Share News

Jubilee Hills Bye-Election Results: కేసీఆర్‌పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..

ABN , First Publish Date - Nov 14 , 2025 | 06:12 AM

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి దూసుకుపోతున్నారు. రౌండ్ రౌండ్‌కి కాంగ్రెస్ పార్టీ మెజార్టీ భారీగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 5 రౌండ్ల కౌంటింగ్ పూర్తవగా.. ఇంకా కౌంటింగ్ కొనసాగుతోంది. కౌంటింగ్‌కు సంబంధించి మినిట్ టు మినిట్ అప్‌డేట్ మీకోసం..

Jubilee Hills Bye-Election Results: కేసీఆర్‌పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..

Live News & Update

  • Nov 14, 2025 17:21 IST

    కేసీఆర్‌పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..

    • బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

    • కేసీఆర్ క్రియాశీలక రాజకీయాల్లో లేరు.

    • కేసీఆర్ ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది.

    • క్రియాశీలక రాజకీయాల్లో లేని వ్యక్తి గురించి నేను ఎక్కువగా మాట్లాడలేను.

  • Nov 14, 2025 17:14 IST

    కేటీఆర్, హరీష్ లకు సీఎం రేవంత్ కీలక సూచన..

    • కేటీఆర్ తన అహంకారాన్ని తగ్గించుకోవాలి.

    • హరీష్ తన అసూయను తగ్గించుకోవాలి.

    • కేసీఆర్ కాలికి బలపం కట్టుకొని తిరిగినా మాకు 65 సీట్లు ఇచ్చారు.

    • పార్లమెంట్ ఎన్నికల్లో మా ఓటు శాతం పెరిగింది.

    • మేం పార్లమెంట్ ఎన్నికల్లో రెండవ లిట్మస్ టెస్ట్‌లో పాస్ అయ్యాం.

    • బీఆర్ఎస్, బీజేపీ కలిసినా మా ఓటు శాతాన్ని చేరుకోలేకపోయారు.

    • హరీష్ చూపులకు శక్తి ఉంటే ఎదుటివాళ్ళు కాలిపోయే ప్రమాదముంది.

    • అధికారం పోయినా కేటీఆర్‌కి అహంకారం పోలేదు.

    • చివరి సంవత్సరంలో రాజకీయం చేద్దాం.

    • రెండు సంవత్సరాలు ప్రజల కోసం పనిచేయడానికి సహకరించండి.

    • ఫేక్ న్యూస్ నువ్వే రాయించి, నువ్వే చదివి నిజమనుకుంటే ఎలా?

    • ఫేక్ సర్వేల వెనుక ఎవరున్నారో నాకు తెలుసు.

    • పక్క రాష్ట్రాల లాగా మీడియాపై దురుసుగా ప్రవర్తించకూడదు అని అనుకుంటున్నాం.

    • మీడియా విశ్వసనీయత పోగొట్టుకోకండి.

  • Nov 14, 2025 17:12 IST

    ఎవరి పాత్ర ఏంటో, ఎవరి బాధ్యత ఏంటో ప్రజలు స్పష్టంగా చెప్పారు: సీఎం రేవంత్

    • హైదరాబాద్ నువిశ్వనగరంగా తీర్చిదిద్దుతాం.

    • నగరంలో చెత్త ప్రధాన సమస్యగా మారింది.

    • చెరువులు, నాలాలు, కుంటాల కబ్జాలపై దృష్టి పెట్టినం.

    • అసహ్యకరమైన భాషతో అబద్ధాలను బీఆర్ఎస్ ప్రచారం చేసింది.

    • గంజాయి, డ్రగ్స్ లను రూపుమాపడానికి ఈగల్ ఫోర్స్ తీసుకువచ్చాం.

    • కబ్జాలను అడ్డుకోవడానికి హైడ్రా తీసుకువచ్చాం.

    • నగర అభివృద్ధికి బీఆర్ఎస్ సహకరించకపోగా, అడ్డుపడుతోంది.

    • మేం ఎన్నికలప్పుడే రాజకీయ విమర్శలు చేస్తాం.

    • కిషన్ రెడ్డి సచివాలయానికి రండి.

    • కేంద్రంలో పెండింగ్ ఉన్న రాష్ట్ర అంశాలను చర్చిద్దాం.

