-
-
Home » Mukhyaamshalu » Today Breaking News Maha Kumbh 2025, Latest Telugu News Updates Thursday 30 th january 2028 Siva
-
Breaking News: ఆసక్తి రేపుతున్న మున్సిపల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు
ABN , First Publish Date - Jan 30 , 2025 | 10:07 AM
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
2025-01-30T18:47:31+05:30
ఆసక్తి రేపుతున్న మున్సిపల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు
గుంటూరులో ఆసక్తి రేపుతున్న మున్సిపల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు
వైసిపి కార్పోరేటర్లను క్యాంపునకు తరలింపు.
వచ్చే నెల 3వ తేదిన స్టాండింగ్ కమిటీ ఎన్నికలు.
ఇప్పటికే ముగ్గురు టిడిపిలో చేరడంతో అప్రమత్తమైన వైసిపి
30 మంది కార్పోరేటర్లను క్యాంపునకు తరలింపు
మరో ముగ్గురు సభ్యుల మద్దతు కోసం టిడిపి ప్రయత్నాలు
-
2025-01-30T16:37:17+05:30
9వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..
పల్నాడు జిల్లా మాచర్లలోని ఓ ప్రయివేట్ స్కూల్‌లో 9వ తరగతి విద్యార్థి పందిరి రాజశేఖర్ ఆత్మహత్య
హాస్టల్ గదిలో ఫ్యాన్‌కి ఉరి వేసుకున్న విద్యార్థి రాజశేఖర్
సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న మాచర్ల రూరల్ పోలీసులు
-
2025-01-30T16:05:18+05:30
చలి ఉత్సవాల్లో హెలి టూరిజం..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అరకు చలి ఉత్సవాల్లో భాగంగా హెలి టూరిజం ప్రారంభం
ఇవాళ హెలి టూరిజాన్ని ప్రారంభించిన అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఐటిడిఏ పిఓ అభిషేక్
పర్యాటకులకు అందుబాటులోకి హెలి రైడ్ సేవలు.
మూడు రోజులు హెలి టూరిజం నిర్వహణ.
-
2025-01-30T16:05:17+05:30
కార్మికుల నిరసన
అచ్యుతాపురంలోని బ్రాండిక్స్ గేటు వద్ద కార్మికులు నిరసన
పరిశ్రమలో అదనపు పని గంటలను నిరసిస్తూ కార్మికులు ఆందోళన
కార్మికుల పనిగంటలు నిబంధనల ప్రకారం అమలు చేయాలని వేలాదిమంది కార్మికులు నినాదాలు
-
2025-01-30T16:05:16+05:30
అప్పుల బాధ తాళలేక..
విశాఖ జిల్లా భీమునిపట్నం జోన్ కాపులుప్పాడలో అప్పుల బాధ తాళలేక యువకుడు సంతోష్ మృతి
మృతుడుఐఎన్‌ఎస్ కళింగలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా గుర్తింపు
-
2025-01-30T16:05:15+05:30

పద్మశ్రీ నాగఫణిశర్మను కలిసిన బీజేపీ నేత
పద్మశ్రీ నాగఫణిశర్మను మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ నేత నీరుకొండ వీరన్న చౌదరి
నాగఫణిశర్మను శాలువాతో సత్కరించిన వీరన్న చౌదరి
కళారంగంలో ఆయన సేవలను గుర్తించి పద్మశ్రీ ఇవ్వడం సంతోషకరమన్న వీరన్న చౌదరి
ఇటీవల కళారంగంలో నాగఫణి శర్మకు పద్మశ్రీ ప్రకటించిన కేంద్రం
-
2025-01-30T15:52:28+05:30
ఏటికొప్పాక కళాకారుడికి సత్కారం
యలమంచిలి జనసేన పార్టీ కార్యాలయంలో ఏటికొప్పాక హస్త కళాకారుడు సంతోష్‌ను సత్కరించిన ఎమ్మెల్యే విజయ్ కుమార్
ఢిల్లీ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించిన ఏటికొప్పాక బొమ్మల శకటాన్ని రూపొందించిన సంతోష్
-
2025-01-30T15:38:31+05:30
సీఎం చంద్రబాబు సంచలన ట్వీట్
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో సిఎం చంద్రబాబు ట్వీట్
1995- ఈ గవర్నెన్స్
2025- వాట్సాప్ గవర్నెన్స్ అంటూ ట్వీట్
9552300009 నెంబర్‌ను వాట్సాప్ గవర్నెన్స్ ఇన్ ఏపి అంటూ హ్యష్ ట్యాగ్ చేసిన సీఎం
-
2025-01-30T12:52:13+05:30
వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించిన మంత్రి లోకేష్
తొలిదశలో ప్రజలకు అందుబాటులోకి 161 సేవలు
వాట్సాప్ గవర్నెన్స్ సేవల కోసం మెటాతో ఒప్పందం
మంత్రి లోకేష్ కామెంట్స్..
