-
-
Home » Mukhyaamshalu » Telangana Andhra Pradesh Breaking Viral and trending national and international on 9th nov 2025 kjr
-
BREAKING: ఉత్తరాఖండ్ పర్యటనలో ప్రధాని మోదీ..
ABN , First Publish Date - Nov 09 , 2025 | 07:10 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Nov 09, 2025 20:30 IST
యాదగిరిగుట్ట స్వామివారి ఆలయానికి రికార్డు ఆదాయం
ఆలయానికి ఇవాళ ఒక్కరోజు రూ.1.57 కోట్ల ఆదాయం
లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్న 60 వేలమంది
-
Nov 09, 2025 20:29 IST
జనసేన పార్టీ ఎక్స్ ఖాతాను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు
నిన్న సాయంత్రం 6 గంటల తర్వాత హ్యాక్ అయినట్లు గుర్తింపు
హ్యాక్ చేసిన ఖాతా వివరాలు యూకేకి చెందినదిగా గుర్తింపు
బిట్ కాయిన్స్ వ్యవహారంపై హ్యాక్ చేసినట్లు అనుమానం
ఎక్స్ ఖాతా రికవరీ చేసే యత్నంలో జనసేన పార్టీ
ట్రేడింగ్, బిట్ కాయిన్స్ వ్యవహారంలో..
పార్టీ నాయకులను అప్రమత్తం చేసిన జనసేన కార్యాలయం
-
Nov 09, 2025 18:16 IST
జూబ్లీహిల్స్‌లో ఓటుహక్కు వినియోగించుకోనున్న 4,01,365 మంది
జూబ్లీహిల్స్‌లో మొత్తం 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
139 ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా
226 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తింపు
పోలింగ్ కేంద్రాల దగ్గర పారామిలిటరీ బలగాలతో బందోబస్తు
ఉపఎన్నిక విధుల్లో 2,060 మంది ఉద్యోగులు
-
Nov 09, 2025 17:53 IST
శంకర కంటి ఆస్పత్రి 50 ఏళ్ల వేడుకకు హాజరవుతా: సీఎం చంద్రబాబు
రోజూ 750 మందికిపైగా నేత్ర వైద్యం అందించడం అరుదైన విషయం
ఇతర రాష్ట్రాల్లోనూ శంకర ఆస్పత్రి సేవలు అందిస్తోంది: సీఎం చంద్రబాబు
చిన్నారుల కంటిచూపుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం గొప్ప విషయం: చంద్రబాబు
పేదరికం లేని సమాజం నిర్మించడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఏపీలో అందరికీ రూ.2.5 లక్షల వరకు ఆరోగ్య బీమా: సీఎం చంద్రబాబు
సంజీవని పథకం ద్వారా ఇప్పటికే వైద్యసేవలు అందిస్తున్నాం: చంద్రబాబు
ఆస్తులు ఉన్నా.. ఎవరికైనా ఆరోగ్యమే ముఖ్యం: సీఎం చంద్రబాబు
శంకర ఆస్పత్రికి అన్నివిధాలా సహకారం అందిస్తాం: సీఎం చంద్రబాబు
-
Nov 09, 2025 17:53 IST
జూబ్లీహిల్స్‌లో 407 పోలింగ్ కేంద్రాలు: ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు: ఆర్వీ కర్ణన్
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి: ఆర్వీ కర్ణన్
రేపు కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో ఎన్నికల సామగ్రి పంపిణీ
అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్: ఆర్వీ కర్ణన్
పోలింగ్ సరళిపై డ్రోన్ల ద్వారా నిఘా: ఆర్వీ కర్ణన్
-
Nov 09, 2025 17:05 IST
బిహార్‌లో ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం
రెండో విడతలో 122 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న పోలింగ్
-
Nov 09, 2025 17:05 IST
ఉత్తరాఖండ్‌లో ప్రధాని మోదీ పర్యటన
ఉత్తరాఖండ్ రాష్ట్ర అవతరణ రజతోత్సవ వేడుకల్లో పాల్గొన్న మోదీ
ఉత్తరాఖండ్ ప్రత్యేక పోస్టల్ స్టాంప్ విడుదల చేసిన మోదీ