    • అధికారులతో సమీక్ష నిర్వహించి నివేదిక సిద్ధం చేయాలని భట్టి విక్రమార్కకి సూచన.

  • Nov 14, 2025 17:09 IST

    రాష్ట్రాభివృద్ధికి కిషన్‌రెడ్డి సహాయనిరాకరణ చేస్తున్నారు: సీఎం రేవంత్‌

    • కిషన్‌రెడ్డికి వచ్చిన ఓట్లలో 25 శాతం మాత్రమే ఇప్పుడు వచ్చాయి.

    • ఇది భూకంపానికి ముందు వచ్చే చిన్న ప్రకంపన లాంటిది.

    • ఇప్పుడు అప్రమత్తం కాకపోతే కిషన్‌రెడ్డి భూ స్థాపితం అవుతారు.

    • ఇప్పటికైనా కిషన్‌రెడ్డి తన పద్ధతి మార్చుకోవాలి.

  • Nov 14, 2025 17:05 IST

    ఇప్పటికైనా BRS, బీజేపీ సహకరించాలి: సీఎం రేవంత్‌రెడ్డి

    • హైదరాబాద్ అభివృద్ధి కోసం ఎవరిపాత్ర వారు పోషిద్దాం.

    • హైడ్రా, ఈగల్ వంటివి ప్రజల మేలు కోసం తీసుకొచ్చాం.

    • కానీ వాటిపైనే BRS దుష్ప్రచారం చేస్తోంది.

    • సోషల్ మీడియాలో BRS విషప్రచారం ఆపాలి.

    • ప్రతి కార్యక్రమానికి BRS అడ్డుతగులుతోంది.

    • జూబ్లీహిల్స్‌లో మా గెలుపు రెండేళ్ల పాలనకు ప్రతిఫలం.

    • ఇప్పటికైనా BRS, బీజేపీ అర్థంచేసుకుని సహకరించాలి.

  • Nov 14, 2025 17:04 IST

    GHMC ఎన్నికల్లోనూ ఇదే ఫలితాలు వస్తాయి: సీఎం రేవంత్‌రెడ్డి

    జూబ్లీహిల్స్‌ గెలుపు మా బాధ్యతను పెంచింది.

    అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో మాకు సానుకూల ఫలితాలు రాలేదు.

    ప్రజలు మన పనితీరును గమనించి తీర్పు ఇచ్చారు.

    హైదరాబాద్‌లో అనేక సమస్యలు పరిష్కరిస్తున్నాం.

    BRS తప్పుడు ప్రచారం చేస్తోంది.

  • Nov 14, 2025 17:03 IST

    నవీన్‌యాదవ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సన్మానం..

    • నవీన్‌యాదవ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు

  • Nov 14, 2025 16:27 IST

    జూబ్లీహిల్స్‌ ఫలితం తర్వాత ఎక్స్‌లో కవిత పోస్టు

    • కర్మ హిట్స్‌ బ్యాక్‌ అంటూ కవిత ట్వీట్‌.

  • Nov 14, 2025 16:15 IST

    జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఫలితాల్లో మంత్రుల పెర్ఫార్మెన్స్‌

    • రహమత్‌నగర్‌లో మంచి మెజారిటీ తెచ్చిన పొంగులేటి.

    • వెంగళరావునగర్‌లో మెజారిటీ రాబట్టిన వాకిటి శ్రీహరి.

    • కమ్మ వర్గం ఓట్ల మళ్లింపులో మంత్రి తుమ్మల సక్సెస్‌.

    • షేక్‌పేట్‌లో అంతంతమాత్రమే ప్రభావం చూపిన మంత్రులు సురేఖ, వివేక్‌.

    • ఎర్రగడ్డలో మెజారిటీ సాధించిన దామోదర రాజనర్సింహ.

    • యూసుఫ్‌గూడలో మంత్రులు భట్టి, ఉత్తమ్ సక్సెస్‌.

