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వటం దుర్మార్గం.

    • ఏపీలో సినిమా టికెట్ ధరలు పెంపుపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సరికాదు.

    • ప్రజల అభిమానాన్ని బలహీనతగా చూడటం తగదు.

    • తెలంగాణ తరహాలో ఏపీలో కూడా సినిమా టికెట్ల ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతిని రద్దు చేయాలి.

  • 2025-01-05T10:34:28+05:30

    హైదరాబాద్ వ్యాప్తంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలు..

    • హైదరాబాద్: గ్రేటర్ వ్యాప్తంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంక్రాంతి ముత్యాల ముగ్గుల పోటీలు.

    • సిటీలో 9 సెంటర్లలో ముత్యాల ముగ్గుల పోటీలు.

    • KPHB జిహెచ్ఎంసి బాస్కెట్ బాల్ గ్రౌండ్ లో భారీగా పాల్గొన్న మహిళలు.

    • ముత్యాల ముగ్గుల పోటీలను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్లు.

  • 2025-01-05T10:01:34+05:30

    అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు..

    • అల్లు అర్జున్ ఇంటికి రాంగోపాల్పేట పోలీసులు.

    • కిమ్స్ లో శ్రీ తేజ పరామర్శకు రావద్దనీ నోటీస్.

    • అల్లు అర్జున్ మేనేజర్ మూర్తికి నోటీస్ అందచేసిన పోలీసులు.