-
-
Home » Mukhyaamshalu » Today Breaking News Live Updates Saturday 17th May 2025 Top Headlines and Major Events Across India Shiva
-
Breaking News: మందకృష్ణ మాదిగకు గాయాలు..
ABN , First Publish Date - May 17 , 2025 | 06:58 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
May 17, 2025 20:29 IST
ఇస్రో 101వ మిషన్‌కు రంగం సిద్ధం
PSLV-C61 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ మొదలు
కొనసాగుతోన్న PSLV-C61 రాకెట్ కౌంట్‌డౌన్
ఎర్త్ అబ్జర్వేటర్ శాటిలైట్ EOS-09 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్న ఇస్రో
అత్యాధునిక సాంకేతికతో రూపొందించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్
దేశభద్రత బలోపేతం, అటవీ పర్యవేక్షణలో EOS-09 సేవలు
విపత్తు నిర్వహణ, పట్టణ ప్రణాళిక రంగాల్లో EOS-09 సేవలు
రేపు ఉ.5.59 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లనున్న PSLV-C61
17 నిమిషాల తర్వాత ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్న PSLV
EOS ఉపగ్రహాల సిరీస్‌లో ఇది 9వ ఉపగ్రహం
EOS-09 ఉపగ్రహం బరువు 1895.24 కిలోలు
ఐదేళ్లపాటు సేవలందించనున్న EOS-09 ఉపగ్రహం
-
May 17, 2025 20:09 IST
మందకృష్ణకు గాయాలు..
హైదరాబాద్: బీజేపీ తిరంగా ర్యాలీలో తోపులాట
తోపులాటలో మందకృష్ణ మాదిగ కాలికి గాయం
ర్యాలీ నుంచి హాస్పిటల్‌కు మందకృష్ణ మాదిగ తరలింపు
-
May 17, 2025 18:44 IST
నీట్ ఫలితాలపై మద్రాస్ హైకోర్టు స్టే
నీట్ ఫలితాలు విడుదల చేయవద్దని మద్రాస్ హైకోర్టు ఆదేశం
ఇప్పటికే నీట్ ఫలితాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు స్టే
-
May 17, 2025 17:20 IST
తల్లికి వందనం.. ఎప్పట్నుంచి అంటే..
వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం: సీఎం చంద్రబాబు
ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ పథకం వర్తింపు: సీఎం చంద్రబాబు
రైతుల ఖాతాలలో ఏటా రూ.14 వేల చొప్పున జమచేస్తాం: సీఎం చంద్రబాబు
కేంద్రం ఇచ్చే రూ.6వేలకు అదనంగా రూ.8వేలు ఇస్తాం: సీఎం చంద్రబాబు
ఓర్వకల్‌కి రైల్వే ట్రాక్ తీసుకువస్తాం: సీఎం చంద్రబాబు: సీఎం చంద్రబాబు
ఆగస్ట్ 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: సీఎం చంద్రబాబు
-
May 17, 2025 17:19 IST
ఢిల్లీకి మంత్రి నారా లోకేశ్..
ఢిల్లీ చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కుటుంబం
రాత్రి 7:30 గంటలకు ప్రధాని మోదీతో లోకేశ్ కుటుంబం డిన్నర్ మీటింగ్
ప్రధాని మోదీ ఆహ్వానంతో మంత్రి లోకేశ్ ఢిల్లీ పర్యటన
గతంలో ఏపీ పర్యటన సమయంలో లోకేశ్‌ను కుటుంబసమేతంగా వచ్చి తనను కలవాలని కోరిన ప్రధాని మోదీ
-
May 17, 2025 17:06 IST
అంతా అబద్ధం..