  • Nov 14, 2025 16:14 IST

    జూబ్లీహిల్స్‌లో రౌడీయిజంతో ఉపఎన్నిక జరిగింది: మాగంటి సునీత

    • ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామికంగా జరిగిన ఎన్నిక ఇది: మాగంటి సునీత

    • ప్రజలను భయపెట్టి ఓట్లు వేయించుకున్నారు: మాగంటి సునీత

    • ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు: మాగంటి సునీత

    • కాంగ్రెస్‌ రిగ్గింగ్‌ చేసి గెలిచింది: మాగంటి సునీత

    • ఆడబిడ్డపై కుట్రలు చేశారు.. రౌడీయిజమే గెలిచింది: మాగంటి సునీత

    • ఉపఎన్నిక నిర్వహణలో ఈసీ విఫలం: మాగంటి సునీత

    • కాంగ్రెస్‌ది అసలు గెలుపే కాదు: మాగంటి సునీత

    • నైతికంగా నేనే గెలిచా: మాగంటి సునీత

  • Nov 14, 2025 15:51 IST

    సీఎం రేవంత్‌కి మంత్రుల శుభాకాంక్షలు..

    • ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచిన సందర్భంగా సీఎంకి శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు.

    • జూబ్లీహిల్స్‌‌లో కాంగ్రెస్ గెలుపునకు కృషి చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అభినందించిన సీఎం.

  • Nov 14, 2025 15:47 IST

    గ్రామ గ్రామాన సంబరాలు చేయండి: మంత్రి పొన్నం ప్రభాకర్

  • Nov 14, 2025 15:47 IST

    అభ్యర్థులకు వచ్చిన మొత్తం ఓట్లు

    24,711 ఓట్ల మెజార్టీ తో గెలిచిన నవీన్ యాదవ్

    నవీన్ యాదవ్ కి వచ్చిన ఓట్లు 98,945

    మాగంటి సునీత కి వచ్చిన ఓట్లు 74,234

    లంకల దీపక్ రెడ్డి కి వచ్చిన ఓట్లు 17,041

    నోటా కి వచ్చిన ఓట్లు 922

  • Nov 14, 2025 15:19 IST

    కెప్టెన్‌గా సీఎం రేవంత్ సక్సెస్: చామల

    • హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి కెప్టెన్‌గా సక్సెస్ అయ్యారు: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

    • మమ్ముల్ని జూబ్లీహిల్స్‌లో ఒక నాయకుడిగా నడిపించాడు.

    • బూత్ సభ్యులకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.

    • జూబ్లీహిల్స్ విజయం బూత్ సభ్యులదే.

    • యువకుడిగా ప్రజలు నవీన్ యాదవ్‌ను గెలిపించారు.

    • గొప్ప అవకాశాన్ని తీసుకొని జూబ్లీహిల్స్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి.

    • నీ మీద వేసిన రౌడీ ముద్రను ప్రజల్లో మంచి పేరుతో చెడిపేయాలి.

    • నవీన్ యాదవ్ గెలుపుతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈజీగా గెలవాలి.

    • జూబ్లీహిల్స్‌లో ఏవిధంగా గెలిచామో.. లోకల్ బాడీ ఎన్నికల్లో కష్టపడి పని చేయాలి.

    • సర్పంచ్, జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలి.

    • ప్రతిపక్ష పార్టీ ప్రజల సమస్యల కోసం మాట్లాడట్లేదు.

    • కిరాయి సోషల్ మీడియాతో కేటిఆర్ మాట్లాడుతున్నారు.

    • జూబ్లీహిల్స్‌లో కిషన్ రెడ్డికి పడ్డ 60వేల ఓట్లు బీజేపీకి ఎందుకు పడలేదు.

    • బీహార్‌లో SIR పెట్టి 69 లక్షల మైనారిటీ, అట్టడుగు వర్గాల ఓట్లను తొలగించారు.

    • 69 లక్షల ఓట్లు అన్ని కాంగ్రెస్ కూటమికి పడే ఓట్లు.

    • టెర్రరిస్ట్ ఎటాక్‌లు అన్ని ఎన్నికల ముందు రోజే జరుగుతున్నవి.

    • టెర్రరిస్ట్ ఎటాక్‌లను ఎందుకు ఆపలేకపోతున్నారు.

    • రష్యాలో పుతిన్ మాదిరిగా మోడీ ప్రధానిగా ఉండాలని చూస్తున్నారు.

    • తెలంగాణలో కాంగ్రెస్ పోల్ మేనేజ్‌మెంట్ చేసినట్లుగా దేశం మొత్తం పోల్ మేనేజ్‌మెంట్ చేయాలి.

