-
-
Home » Mukhyaamshalu » telugu Viral trending Weather Telangana Andhra Pradesh national and international Breaking news 15th nov 2025 kjr
-
BREAKING: గుజరాత్ పర్యటనలో ప్రధాని మోదీ
ABN , First Publish Date - Nov 15 , 2025 | 07:25 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Nov 15, 2025 20:18 IST
విద్యుత్ రంగం రూ.5,33,351 కోట్ల పెట్టుబడులు, 2,66,722 మందికి ఉద్యోగాలు
పరిశ్రమలు రూ. 2,80,384 కోట్ల పెట్టుబడులు, 5,19,083 మందికి ఉద్యోగాలు
మౌళిక వసతులు రూ. 2,01,758 కోట్ల పెట్టుబడులు, 3,06,649 మందికి ఉద్యోగాలు
ఐటీఈ అండ్ సీ రూ. 1,59,467 కోట్ల పెట్టుబడులు, 2,96,315 మందికి ఉద్యోగాలు
ఏపీ సీఆర్డీఏ రూ. 48,711 కోట్ల పెట్టుబడులు, 41,625 మందికి ఉద్యోగాలు
టూరిజం రూ. 21,036 కోట్ల పెట్టుబడులు, 1,05,804 మందికి ఉద్యోగాలు
ఫుడ్ ప్రాసెసింగ్ రూ. 13,008 కోట్ల పెట్టుబడులు, 47,390 మందికి ఉద్యోగాలు
పట్టణాభివృద్ధి రూ. 4,944 కోట్ల పెట్టుబడులు, 12,150 మందికి ఉద్యోగాలు
టెక్స్ టైల్స్ రూ. 4,490 కోట్ల పెట్టుబడులు, 8,450 మందికి ఉద్యోగాలు
వైద్యారోగం రూ. 4,208 కోట్ల పెట్టుబడులు, 2,4000 మందికి ఉద్యోగాలు
విద్యా రంగం రూ. 4,359 కోట్ల పెట్టుబడులు, 3,000 మందికి ఉద్యోగాలు
-
Nov 15, 2025 19:35 IST
పులివెందుల్లో డిఎస్పీ మురళి నాయక్ ను కలసిన వివేకా కుమార్తె సునీత దంపతులు
తమపై పెట్టిన తప్పుడు కేసుల విచారణకు సంబంధించి చర్చించినట్లు సమాచారం
-
Nov 15, 2025 19:18 IST
ఇప్పుడు చేసుకున్న ఒప్పందాలన్నీ మూడున్నరేళ్లలో ఎగ్జిక్యూట్: చంద్రబాబు
2026లోనూ ఇదే తేదీల్లో CII భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తాం: చంద్రబాబు
శ్రీసిటీలో అదనంగా మరో 70వేల మందికి ఉపాధి అవకాశాలు: చంద్రబాబు
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు ఏపీ కేరాఫ్‌గా మారింది: సీఎం చంద్రబాబు
పరిశ్రమల అధినేతలకు భవిష్యత్‌లో సమస్య లేకుండా సావరిన్ పవర్: చంద్రబాబు
-
Nov 15, 2025 18:42 IST
వైసీపీ ప్రభుత్వ తీరుతో ఏపీకి తీరని నష్టం జరిగింది: చంద్రబాబు
పెట్టుబడిదారుల్లో మళ్లీ విశ్వాసం కల్పిస్తున్నాం: చంద్రబాబు
సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి సూపర్ హిట్ చేశాం: చంద్రబాబు
అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్‌ను జనవరిలో ప్రారంభిస్తాం
క్వాంటమ్ కంప్యూటర్లు ఇక్కడే తయారుచేసి అందించేలా ఏర్పాట్లు
ఈజ్ ఆఫ్ డూయింగ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినస్‌కు గేర్ మార్చాం
గత ప్రభుత్వ విధానాలు పునరావృతం కాకూడదు: చంద్రబాబు
కొత్తగా ఎస్క్రో ఖాతా ప్రవేశపెడుతున్నాం: సీఎం చంద్రబాబు
ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చాం: చంద్రబాబు
ఇప్పటికే చేసుకున్న ఒప్పందాలతో 25లక్షల ఉద్యోగాలు లభిస్తాయి: చంద్రబాబు
-
Nov 15, 2025 18:16 IST
విశాఖలో ముగిసిన CII భాగస్వామ్య సదస్సు
CII సదస్సు చరిత్ర తిరగరాసింది: చంద్రబాబు
613 ఒప్పందాల ద్వారా రూ.13.25లక్షల కోట్ల పెట్టుబడులు
20 నెలల్లో రూ.20లక్షలకు పైగా పెట్టుబడులు సాధించాం: చంద్రబాబు
CII సదస్సులో 5,587 మంది పాల్గొన్నారు: సీఎం చంద్రబాబు
మూడ్రోజుల్లో రూ.16లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం: చంద్రబాబు
పెట్టుబడుల ద్వారా 16లక్షల మందికిపైగా ఉద్యోగాలు: చంద్రబాబు
-
Nov 15, 2025 17:46 IST
IPL రిలీజ్డ్ లిస్ట్
CSK-రవీంద్ర జడేజా, శామ్ కరణ్, రచిన్ రవీంద్ర
CSK-మతిశా పతిరానా, డేవాన్ కాన్వే, విజయ్ శంకర్, దీపక్ హుడా
SRH: సచిన్ దూబే, అడమ్ జంపా, అభినవ్ మనోహర్, రాహుల్ చాహర్
-
Nov 15, 2025 16:42 IST
విశాఖ: CII సదస్సు రెండో రోజు 48 MoUలు
రూ.48,430 కోట్ల పెట్టుబడులు, 94,155 మందికి ఉద్యోగ అవకాశాలు
అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు రూ.1,980 కోట్ల ఒప్పందం
వైద్యారోగ్యం, పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పన,..
పరిశ్రమలు, టెక్స్ టైల్స్, పర్యాటక రంగాల్లో 48 ఒప్పందాలు
ఎయిర్ పోర్ట్స్ అథారిటీ, హెట్రోడ్రగ్స్, భారత్ డైనమిక్స్, జేకే ఏరోస్పేస్,..
అదానీ విల్మర్, NSTL క్వాంటం కంప్యూటింగ్ స్టిములేటింగ్ సెంటర్,..
సిడాక్, పాస్కల్ సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు
-
Nov 15, 2025 16:34 IST
ఎల్లుండి తెలంగాణ కేబినెట్ సమావేశం
మధ్యాహ్నం 3గంటలకు భేటీ
స్థానిక సంస్థల ఎన్నికల పై నిర్ణయం
-
Nov 15, 2025 16:28 IST
బిహార్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆర్జేడీ
ప్రజాసేవ అనేది నిరంతర ప్రక్రియ: ఎక్స్‌లో ఆర్జేడీ
ఓటమితో విచారం, గెలుపుతో అహంకారం ఉండదు
రాజకీయాల్లో ఒడిదొడుకులు సహజం: ఎక్స్‌లో ఆర్జేడీ
-
Nov 15, 2025 16:28 IST
ఢిల్లీ: రాహుల్‌గాంధీతో ముగిసిన సీఎం రేవంత్‌రెడ్డి భేటీ
పాల్గొన్న భట్టి విక్రమార్క, మహేష్‌గౌడ్, నవీన్ యాదవ్
ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించిన నేతలు
జూబ్లీహిల్స్ విజయంపై నవీన్ యాదవ్‌ను ప్రశంసించిన రాహుల్
-
Nov 15, 2025 15:51 IST
బెట్టింగ్ యాప్ కేసులో ముగిసిన నటుడు దగ్గుబాటి రానా విచారణ
సీఐడీ సిట్‌కు బ్యాంక్ వివరాలు, స్టేట్‌మెంట్స్ అందజేసిన రానా
స్కిల్ బేస్డ్ గేమ్ యాప్‌ను మాత్రమే ప్రమోట్ చేశానని రానా స్టేట్‌మెంట్
ఒప్పందం సమయంలో అన్నీ పరిశీలించే ఒప్పందం చేసుకున్నా: రానా
నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న ఏ సంస్థతో ఒప్పందం చేసుకోలేదు: రానా
-
Nov 15, 2025 15:34 IST
ఢిల్లీ: రాహుల్‌గాంధీతో మహేష్‌గౌడ్, భట్టి, నవీన్ యాదవ్ భేటీ
జూబ్లీహిల్స్ విజయం, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చ
-
Nov 15, 2025 15:17 IST
దావూద్ ఇబ్రహీం డ్రగ్ పార్టీల్లో బాలీవుడ్ తారలు
ముంబై పోలీసుల విచారణలో కీలక అంశాలు
పార్టీలకు హాజరైన నోరా ఫతేహి, శ్రద్ధా కపూర్, సోదరుడు సిద్ధార్ధ్ కపూర్
భారత్‌తో పాటు దుబాయ్, ఇతర దేశాల్లో డ్రగ్ పార్టీలు
శ్రద్ధా కపూర్, నోరా ఫతేహికి నోటీసులు ఇవ్వనున్న ముంబై పోలీసులు
గతంలో ఓ చిత్రంలో దావూద్ సోదరి పాత్రలో నటించిన శ్రద్ధా కపూర్
దావూద్ పాత్రలో నటించిన శ్రద్ధా కపూర్ సోదరుడు సిద్ధార్థ్ కపూర్
-
Nov 15, 2025 15:01 IST
విజయవాడ: లిక్కర్ స్కామ్ కేసులో అనిల్ చోక్రా అరెస్ట్
అనిల్ చోక్రా రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
కసిరెడ్డి, ముప్పిడి అవినాష్‌తో కలిసి మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు నిర్ధారణ
అదానీ, లీలా, స్పైయాగ్రో కంపెనీలకు నిధుల మళ్లింపు
-
Nov 15, 2025 14:18 IST
సాక్షి కథనాన్ని ఖండిస్తూ ఎక్స్‌లో డిప్యూటీ సీఎం కార్యాలయం పోస్ట్
'జనసేలో భూమి గోల' వార్తలో సురేష్ అనే వ్యక్తి..
డిప్యూటీ సీఎం పేషీలో ఉన్నారని సాక్షిలో కథనం: డిప్యూటీ సీఎం ఆఫీస్
సురుష్ పేరుతో డిప్యూటీ సీఎం పేషీలో ఎవరూ లేరు: డిప్యూటీ సీఎం ఆఫీస్
సివిల్ వివాదాన్ని.. డిప్యూటీ సీఎం పేషీకి లింక్ పెట్టడం దుష్ప్రచారమే: డిప్యూటీ సీఎం ఆఫీస్
-
Nov 15, 2025 14:18 IST
విజయవాడ: లిక్కర్ స్కామ్ కేసులో అనిల్ చోక్రా అరెస్ట్
అనిల్ చోక్రా క్రైమ్ రికార్డు చూసి పోలీసులు షాక్
అనిల్ చోక్రాపై ఈడీ సహా EOWలో కూడా పలు కేసులు
షెల్ కంపెనీలకు రూ.వందల కోట్లు మళ్లించినట్టు గుర్తింపు
గతంలోనే అనిల్ చోక్రాపై లుకౌట్ నోటీసులు
అనిల్ చోక్రా కోసం 7 రాష్ట్రాలు గాలిస్తున్నట్టు సమాచారం
ఓ కేసులో సంతకం చేసేందుకు వచ్చిన అనిల్‌ను అరెస్ట్ చేసిన సిట్
అనిల్ చోక్రా విచారణలో మరికొందరి పేర్లు బయటకు వస్తాయన్న సిట్
లిక్కర్ స్కాంలోనే షెల్ కంపెనీ ద్వారా రూ.77కోట్లు అందించిన అనిల్ చోక్రా
ఫేక్ బిల్లులతో రూ.304కోట్లు మోసం చేసిన కేసులో అరెస్టయిన అనిల్ చోక్రా
ముంబైలో రూ.24కోట్ల జీఎస్టీ మోసం కేసులో అనిల్ చోక్రాపై EOWలో కేసు
-
Nov 15, 2025 14:18 IST
articleText
-
Nov 15, 2025 13:29 IST
గుజరాత్ పర్యటనలో ప్రధాని మోదీ
ఢిల్లీ: గుజరాత్ పర్యటనలో ప్రధాని మోదీ
నర్మదలోని దేవమోగ్రా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
-
Nov 15, 2025 13:00 IST
గంజాయి ముఠా అరెస్ట్..