వేములవాడ ఆలయం మూసివేత అనేది అబద్ధం: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
దేవాలయం బంద్ చేస్తామమనడం అవాస్తవం: ఆది శ్రీనివాస్
మేము కొత్త ఆలయం నిర్మించడం లేదు: ఆది శ్రీనివాస్
ఉన్న ఆలయ విస్తీర్ణం పెంచుతున్నాం: ఆది శ్రీనివాస్
30 గుంటలు ఉన్న ఆలయాన్ని 4 ఎకరాలకు పెంచుతున్నాం: ఆది శ్రీనివాస్
8 నెలల్లోనే ఆలయ విస్తరణ పనులు పూర్తి చేస్తాం: ఆది శ్రీనివాస్
స్టీల్ బ్రిడ్జి నుంచి ఆలయం వరకు 80 ఫీట్ల రోడ్ చేస్తాం: ఆది శ్రీనివాస్
రోడ్డు వెడల్పులో నష్ట పోయిన వారికి ఆర్థిక సహాయం చేస్తాం: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
-
May 17, 2025 17:06 IST
మావోయిస్టులు అరెస్ట్
ములుగు జిల్లాలో 20 మంది మావోయిస్టులు అరెస్ట్
మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం
-
May 17, 2025 16:24 IST
ABN చేతిలో స్వప్నలోక్ అగ్నిప్రమాద ఛార్జిషీట్
13 మందిని నిందితులుగా తేల్చిన పోలీసులు
ఆరుగురి మృతికి కారణమైన 13 మందిపై ఛార్జిషీట్
2023 మార్చ్ 16న స్వప్నలోక్‌లో అగ్నిప్రమాదం
ఫైర్ సేఫ్టీని బిల్డర్లు పట్టించుకోలేదు: పోలీసులు
ఎగ్జిట్ పాయింట్ దగ్గర చెత్త డంప్ చేయడం వల్ల ఆరుగురు బయటపడలేకపోయారు: పోలీసులు
-
May 17, 2025 16:17 IST
మహిళలే దేశానికి ఆదర్శం: సీఎం రేవంత్‌రెడ్డి..
హైదరాబాద్: వీహబ్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్
మహిళా శక్తిని ఇందిర ప్రపంచానికి చూపించారు: రేవంత్
మహిళా శక్తిని కాంగ్రెస్ ఎప్పుడూ గౌవరవిస్తుంది: రేవంత్
మహిళలే దేశానికి ఆదర్శం: సీఎం రేవంత్‌రెడ్డి
కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలనేది మా లక్ష్యం
తెలంగాణ 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ చేరుకోవాలంటే..
కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలి: సీఎం రేవంత్
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణసౌకర్యం తీసుకొచ్చాం: రేవంత్
-
May 17, 2025 12:47 IST
హర్యానాలో పాక్ గూఢచారి దేవేంద్రసింగ్ అరెస్ట్
2024లో కర్తార్‌పూర్ కారిడార్ ద్వారా పాక్ వెళ్లిన దేవేంద్ర సింగ్.
పాకిస్తానీ నిఘా అధికారిని కలిసిన దేవేంద్ర సింగ్.
హనీట్రాప్ ద్వారా దేవేంద్ర సింగ్‌ను తమ గుప్పిట్లో పెట్టుకున్న ISI.
భారత సైనిక స్థావరాల వివరాలను పాక్‌కు అందించిన దేవేంద్రసింగ్.
దేవేంద్రసింగ్ ఫోన్ సీజ్, బ్యాంకు ఖాతాలపై ఆర్మీ పరిశీలన.
-
May 17, 2025 12:45 IST
తెలంగాణ సచివాలయం దగ్గర ఉద్రిక్తత
ఇజ్రాయెల్ జెండాను తొలగించిన యువకుడు
మిస్‌వరల్డ్ పోటీల్లోభాగంగా పలుదేశాల జెండాల ఏర్పాటు
ఇజ్రాయెల్ జెండా తొలగిస్తూ సోషల్ మీడియాలో లైవ్
యువకుడు జకీర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
May 17, 2025 09:53 IST
వ్యవసాయ శాఖ సమీక్ష లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
వానాకాలం సాగుకు సిద్ధమవ్వండి.
విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచండి.
నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపండి.
కల్తీ విత్తనాల వ్యాపారులపై పీడీ యాక్ట్ కేసులు.
రాష్ట్ర వ్యాప్తంగా టాస్క్‌ఫోర్స్ దాడులకు సిద్ధం.
సరిహద్దుల్లో విత్తన రవాణాపై నిఘా పెంచండి.
రైతులను మోసగాళ్ల నుంచి రక్షించాలి.
విత్తనాలపై కలెక్టర్‌లు, ఎస్పీలతో సమన్వయం చేయండి.
వానలు ముందుగానే కురిసే అవకాశాలు.
రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
లూజ్ విత్తనాలు కొనొద్దు. ప్యాక్‌తోనే కొనాలి.
విత్తన ప్యాకెట్, బిల్‌ను భద్రపరచండి.
నకిలీ విత్తనాలపై ప్రజల్లో అవగాహన పెంచండి.
ఈ సీజన్‌లో వరి, పత్తి సాగు విస్తీర్ణం పెరుగుతుంది.
అవసరమైనన్ని విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉన్నాయి.
-
May 17, 2025 08:25 IST
75 తులాల బంగారం చోరీ..
చాదర్ ఘాట్ పీఎస్ పరిధిలో భారీ చోరీ..
వ్యాపారి ఫహిముద్దీన్ ఇంట్లో చోరీ 75 తులాల బంగారు నగలు.రూ.2.50 లక్షల నగదు చోరీ
భార్య అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండటంతో ఫహిముద్దీన్ శుక్రవారం రాత్రి ఇంట్లో తల్లిదండ్రులను ఉంచి ఆసుపత్రికి వెళ్లారు.
ఇంటి వెనుక నుంచి లోనికి ప్రవేశించిన ఆగంతకులు.
ఫహిముద్దీన్ తల్లిదండ్రులు నిద్రిస్తున్న గదికి బయట నుంచి గొళ్లెం పెట్టిన నిందితులు.
దర్జాగా ఇంట్లోకి ప్రవేశించి రాత్రి చాలా సేపు తిష్ట వేసిన నిందితులు.
ఫ్రిడ్జ్‌లో పండ్లు తిని బీరువాలో బంగారం, నగదు, ఇతర వస్తువులు చోరీ.
చోరీ అనంతరం చేసుకొని ఉడాయించిన నిందితులు.
తెల్లవారు జామున ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన ఫహిముద్దీన్.
దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు పిర్యాదు.
ఘటన స్థలానికి చాదర్ ఘాట్ పోలీసులు.
క్లూస్ సౌత్ ఈస్ట్ జోన్ టీం చేరుకొని దర్యాప్తు.
-
May 17, 2025 07:01 IST
సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే..
కర్నూలు: నేడు సీఎం చంద్రబాబు కర్నూలు పర్యటన.
సి క్యాంపు రైతు బజార్‌ను పరిశీలించి, రైతులతో మాట్లాడనున్న ముఖ్యమంత్రి.
కేంద్రీయ విద్యాలయం దగ్గర ప్రజా వేదిక సభలో మాట్లాడనున్న సీఎం.
పాణ్యం నియోజవర్గం నాయకులు కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమం.
స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ధనలక్ష్మి నగర్ పార్కులో రూ. 50 లక్షలతో అభివృద్ధి పనులకు పైలాన్ ఆవిష్కరణ చేయనున్న ముఖ్యమంత్రి.
సీఎం పర్యటన సందర్భంగా కర్నూలులో వాహనాల రాకపోకలు మళ్లింపు.
సీఎం చంద్రబాబు పర్యటనకు 1,700 మంది పోలీసులతో బందోబస్తు.
-
May 17, 2025 06:58 IST
నెల్లూరు: షార్ కేంద్రం నుంచి PSLV C-61 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్దం.
భూమికి 529కి.మీ ఎత్తులో EOS-09 శాటిలైట్ ని ప్రవేశపెట్టనున్న రాకెట్.
PSLV C-61 రాకెట్ ఎత్తు 44.5 మీటర్లు, బరువు 321 టన్నులు.
దేశ రక్షణ కోసం నింగిలో నిఘా నేత్రంలా పనిచేయనున్న EOS-09 శాటిలైట్.
ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టినున్న 101వ రాకెట్ ప్రయోగం.
శనివారం ఉదయం 7.59 గంటలకి ప్రారంభం కానున్న కౌంట్ డౌన్.
ఆదివారం ఉదయం 5.59 గంటలకి రాకెట్ ప్రయోగం.
షార్‌కి చేరుకున్న ఇస్రో ఛైర్మన్ నారాయణ.
షార్‌లో భద్రత కట్టుదిట్టం.
షార్ దీవిలో అడవులు, సముద్ర తీర ప్రాంతంలో CISF గస్తీ ముమ్మరం.