  • Nov 14, 2025 15:09 IST

    తమ బస్తీ పిల్లోడినని ప్రజలు గెలిపించారు: నవీన్‌ యాదవ్

    • సీఎం రేవంత్‌ సహా పార్టీ నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు: నవీన్‌ యాదవ్‌

    • బెదిరిస్తే ఓట్లు పడతాయా?.. వాళ్లే మమ్మల్ని బెదిరించారు: నవీన్‌ యాదవ్‌

    • నాపై BRS ఎంత తప్పుడు ప్రచారం చేసినా.. జూబ్లీహిల్స్‌ ప్రజలు నమ్మకంతో నన్ను గెలిపించారు: నవీన్‌ యాదవ్

    • జూబ్లీహిల్స్‌ ప్రజలకు కృతజ్ఞతలు: నవీన్‌ యాదవ్

    • ఎన్నికల వరకే రాజకీయాలు.. ఇక అంతా కలిసి పనిచేద్దాం: నవీన్‌ యాదవ్

    • అభివృద్ధే ఎజెండాగా పనిచేస్తాం: నవీన్‌ యాదవ్

  • Nov 14, 2025 15:07 IST

    జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ ఘన విజయం

    • ఉపఎన్నిక ఫలితం అధికారికంగా ప్రకటించిన EC.

    • 24,729 ఓట్ల మెజారిటీతో నవీన్‌ యాదవ్‌ గెలుపు.

    • కాంగ్రెస్‌ 98,988, BRS 74,259, BJP 17,061 ఓట్లు.

    • జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో BRSకు రెండో స్థానం.

    • జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో బీజేపీ డిపాజిట్‌ గల్లంతు.

    • కాంగ్రెస్‌ 50.83%, BRS 38.13%, BJP 8.76% ఓట్లు

  • Nov 14, 2025 13:05 IST

    నవీన్ యాదవ్ ఘన విజయం..

  • Nov 14, 2025 13:03 IST

    కౌంటింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ సంబరాలు..

    • హైదరాబాద్: కౌంటింగ్ కేంద్రం వద్ద మొదలైన కాంగ్రెస్ సంబరాలు.

    • కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంకు భారీగా చేరుకుంటున్న కాంగ్రెస్ శ్రేణులు.

  • Nov 14, 2025 13:00 IST

    జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ విజయం దాదాపు ఖరారు

    • దాదాపు 25 వేల ఓట్ల మెజారిటీతో గెలుపు దిశగా కాంగ్రెస్‌.

    • డిపాజిట్‌ దక్కించుకోని బీజేపీ.

    • కాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్న ఈసీ.

  • Nov 14, 2025 12:52 IST

    జూబ్లీహిల్స్‌: భారీ ఆధిక్యం దిశగా కాంగ్రెస్

    • 9వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు 2,117 ఓట్ల ఆధిక్యం.

    • 9వ రౌండ్‌ తర్వాత 23,612 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్‌.

    • అధికారికంగా ప్రకటించాల్సి ఉన్న EC.

  • Nov 14, 2025 12:51 IST

    కాంగ్రెస్ నేతల సంబరాలు..

    Congress-Leaders-Celebratio.jpg

  • Nov 14, 2025 12:40 IST

    జూబ్లీహిల్స్‌: 9వ రౌండ్‌లోనూ కాంగ్రెస్‌ ఆధిక్యం

    • బోరబండ, ఎర్రగడ్డలో వన్‌సైడ్‌గా కాంగ్రెస్‌కు పోలైన ఓట్లు.

    • కాంగ్రెస్‌ వైపే నిలిచిన మైనార్టీలు.

  • Nov 14, 2025 12:26 IST

    పెరుగుతున్న మెజార్టీ.. మంత్రుల సంబరాలు..

    జూబ్లీహిల్స్ క్లబ్ నుంచి ఉప ఎన్నికల ఫలితాలను సమీక్షిస్తున్న మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్ లు, ఇతర ముఖ్య నేతలు. ఒక్కో రౌండ్‌లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ వస్తుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు. జూబ్లీహిల్స్ విజయం ఖరారు కావడంతో మిఠాయిలు పంచుకున్న మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్.