కడప : నగరంలోని రిమ్స్ పోలీస్టేషన్ పరిధిలో గంజాయి ముఠా అరెస్టు..
రౌడీషీటర్ , ప్రధాన సూత్రధారుడు సురభి మహేష్‌తో పాటు 9 మంది గంజాయి విక్రయదారుల అరెస్ట్..
రూ.లక్ష 15 వేల విలువచేసే 23kg ల గంజాయి, రూ.96 వేల విలువగల టాబ్లెట్ స్వాధీనం..
వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ నచికేత్.
-
Nov 15, 2025 12:31 IST
సీఐ సతీష్ కుమార్ అంతిమయాత్ర..
కర్నూలు: పత్తికొండలో ప్రారంభమైన సీఐ సతీష్ కుమార్ అంతిమయాత్ర..
కడసారి చూసేందుకు భారీగా తరలి వచ్చిన జనం..
మరికాసేపట్లో అధికారిక లాంఛనాలతో హిందూ స్మశాన వాటికలో సీఐ సతీష్ కుమార్ అంత్యక్రియలు.
-
Nov 15, 2025 12:11 IST
జమ్మూ కశ్మీర్‌కు.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా..
ఢిల్లీ: సాయంత్రం జమ్మూ కశ్మీర్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా..
నౌగాంలో పేలుడు ప్రదేశాన్ని పరిశీలించనున్న అమిత్‌షా..
పేలుడు ఘటనలో 9 మంది మృతి, 27మందికి తీవ్రగాయాలు.
-
Nov 15, 2025 11:27 IST
దోమకొండలో సైబర్ మోసం
కామారెడ్డి: దోమకొండలో సైబర్ మోసం
లింక్ ను ఓపెన్ చేసి రూ.2లక్షల 40 వేలు పోగొట్టుకున్న బాధితుడు..
లింక్‌లో టాస్క్‌లు పూర్తి చేస్తే డబ్బులు వస్తాయని ఆశ చూపిన సైబర్ కేటుగాళ్లు..
అత్యాశకు పోయి విడతల వారీగా రూ.2.40 లక్షలు చెల్లించిన బాధితుడు..
డబ్బులు తిరిగి రాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు.
-
Nov 15, 2025 11:25 IST
హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్..
తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్ చేసిన దుండగులు..
ఆర్డర్ కాపీలు డౌన్‌లోడ్ చేస్తున్న క్రమంలో ఓపెన్ అవుతున్న ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్..
పోలీసులకు ఫిర్యాదు చేసిన హై కోర్టు రిజిస్ట్రార్..
పీడీఎఫ్ ఫైల్స్‌కు బదులు BDG SLOT అనే బెట్టింగ్ సైట్ ఓపెన్ అవుతుంది అంటూ ఫిర్యాదు..
కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్ పోలీసులు.
