-
-
Home » Mukhyaamshalu » Today Breaking News Maha Kumbh 2025, Latest Telugu News Updates Wednesday 29 th january 2028 Siva
-
BIG Breaking: ఏపీకి కొత్త డీజీపీ.. ఎవరంటే
ABN , First Publish Date - Jan 29 , 2025 | 11:49 AM
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
2025-01-29T20:46:49+05:30
ఏపీకి కొత్త డీజీపీ
ఏపీ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా
ద్వారకా తిరుమలరావు స్థానంలో హరీష్ కుమార్ గుప్తాను నియమిస్తూ ఉత్తర్వులు
విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా ఉన్న హరీష్ కుమార్ గుప్తా
-
2025-01-29T20:11:33+05:30
వికటించిన మధ్యాహ్న భోజనం
ఎల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో వికటించిన మధ్యాహ్న భోజనం
14 మంది విద్యార్థులకు అస్వస్థత
విద్యార్థులను ఆసుపత్రికి తరలించిన పాఠశాల సిబ్బంది
-
2025-01-29T12:18:43+05:30
Jani Master: జానీ మాస్టర్ సంచలన ట్వీట్..

‘తమ సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్ల పై కూడా తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలేస్తుంది. ముందస్తుగా నాకు తెలియకుండా జరిగిన యునియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి నేను పెట్టిన కేసుకి సంబంధించి వచ్చిన తీర్పుని మీకు అనుకూలంగా, నచ్చినట్టుగా మార్చి మరో కేసుతో ముడిపెట్టి పోస్టులు పెడుతూ ఉన్నారు. మీరేది చెప్పినా ప్రజలు నమ్ముతారనుకుంటున్నారేమో కానీ అసలు తీర్పు వివరాలు బయటకి వచ్చిన రోజున మీ నిజస్వరూపమేంటో, దేనికోసం ఈ దుష్ప్రచారం చేస్తున్నారని అందరికీ అర్థమవుతుంది. ఆ రోజు ఎంతో దూరం లేదు. న్యాయమే గెలుస్తుంది, నిజం అందరికీ తెలుస్తుంది.’
-
2025-01-29T12:13:52+05:30
తొక్కిసలాట ఘటనపై సీఎం దిగ్భ్రాంతి
ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎ.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.
ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం.
ఆ కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఆదుకోవాలని, గాయపడినవారికి సరైన వైద్యం అందించాలన్న సీఎం.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న సీఎం.
-
2025-01-29T11:52:21+05:30
కేటీఆర్, హరీష్ రావు నా కాలి గోటికి కూడా సరిపోరు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కేటీఆర్, హరీష్ రావు నా కాలి గోటికి కూడా సరిపోరు.
కేటీఆర్ పనికిరానోడు. పనికి రాని మాటలు మాట్లాడుతున్నాడు.
తెలంగాణ ఉధ్యమంలో గద్దర్ ఉన్నడా? బండి సంజయ్ ఉన్నడా?
గద్దర్ కు అవార్డ్ ఇస్తే తప్పేంటి?
మా మీటింగ్లో పల్లీలు, ఐస్ క్రీం అమ్ముకునే మంది అంత కూడా కేటీఆర్ మీటింగ్‌కి రాలేదు.
నల్లగొండలో టీ హాబ్‌కు తాళం వేసిందే కేటీఆర్.
కేటీఆర్ నీలాగా నాపై అవినీతి ఆరోపణలు లేవు.
కేసీఆర్ లాగా నేను ఎలక్షన్, కలెక్షన్ చేయలేదు.
ప్రతిపక్ష నేత పదవి కోసం హరీష్ రావు, కేటీఆర్ కత్తులతో పొడుచుకుంటున్నారు.
ప్రతిపక్ష నేతగా భట్టి పాదయాత్ర చేసి, ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.
కేసీఆర్ బడ్జెట్ సెషన్‌కు వస్తవో రావో చెప్పు.
-
2025-01-29T11:49:38+05:30
దూకుడు పెంచిన బీజేపీ..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన బిజెపి.
కర్తార్ నగర్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ .
12.30 కర్తార్ నగర్ సభలో ఢిల్లీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోడీ.
-
2025-01-29T11:49:01+05:30
మహాకుంభమేళలో అపశృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని..
ఢిల్లీ: మహాకుంభమేళలో జరిగిన అపశృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.
గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని కోరిన నేతలు.
బాధితులకు సాధ్యమైనంత సహాయం అందించాలని కాంగ్రెస్ కార్యకర్తలను అభ్యర్థించిన రాహుల్ గాంధీ.
మహా కుంభమేళా జరిగిన పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్న సీఎం యోగి.
మహా కుంభమేళా వార్ రూమ్ చీఫ్ సెక్రటరీ డిజిపి హోంశాఖ అధికారులతో చర్చించిన సీఎం యోగి.
మౌని అమావాస్యనాడు త్రివేణి జలాల్లో పుణ్య స్థానాలు ఆచరించడానికి భారీగా వస్తున్న భక్తులు.
కుంభమేళా ప్రారంభం నుంచి నిన్న ఉదయం వరకు 19.94 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించినట్టు వెల్లడించిన యూపీ ప్రభుత్వం.