  • Nov 14, 2025 12:16 IST

    జూబ్లీహిల్స్‌: భారీ ఆధిక్యం దిశగా కాంగ్రెస్

    • 8వ రౌండ్‌లోనూ ఆధిక్యంలో కాంగ్రెస్‌

    • 8వ రౌండ్‌ తర్వాత 19,619 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్‌

    • అధికారికంగా ప్రకటించాల్సి ఉన్న EC

  • Nov 14, 2025 12:06 IST

    హైదరాబాద్: గాంధీభవన్‌లో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

    • బాణసంచా పేల్చి సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్ శ్రేణులు.

    • తగ్గేదేలే, రప్పా రప్పా డైలాగ్స్‌తో సీఎం రేవంత్ ఫొటో.

    • 2028 ఎన్నికల్లో వంద సీట్లు గ్యారెంటీ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు.

  • Nov 14, 2025 12:04 IST

    బిఆర్ఎస్ తప్పుడు ప్రచారానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు: మంత్రి సీతక్క

    • ప్రజలకు ఎవరేమి చేశారో జూబ్లీహిల్స్ ప్రజలకు తెలుసు.

    • 10 ఏళ్లు ఏమి చేయలేని బిఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేసిన ప్రజలు విశ్వసించలేదు

    • మంత్రివర్గం కార్యకర్తలు ప్రజలతో ఉన్నారు.

    • మా అభ్యర్థి పక్కా లోకల్ బిసీ బిడ్డ, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి.

    • బిఆర్ఎస్ సెంటిమెంట్ రగిలించిన ప్రజలు విశ్వసించలేదు.

    • గోపీనాథ్ సతీమణి పిల్లలను ముందు పెట్టినా కూడా ప్రజలు విశ్వసించలేదు.

    • గతంలో పీజేఆర్ చేసిన అభివృద్ధి ప్రజలకు తెలుసు.

    • కేటీఆర్ బుల్డోజింగ్ అని ప్రచారం చేసిన ప్రజలు నమ్మలేదు.

    • మేము ఎవరిని బుల్డోజ్ చేయలేదు.

    • నగరం మునిగిపోకుండా ఉండేందుకు ప్రజల ప్రయోజనాల దృష్టిలో హైడ్రాను ఏర్పాటు చేశాము.

    • నవీన్ యాదవ్‌కు ప్రజలు అవకాశం ఇచ్చారు.

    • గతంలో పట్టణ ప్రజలకు న్యాయం చేసి గెలిచారు.

    • హైదరాబాదులో బిఆర్ఎస్ అభివృద్ధి చేయలేదు.

    • డ్రగ్స్, క్లబ్స్, పబ్స్‌ను కేటీఆర్ తెచ్చారు.

    • వాటికి ముగింపు పలకాలి అని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు.

    • అందుకే ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు.

    • మేము చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపించాయి.

    • సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు మా గెలుపు మంత్రాలుగా పనిచేశాయి.

    • సీఎం, మా ప్రభుత్వ పని తీరుకు ఈ విజయం ఫలితం.

  • Nov 14, 2025 11:46 IST

    ముగిసిన ఏడో రౌండ్ ఓట్ల లెక్కింపు..

    • ఏడో రౌండ్ లోనూ కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం.

    • ఏడో రౌండ్ ముగిసిన తర్వాత 19 వేలకు ఓట్లకు పైగా కాంగ్రెస్ ఆధిక్యం.

  • Nov 14, 2025 11:45 IST

    ఈ ఎన్నికల్లో డబ్బుల ప్రభావం ఎక్కువ ఉంది: బీజేపీ అభ్యర్థి లంకల ధీపక్ రెడ్డి

    • డిపాజిట్ వస్తుందనే భావిస్తున్నాం.

    • బీజేపీ ఓట్లకు డబ్బులు పంచదు.

    • చివరి మూడు రౌండ్లు మాకు అనుకూలంగా ఉంటాయి.

  • Nov 14, 2025 11:37 IST

    కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన బిజెపి అభ్యర్థి లంకల దీపక్

  • Nov 14, 2025 11:28 IST

    జూబ్లీహిల్స్‌: ఆరు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి

    • ఆరో రౌండ్‌ తర్వాత 15 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్‌

    • అధికారికంగా ప్రకటించాల్సి ఉన్న ఈసీ

  • Nov 14, 2025 11:26 IST

    6వ రౌండ్‌లో..

    • కాంగ్రెస్ - 9553

    • బీఆర్ఎస్ - 6615

    • లీడ్ - 2938

    • ఓవరాల్ లీడ్‌లో కాంగ్రెస్ - 15,619

  • Nov 14, 2025 11:21 IST

    యూసఫ్‌గూడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నవీన్ యాదవ్ అభిమానుల సంబరాలు..