దేశంలోనే తొలిసారి ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్.
ప్రపంచంలోనే ఎక్కడా ఇలాంటి సేవలు లేవు.
వాట్సాప్ గవర్నెన్స్‌తో సులభంగా సమస్యల పరిష్కారం.
యువగళం పాదయాత్రలోనే వాట్సాప్ గవర్నెన్స్ ఆలోచన.
మాది ప్రజా ప్రభుత్వం.
ప్రజల చేతుల్లో పాలన ఉండాలన్నదే మా ఉద్దేశం.
భవిష్యత్‌లో మరిన్ని ప్రభుత్వ సేవలకు విస్తరణ.
మొత్తం 360 సేవల్లో వాట్సాప్ గవర్నెన్స్.
ప్రతి సర్టిఫికెట్ పైన క్యూఆర్ కోడ్ ఉంటుంది.
వాట్సాప్ గవర్నెన్స్‌తో ఎక్కడా నకిలీకి ఆస్కారం ఉండదు.
యువగళం పాదయాత్రలో అన్ని వర్గాలను కలిశా.
గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసాన్ని కళ్లారా చూశా.
-
2025-01-30T11:34:14+05:30
తెలంగాణ సచివాలయంలో నకిలీ ఉద్యోగులు..
ఫేక్ ఐడెంటిటీ కార్డులతో సచివాలయంలోకి ఎంట్రీ.
ఉద్యోగుల పేరిట దర్జాగా తిరుగుతూ సెక్షన్ ఆఫీసుల్లో హల్చల్.
సెక్షన్ ఆఫీసుల్లో పనులు చేపిస్తామంటూ దందాలు.
నకిలీ ఉద్యోగుల సమాచారంతో అప్రమత్తమైన సచివాలయ భద్రత సిబ్బంది.
నకిలీ ఉద్యోగుల కదలికలపై సెక్రటేరియట్ సిఎస్ఓ దేవిదాస్ ఆదేశాల మేరకు నిఘా పెట్టిన ఇంటెలిజెన్స్.
పూర్తి ఆధారాలు సేకరించి చాకచక్యంగా ఓ నకిలీ ఉద్యోగిని పట్టుకున్న ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ యూసుఫ్,హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు.
రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా ఫేక్ ఐడి కార్డుతో చలామణి అవుతున్న ఖమ్మంకు చెందిన భాస్కర్ రావు.
మైనార్టీ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ వి. ప్రశాంత్, డ్రైవర్ రవి.. భాస్కర్ రావు ఫేక్ ఐడి కార్డు తయారు చేసినట్లు గుర్తించిన ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్.
డ్రైవర్ రవినీ అదుపులోకి తీసుకున్న ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్.
రెవెన్యూ శాఖ జూనియర్ అసిస్టెంట్‌గా ఫేక్ ఐడి కార్డుతో చలామణి అవుతున్న భాస్కర్ రావు, డ్రైవర్ రవిని ఇంటెలిజెన్స్ ఫిర్యాదుతో అదుపులోకి తీసుకొని విచారిస్తున్న సైఫాబాద్ పోలీసులు.
