-
-
Home » Mukhyaamshalu » Today Breaking News Maha Kumbh 2025, Latest Telugu News Updates Tuesday 04 th February 2028 Siva
-
Breaking News: లోకేష్‌తో ప్రశాంత్ కిశోర్ భేటీ
ABN , First Publish Date - Feb 04 , 2025 | 10:31 AM
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
2025-02-04T20:48:39+05:30
లోకేష్‌తో ప్రశాంత్ కిశోర్ భేటీ
లోకేష్ ఢిల్లీ పర్యటనలో ఆసక్తికర పరిణామం
సాయంత్రం టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి,
మంత్రి నారా లోకేష్ తో ప్రశాంత్ కిషోర్ భేటీ
బీహార్ లో రాజకీయ పార్టీ నడుపుతున్న ప్రశాంత్ కిషోర్
ఇద్దరి మధ్య పలు కీలక విషయాలపై చర్చ
-
2025-02-04T19:39:38+05:30
చర్లపల్లి పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం
సుగుణ కెమికల్స్ పరిశ్రమలో ఎగసిపడుతున్న మంటలు
మంటల ధాటికి పేలుతున్న రసాయన డ్రమ్ములు
దట్టమైన పొగలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న స్థానికులు
-
2025-02-04T19:37:22+05:30
చంద్రబాబుతో ఫౌల్ట్రీ ఫెడరేషన్ సభ్యుల భేటీ
సీఎం చంద్రబాబుతో ఏపీ ఫౌల్ట్రీ ఫెడరేషన్ కార్యవర్గం సమావేశం
లేయర్ పౌల్ట్రీ ఫార్మర్స్ ఎదుర్కొంటున్న సమస్యలు వివరించిన నేతలు
ఫౌల్ట్రీ పరిశ్రమకు గతంలోలాగే సాయం అందించాలని విజ్ఞప్తి
ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని సీఎం చంద్రబాబు హామీ
-
2025-02-04T19:34:02+05:30
పట్టాలు తప్పిన రైలు
గుంతకల్లు రైల్వేస్టేషన్ సౌత్‌యార్డులో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
గుంతకల్లు నుంచి గుత్తి వైపు వెళ్తుండగా పట్టాలు తప్పిన రైలు
గుంతకల్లు మీదుగా రైళ్ల రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేత
పట్టాలపై బోగీని తొలగించే పనులను వేగవంతం చేసిన అధికారులు
-
2025-02-04T17:50:24+05:30
లోక్‌సభలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
పదేళ్లుగా స్కామ్‌లు లేవు
రాష్ట్రపతి ప్రసంగం కొందరికి బోర్‌గా అనిపించింది
గతంలో ఢిల్లీ నుంచి రూపాయి పంపితే గల్లీకి 15 పైసలు చేరుతుందని ఓ ప్రధాని చెప్పారు
ప్రస్తుతం రూపాయికి రూపాయి గల్లీకి చేరుతుంది
ఎన్నికల వేళ కొంతమంది అమలుకాని హామీలు ఇస్తున్నారు
కొన్ని పార్టీలు యువతను మోసం చేస్తున్నాయి
పరోక్షంగా ఆప్‌పై మోదీ విమర్శలు
-
2025-02-04T17:17:33+05:30
లోక్‌సభలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో మాట్లాడుతున్న ప్రధాని మోదీ
మా లక్ష్యం వికసిత్ భారత్
పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికాన్ని జయించారు
దేశ ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నాం
రాష్ట్రపతి ప్రసంగం మాలో ఆత్మ విశ్వాసం నింపింది
మూడోసారి దేశ ప్రజలు ఆశీర్వదించారు
నాలుగు కోట్ల మందికి పక్కా ఇళ్లు నిర్మించాం
-
2025-02-04T17:07:32+05:30
రాజమండ్రిలో భారీ అగ్ని ప్రమాదం
రాజమండ్రిలో భారీ అగ్నిప్రమాదం
రిజర్వు ఫారెస్ట్‌లో అ గ్ని ప్రమాదం
ఆందోళనలో చుట్టుపక్కల జనం
దివాన్ చెరువు సమీపంలో ప్రమాదం
-
2025-02-04T13:16:49+05:30
దోమల నివారణకు డ్రోన్స్ వచ్చేస్తున్నాయ్..
రంగారెడ్డి: రాజేంద్రనగర్ అత్తాపూర్ మూసిలో దోమల నిర్ములనకు డ్రోన్ యాంటీ లార్వెల్ ఆపరేషన్.
మూసి నుండి దోమలను నిర్ములించడానికి డ్రోన్‌లను ఉపయోగిస్తున్న జీహెచ్ఎంసీ.
లంగర్ హౌస్, అత్తాపూర్ మధ్య మూసిలో యాంటీ-లార్వా రసాయలను చల్లిన డ్రోన్.
దోమల వల్ల ప్రజలు ప్రబలే వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్న జీహెచ్ఎంసీ అధికారులు.
మూసి లోపలి భాగంలోను డ్రోన్‌లతో కెమికల్స్ చల్లి దోమల నివారణ చర్యలను ముమ్మరంగా నిర్వహించిన అధికారులు.
మలేరియా, డెంగ్యూ వ్యాధి, విషపూరిత జ్వరాల బారిన పడకుండా మూసి చుట్టుపక్కల ప్రాంతాల్లో చర్యలు చేపట్టిన అధికారులు.