    Jubili-Hills-Bypol-5.jpg

  • Nov 14, 2025 11:19 IST

    కాసేపట్లో తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

    • జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై కేటీఆర్ ప్రెస్ మీట్

    KTR.jpg

  • Nov 14, 2025 11:17 IST

    ఆరో రౌండ్‌ లోనూ కాంగ్రెస్‌ ఆధిక్యం

  • Nov 14, 2025 11:04 IST

    జూబ్లీహిల్స్‌: రౌండ్ల వారీగా కాంగ్రెస్‌ ఆధిక్యాలు

    తొలిరౌండ్‌ 47,

    రెండో రౌండ్‌ 2,995,

    మూడోరౌండ్‌ 2,843,

    నాలుగో రౌండ్‌ 3,547,

    ఐదో రౌండ్‌ 3,178 ఓట్ల ఆధిక్యం,

    షేక్‌పేట్‌, వెంగళరావు నగర్‌, రహమత్‌నగర్‌ డివిజన్ల కౌంటింగ్‌ పూర్తి.

  • Nov 14, 2025 10:59 IST

    ఫలించిన సీఎం రేవంత్ వ్యూహం

    • చివరి వారం వరకు కాంగ్రెస్ నేతల్లో కనిపించని కాన్ఫిడెన్స్.

    • చివరి వారంలో ఏం చేయాలో దిశానిర్దేశం చేసిన రేవంత్.

    • రేవంత్ ప్రచారంతో కాంగ్రెస్ నేతల్లో నిండిన జోష్.

    • పోల్ మేనేజ్మెంట్ పై బూత్ ఏజెంట్లకు, బూత్ ఇంచార్జీలకు సీఎం సందేశం.

    • తనపై ఇన్ని రోజులుగా వస్తున్న విమర్శలకు గెలుపుతో సమాధానం చెప్పిన రేవంత్.

    • జూబ్లీహిల్స్ గెలుపుతో మరింత స్ట్రాంగ్‌గా సీఎం రేవంత్.

    • ఇకపై గేరు మార్చి స్పీడ్ పెంచనున్న సీఎం.

  • Nov 14, 2025 10:53 IST

    కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు షురూ..

    • జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు.

    • గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

  • Nov 14, 2025 10:50 IST

    జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి దూసుకుపోతున్నారు. రౌండ్ రౌండ్‌కి కాంగ్రెస్ పార్టీ మెజార్టీ భారీగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 5 రౌండ్ల కౌంటింగ్ పూర్తవగా.. ఇంకా కౌంటింగ్ కొనసాగుతోంది. కౌంటింగ్‌కు సంబంధించి మినిట్ టు మినిట్ అప్‌డేట్ మీకోసం..

  • Nov 14, 2025 10:47 IST

    జూబ్లీహిల్స్‌: ఐదు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి

    • ఐదో రౌండ్‌లోనూ కాంగ్రెస్‌కు ఆధిక్యం

    • ఐదో రౌండ్‌ తర్వాత 12,651 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్‌

    • కొనసాగుతున్న ఆరో రౌండ్‌ ఓట్ల లెక్కింపు

  • Nov 14, 2025 10:38 IST

    రౌండ్ రౌండ్‌కు పెరుగుతున్న కాంగ్రెస్ లీడ్..

    • మొదటి రౌండ్ - 47

    • రౌండవ రౌండ్ - 2995

    • మూడవ రౌండ్ - 2843

    • నాల్గవ రౌండ్ - 3547

    • నాలుగో రౌండ్ ముగిసేవరకు కాంగ్రెస్ లీడ్ - 9,432

  • Nov 14, 2025 10:34 IST

    నాలుగో రౌండ్ లోనూ కాంగ్రెస్ ఆధిక్యం...

    • 4 రౌండ్లు ముగిసేసరికి 9,100 ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్.

    • రహ్మత్ నగర్..వెంగళరావు నగర్ ప్రాంతాల్లో ఏకపక్షంగా కాంగ్రెస్ కు ఓట్లు.

  • Nov 14, 2025 10:33 IST

    నవీన్ యాదవ్ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తల సందండి..