-
2025-01-30T11:04:14+05:30
జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్‌లో డిష్యూం డిష్యూం..
బీఆర్‌ఎస్ సభ్యుల నుంచి ప్లకార్డులు లాక్కొని చించేసిన కాంగ్రెస్ కార్పొరేటర్లు CN రెడ్డి, బాబా ఫసియుద్దీన్.
ఒకరినొకరు తోసేసుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్లు.
కౌన్సిల్ మీటింగ్‌లోకి ఎంటర్ అయిన మార్షల్స్.
మేయర్ పోడియంపై ప్లకార్డులు విసిరిన బీఆర్ఎస్ సభ్యులు.
-
2025-01-30T10:58:40+05:30
జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్‌లో రచ్చ రచ్చ..

జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం.
మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన సమావేశం.
మాజీ ప్రధాని మన్మోహన్, రతన్ టాటాకు కౌన్సిల్ నివాళులు.
రూ.8,440 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన మేయర్ విజయలక్ష్మి.
మేయర్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నినాదాలు.
బడ్జెట్‌పై మాట్లాడాలని సభ్యులను కోరిన మేయర్.
ప్రజా సమస్యలపై మాట్లాడాలని పట్టుబట్టిన విపక్షాలు.
మేయర్ పోడియంను చుట్టుముట్టిన విపక్ష సభ్యులు.
సభను 5 నిమిషాల పాటు వాయిదా వేసిన మేయర్.
-
2025-01-30T10:54:40+05:30
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అప్‌డేట్..
ఫోన్ టాపింగ్ కేసులో భుజంగరావు, రాధా కిషన్ రావుకు బెయిల్ మంజూరు.
లక్ష రూపాయలతో కూడిన 2 షూరిటీలూ సమర్పించాలని షరతు విధించిన హైకోర్టు
పాస్ పోర్టులు సమర్పించాలని ఇద్దరినీ ఆదేశించిన హైకోర్టు.
దర్యాప్తునకు సహకరించాలని ఆదేశం.
-
2025-01-30T10:46:40+05:30
మహాత్మా గాంధీకి నివాళులర్పించిన మంత్రి లోకేష్..
అమరావతి: సత్యం, అహింసలే ఆయుధాలుగా దేశానికి స్వాతంత్య్ర సముపార్జించిన జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళి అర్పిస్తున్నాను.
అహింస అనే ఆయుధంతో సూర్యడస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి భరతమాత దాస్యశృంఖలాల నుంచి విముక్తి కలిగించిన మహోన్నతుడు మహాత్మాగాంధీ.
20వ శతాబ్దంలో మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన వ్యక్తుల్లో మహాత్మాగాంధీ ఒకరు.
తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచరించి చూపారు.
భారతదేశంపై చెరగని ముద్ర వేశారు.
దేశానికి స్వాతంత్య్ర ఫలాలు అందించిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం కృషిచేద్దాం.
-
2025-01-30T10:26:44+05:30
నిజామాబాద్ జిల్లాలో దారుణం..
రెంజల్ మండలం బోర్గాంలో దారుణం.
భార్యను హత్య చేసి మృత దేహాన్ని చెరువులో పడేసిన భర్త.
తన భార్య అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన నిందితుడు.
పోలీసు విచారణలో తానే చంపినట్లు ఒప్పుకున్న భర్త పోతన్న.
-
2025-01-30T10:07:56+05:30
నేడు అఖిలపక్ష సమావేశం..
జనవరి 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గురువారం ఉదయం 11.30 గంటలకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం.
సమావేశానికి హాజరుకానున్న వివిధ పార్టీల లోకసభ, రాజ్యసభ పక్ష నేతలు.
పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్షాలను కోరనున్న అధికార పార్టీ.
రేపు ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.
ఫిబ్రవరి 1న లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.