-
Nov 15, 2025 10:01 IST
డబ్బులు ఇవ్వలేదని.. తల్లిని చంపిన కొడుకు..
సంగారెడ్డి జిల్లా: కోహీర్ మండలం బడంపేటలో దారుణం...
డబ్బులు ఇవ్వలేదని మద్యం మత్తులో తల్లిని చంపేసిన కొడుకు...
ఇంట్లో నిద్రిస్తున్న గోపమ్మను కర్రతో కొట్టి చంపిన కొడుకు బాలరాజు..
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
-
Nov 15, 2025 09:50 IST
ఐ-బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్..
ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్
కూకట్‌పల్లిలో అరెస్టు చేసిన CCS పోలీసులు
నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇమ్మడి రవి
కరేబియన్ దీవుల్లో ఉంటూ i-Bomma వెబ్సైట్ నిర్వహణ..
వెబ్‌సైట్ నిండా తెలుగు సినిమాల పైరసీ, OTT కంటెంట్..
ఐ-బొమ్మపై ఫిర్యాదు చేసిన తెలుగు సినీ నిర్మాతలు..
నిర్మాతల ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసులకు సవాల్ విసిరిన ఐ-బొమ్మ..
భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న ఇమ్మడి రవి..
అరెస్ట్ అనంతరం అకౌంట్‌లో రూ.3 కోట్లు ఫ్రీజ్ చేసిన పోలీసులు..
సర్వర్లు లాగిన్ చేయించి పైరసీ కంటెంట్ చెక్ చేసిన పోలీసులు.
-
Nov 15, 2025 09:08 IST
లొంగిపోనున్న మరో మావోయిస్టు
ములుగు : మావోయిస్టు నేత కొయ్యాడ సాంబయ్య, అలియాస్ గోపన్న, ఆజాద్ లొంగిపోతున్నట్టు ప్రచారం..
సాంబయ్యది ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం..
మూడు దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు నాయకుడు..
సాంబయ్య లొంగిపోతున్నాడన్న విషయాన్ని ధ్రువీకరించిన కుటుంబ సభ్యులు.
-
Nov 15, 2025 09:03 IST
టీటీడీకి బ్యాటరీ బస్సు విరాళం
తిరుమల: టీటీడీకి రూ.74 లక్షల విలువ చేసే బ్యాటరీ బస్సును విరాళంగా అందజేసిన పుణేకి చెందిన భక్తుడు..
శ్రీవారి ఆలయం వద్ద బస్సుకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బస్సు తాళాలను ఆలయ అధికారులకు అందజేసిన భక్తుడు.
-
Nov 15, 2025 08:36 IST
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
మధ్యాహ్నం 12గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి బయలుదేరనున్న సీఎం..
సాయంత్రం 7గంటలకు దిల్ సే విత్ కపిల్ 100వ ఎపిసోడ్ రిలీజ్ కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం..
తిరిగి రేపు హైదరాబాద్‌కు రానున్న రేవంత్ రెడ్డి.
-
Nov 15, 2025 07:27 IST
ఈరోజు ఇద్దరు ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ
ఉదయం 11 గంటలకు తెల్లం వెంకట్రావ్ Vs వివేకానంద గౌడ్ కేసు విచారణ..
తెల్లం వెంకట్రావుపై పిటిషన్ వేసిన వివేకానంద గౌడ్..
ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న తెల్లం వెంకట్రావును క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్న పిటిషనర్ వివేకానంద తరపు అడ్వకేట్లు..
మధ్యాహం 12 గంటలకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ Vs జగదీశ్ రెడ్డి కేసు విచారణ..
సంజయ్ పై పిటిషన్ దాఖలు చేసిన జగదీశ్ రెడ్డి..
ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్‌ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్న పిటిషనర్..
జగదీశ్ రెడ్డి తరపున అడ్వకేట్లు..
ఇప్పటికీ అఫిడవిట్లు దాఖలు చేయని కడియం శ్రీహరి, దానం నాగేందర్.