-
2025-02-04T13:12:31+05:30
బాపట్ల: చీరాలలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు వివాదం
మున్సిపల్ చైర్మన్, వైసీపీ కౌన్సిలర్లతో..
విగ్రహం ఏర్పాటుకు మాజీమంత్రి రామారావు శంకుస్థాపన
ఎన్టీఆర్ చిత్రపటాన్ని పసుపునీళ్లతో శుద్ధి చేసిన టీడీపీ నేతలు
ఎమ్మెల్యే కొండయ్యకు సమాచారం ఇవ్వకుండా..
విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపనపై టీడీపీ శ్రేణుల ఆగ్రహం
-
2025-02-04T13:12:14+05:30
శ్రీకాకుళం: పాలకొండ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా
కోరం లేక నిలిచిన మున్సిపల్ చైర్మన్ ఎన్నిక
-
2025-02-04T13:11:47+05:30
తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా
కౌన్సిల్‌లో టీడీపీ, వైసీపీ నాయకుల ఆందోళన మధ్య వాయిదా
-
2025-02-04T13:11:14+05:30
పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా
కోరం లేక నిలిచిన వైస్ చైర్మన్ ఎన్నిక
32 మంది సభ్యులకు గానూ హాజరైన ఐదుగురు
-
2025-02-04T13:08:49+05:30
ముగిసిన తెలంగాణ కేబినెట్ సమావేశం..
ముగిసిన తెలంగాణ కేబినెట్ సమావేశం.
కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలకు కేబినెట్ ఆమోదం.
కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.
కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై చర్చ.
అసెంబ్లీలో కీలక ప్రకటన చేయనున్న సీఎం రేవంత్.
కులగణన, బీసీ రిజర్వేషన్ల పెంపుపై తీర్మానం చేసి.
కేంద్రానికి పంపనున్న తెలంగాణ ప్రభుత్వం.
-
2025-02-04T13:02:37+05:30
కేసీఆర్‌కు సందేశం పంపిన ప్రధాని మోదీ..
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోదరి చీటి సకులమ్మ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం.
కేసీఆర్‌కు సంతాప సందేశాన్ని పంపిన ప్రధాని.
అక్క మరణంతో బాధాతప్త హృదయంతో వున్న కేసీఆర్, వారి కుటుంబ సభ్యులకు ప్రధాని ప్రగాఢ సానుభూతి తెలిపారు.
-
2025-02-04T11:43:32+05:30
బిగ్ బ్రేకింగ్.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు..
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు.
బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది.
ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన అసెంబ్లీ కార్యదర్శి.
పార్టీ ఫిరాయింపుల పై లిఖిత పూర్వక సమాధానం చెప్పాలని నోటీస్.
పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టు ను ఆశ్రయించిన బిఆర్ఎస్.
-
2025-02-04T11:24:50+05:30
తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నికలో గందరగోళం
కాకినాడ: సోమవారం వాయిదా అనంతరం ప్రారంభమైన వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ.
కౌన్సిల్ హాలుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్న 30 వార్డ్ల కౌన్సిలర్లు.
ఈ ఎన్నికలు అనైతకం జరపటానికి వీలు లేదు అంటున్న, కూటమి పార్టీల శ్రేణులు, దళిత సంఘాల నాయకులు.
పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు.
ఇరు పార్టీల నాయకులు పోటాపోటీగా నినాదాలు.
మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు వ్యతిరేకంగా నినాదాలు.
దళితులకు క్షమాపణ చెప్పాలంటే పట్టు.
-
2025-02-04T11:11:46+05:30
దానం నాగేందర్ సంచలన కామెంట్స్..

నేను పోలీసులతో, హైడ్రా విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు.
మా ఏరియాకు వస్తే ఊరుకునేది లేదని రంగనాథ్‌కు చెప్పాను.
పేదల ఇళ్లను కూలుస్తాం అంటే ఊరుకోను.
అవసరమైతే జైలుకు పోతా కానీ కాంప్రమైజ్ కాను.
నా ఇంట్లో వైఎస్, కేసిఆర్ పోటీలున్నాయి.
రేవంత్ రెడ్డి ఫోటో ఇంకా రాలేదు.
-
2025-02-04T10:31:26+05:30
పశ్చిమగోదావరి: తణుకు రూరల్ ఎస్ఐ మూర్తి ఆత్మహత్య కేసులో ట్విస్ట్.
ఉన్నతాధికారుల వేధింపుల వలనే ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం.
ఆత్మహత్యకు ముందు స్నేసితునితో ఫోన్‌లో మాట్లాడిన మూర్తి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో కాల్.
ఆ ఇద్దరు వలనే నాశనం అయ్యాను.. వారు తప్పించుకుని, నన్ను ఇరికించారంటూ ఆవేదన.
నాకు తూర్పుగోదావరికి పోస్టింగ్ కావాలని ఉంది.
కానీ కృష్ణా జిల్లాకు ఇస్తామంటున్నారు.
అక్కడ పనిచేయలేనని వాపోయిన ఎస్ఐ.
ఇక నాకు వేరే మార్గం లేదు.. ఆత్మహత్యే శరణ్యం అంటూ మాట్లాడిన మూర్తి.
నీ భార్య, పిల్లలను గురించి ఒక్కసారి ఆలోచించు.. అటువంటి పని చేయకు అంటూ వారించిన ఎస్ఐ మూర్తి స్నేహితుడు.
తరువాత తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న మూర్తి.
జనవరి 31వ తేదీన ఘటన.