    • యూసఫ్ గూడలోని నవీన్ యాదవ్ కార్యాలయం వద్ద ఎల్ఈడిలు పెట్టుకొని జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాల లైవ్ ఇన్ తిలకిస్తున్న నవీన్ యాదవ్ అభిమానులు కార్యకర్తలు.

    Jubili-Hills-Bypol-4.jpg

  • Nov 14, 2025 10:22 IST

    మూడో రౌండ్‌లో బీఆర్ఎస్ ఆధిక్యం..

    • జూబ్లీహిల్స్: మూడో రౌండ్‌లో BRS 201 ఓట్ల ఆధిక్యం.

  • Nov 14, 2025 10:05 IST

    జూబ్లీహిల్స్: మూడో రౌండ్‌లోనూ కాంగ్రెస్‌ ఆధిక్యం

    • మూడో రౌండ్‌ పూర్తయ్యేసరికి 2,793 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్

    Jubili-Hills-Bypol-3.jpg

  • Nov 14, 2025 10:01 IST

    జూబ్లీహిల్స్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో అధికారులు..

    Election-Counting.jpg

  • Nov 14, 2025 09:54 IST

    జూబ్లీహిల్స్: మూడో రౌండ్‌లోనూ కాంగ్రెస్‌ ఆధిక్యం..

    • తొలి రెండు రౌండ్లలో కాంగ్రెస్‌ 18,656, BRS 17,509, BJP 2,277.

    • రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి 1,144 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్.

    • మూడో రౌండ్‌లోనూ కాంగ్రెస్‌ ఆధిక్యం.

    • తొలి మూడు రౌండ్లలో 3,400 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్‌.

  • Nov 14, 2025 09:50 IST

  • Nov 14, 2025 09:36 IST

    జూబ్లీహిల్స్: మూడో రౌండ్‌లోనూ కాంగ్రెస్‌ ఆధిక్యం

    • తొలి మూడు రౌండ్లలో 3,400 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్‌

  • Nov 14, 2025 09:14 IST

    జూబ్లీహిల్స్: తొలి 2 రౌండ్లలో కాంగ్రెస్ ముందంజ

    • తొలి రౌండ్‌లో కాంగ్రెస్‌-8,926 ఓట్లు, BRS-8,864 ఓట్లు

    • రెండో రౌండ్‌లో కాంగ్రెస్‌-9,691 ఓట్లు, BRS-8,609 ఓట్లు

    • రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి 1,144 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్

  • Nov 14, 2025 09:01 IST

    జూబ్లీహిల్స్ బైపోల్ రిజల్ట్స్.. మొదటి రౌండ్‌లో..

    • INC - 8926

    • BRS - 8864

    • మొదటి రౌండ్ లో 62 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ముందంజ.

    Jubili-Hills-Bypol-2.jpg

  • Nov 14, 2025 08:59 IST

    హైదరాబాద్: కౌంటింగ్ కేంద్రానికి BRS అభ్యర్థి మాగంటి సునీత

    • తనతో పాటు ఇద్దరు ఏజెంట్లకు అనుమతివ్వాలన్న మాగంటి సునీత.

    • సునీత అభ్యర్థనకు అభ్యంతరం చెప్పిన ఎన్నికల సిబ్బంది, పోలీసులు.

    • అభ్యర్థితో ఒక ఏజెంట్‌కు మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు స్పష్టం.

    • మాగంటి సునీతతో ఒక ఏజెంట్‌ను మాత్రమే అనుమతి ఇచ్చిన పోలీసులు.

  • Nov 14, 2025 08:57 IST

    కొనసాగుతోన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్

    • షేక్‌పేట్ డివిజన్‌లో ఆధిక్యంలో కాంగ్రెస్

    • తొలిరౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజ

  • Nov 14, 2025 08:57 IST

    కొనసాగుతోన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్

    • షేక్‌పేట్ డివిజన్‌లో కాంగ్రెస్-BRS మధ్య హోరాహోరీ

    • తొలిరౌండ్‌లో నవీన్‌యాదవ్‌కు 8,926 ఓట్లు, BRS-8,864 ఓట్లు

    • 62 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్

  • Nov 14, 2025 08:54 IST

    జూబ్లీహిల్స్ బైపోల్‌లో పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు-101

    • పోస్టల్‌ బ్యాలెట్‌లో కాంగ్రెస్‌-39,

    • BRS-36,

    • బీజేపీ-10 ఓట్లు

  • Nov 14, 2025 08:49 IST

    జూబ్లీహిల్స్: పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్‌కు ఆధిక్యం

    • జూబ్లీహిల్స్ బైపోల్‌లో పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు-101

    • పోస్టల్‌ బ్యాలెట్‌లో కాంగ్రెస్‌-39, BRS-36, బీజేపీ-10 ఓట్లు

    • కొనసాగుతోన్న ఈవీఎంల కౌంటింగ్

    • తొలుత షేక్‌పేట్ డివిజన్ ఓట్ల లెక్కింపు

    • ఒక్కో రౌండ్ లెక్కింపు 30నిమిషాల్లో పూర్తయ్యే అవకాశం

  • Nov 14, 2025 07:31 IST

    ఒక ఏజెంట్‌‌కు మాత్రమే అనుమతి..

    • కౌంటింగ్ సెంటర్‌లోకి తన వెంట ఇద్దరు ఏజెంట్‌లను లోపలకి అనుమతి ఇవ్వాలని కోరిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత..

    • సునీత అభ్యర్థనపై అభ్యంతరం వ్యక్తం చేసిన పోలీసులు ఎన్నికల సిబ్బంది..

    • ఒక అభ్యర్థికి ఒక ఏజెంట్‌కు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేసిన పోలీసులు..

    • దీంతో అభ్యర్థి సునీతతో పాటు ఒక ఏజెంట్‌ను మాత్రమే అనుమతి ఇచ్చిన సిబ్బంది.

  • Nov 14, 2025 07:25 IST

    కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు..

    • జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం కౌంటింగ్ హాల్ వద్ద గట్టి భద్రత ఏర్పాటు..

    • కౌంటింగ్ హాల్ చుట్టూ పోలీస్ ఆంక్షలు..

    • కౌంటింగ్ కోసం సుమారుగా 700 మంది పోలీసులతో భద్రత

    • భద్రత విధుల్లో పారా మిలిటరీ బలగాలు, సాయుధ బలగాలు.

    • కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు..

    • కౌంటింగ్ కేంద్రం చుట్టూ మూడంచెల భద్రతను ఏర్పాటు..

    • ఒక్కో టేబుల్‌కు ఒక్కో సీసీ కెమెరా ఏర్పాటు.. 42 టేబుల్స్‌కి అమర్చిన సీసీ కెమెరాలు..

    • కేంద్ర బలగాలు (పారామిలిటరీ), రాష్ట్ర సాయుధ పోలీసులు మరియు స్థానిక పోలీసులు పహారా..

    • ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ...

    • కౌంటింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో గుమిగూడటం పూర్తిగా నిషేధం..

    • రోడ్లపై బాణసంచా కాల్చడం, ర్యాలీలు నిర్వహించడం నిషేధం..

    • కౌంటింగ్ హాల్ లోకి సిబ్బంది, ఏజెంట్స్, ఉన్నత అధికారులు మాత్రమే ఎంట్రీ..

    • ఆంక్షలు, భద్రతతో ప్రశాంతంగా కౌంటింగ్ నిర్వహించడానికి చర్యలు.

  • Nov 14, 2025 06:22 IST

    నేడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్..

    • హైదరాబాద్ : నేడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్..

    • యూసుఫ్ గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్..

    • ఉదయం 8 గంటలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..

    • 10 రౌండ్స్ లో 42 టేబుల్స్ గా కౌంటింగ్..

    • ఒక్కో టేబుల్ కు ఒక్కో సీసీ కెమెరా ఏర్పాటు..

    • 186 మంది కౌంటింగ్ సిబ్బంది..

    • మొదట పోలైన 101 పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు

    • మధ్యాహ్నం వరకు తేలనున్న ఫలితం..

    • కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు..

    • జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం ఓట్లు... 4,01,365..

    • నవంబర్ 11 న జరిగిన పోలింగ్ లో 48.49 శాతం పోలింగ్ నమోదు..

    • పోలైన ఓట్లు 1,94,621.

    • గెలుపు పై కాంగ్రెస్, BRS ధీమా.

    • ముందుగా షేక్ పేట డివిజన్ ఓట్ల లెక్కింపు.

    • జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ.. జోరుగా సాగుతున్న బెట్టింగ్స్.