ఫసల్ బీమా యోజన కింద రైతుల ఖాతాలకు రూ.62 కోట్లు బదిలీ చేసిన మోదీ
పుణ్యక్షేత్రాలు, సాంస్కృతిక చిహ్నాలకు ఉత్తరాఖండ్ గుర్తింపు: మోదీ
ఉత్తరాఖండ్‌కు రోజూ 4 వేలమందికి పైగా పర్యాటకులు వస్తున్నారు: మోదీ
-
Nov 09, 2025 17:04 IST
జపాన్‌లో భారీ భూకంపం
రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6.7గా నమోదు
సునామీ హెచ్చరికలు జారీ
-
Nov 09, 2025 17:04 IST
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముగిసిన ఎన్నికల ప్రచారం
పోటాపోటీగా ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్, BRS, BJP
ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు పోలీసుల ఆంక్షలు
రెండు రోజుల పాటు మద్యం అమ్మకాలపై నిషేధం
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు: సీపీ సజ్జనార్
-
Nov 09, 2025 17:03 IST
హైదరాబాద్: యూసఫ్‌గూడలో కేటీఆర్ రోడ్ షో
గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసింది: కేటీఆర్
అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది: కేటీఆర్
కాంగ్రెస్ చేసిన మోసాన్ని జూబ్లీహిల్స్ ప్రజలు గుర్తుతెచ్చుకోవాలి: కేటీఆర్
వీడియో ద్వారా రేవంత్ హామీలను వినిపించిన కేటీఆర్
కేసీఆర్ పదేళ్ల పాలను గుర్తుతెచ్చుకోండి: కేటీఆర్
హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చుతున్నారు: కేటీఆర్
ఇందిరమ్మ రాజ్యం కాదు.. ఇళ్లు కూలగొట్టే రాజ్యం: కేటీఆర్
పోలింగ్ రోజున ప్రతిఒక్కరూ ఓటు వేయాలి: కేటీఆర్
-
Nov 09, 2025 15:49 IST
రాహుల్, లాలూ కుమారుడి యాత్ర ఉద్దేశం ఏంటి?: అమిత్ షా
చొరబాటుదారులను రక్షించేందుకే వారి యాత్ర: అమిత్ షా
చొరబాటుదారులను కాంగ్రెస్ ఓటుబ్యాంక్‌గా మార్చుకుంది
చొరబాటుదారులు మన యువత ఉద్యోగాలు లాక్కుంటున్నారు
చొరబాటుదారులు మన పేదల రేషన్‌ను దోచుకుంటున్నారు
బిహార్ నుంచి చొరబాటుదారులను తరిమికొడతాం: అమిత్ షా
బిహార్ అభివృద్ధి కోసం బీజేపీ కట్టుబడి ఉంది: అమిత్ షా
-
Nov 09, 2025 15:21 IST
కేరళ: గురువాయుర్ శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శించుకున్న ముకేష్
ఆలయ అభివృద్ధి కోసం రూ.5 కోట్లు విరాళం అందజేసిన ముకేష్ అంబానీ
-
Nov 09, 2025 15:21 IST
రేపు ఉ.11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ
ఈనెల 14, 15న విశాఖలో CII సదస్సుపై కీలక చర్చ
తుఫాన్ ప్రభావం, నష్టం అంచనాలు, పరిహారంపై చర్చించనున్న కేబినెట్
పలు సంస్థలకు భూకేటాయింపులపై ఆమోదం తెలపనున్న కేబినెట్
నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్న కేబినెట్
-
Nov 09, 2025 14:38 IST
ముస్లింల ప్రయోజనాల కోసమే కాంగ్రెస్, BRS పనిచేస్తున్నాయి: బండి సంజయ్
80 శాతం ఉన్న హిందువుల పక్షాన బీజేపీ పోరాడుతోంది
కేటీఆర్ డ్రగ్స్ తీసుకోలేదని ప్రమాణం చేయగలరా?
మాగంటి గోపీనాథ్‌పై BRSకు ప్రేమ లేదు
మాగంటి గోపీనాథ్ ఆస్తుల కోసం సునీతతో కలిసి కేటీఆర్ కుట్రలు
ప్రభుత్వం దగ్గర పైసా లేనప్పుడు అభివృద్ధి ఎలా చేస్తారు?
హైదరాబాద్ అభివృద్ధిపై కాంగ్రెస్‌కు శ్వేతపత్రం విడుదల చేయాలి
-
Nov 09, 2025 14:14 IST
నేను ఓ మంత్రిగా ఇక్కడకు రాలేదు: లోకేష్
బాధ్యత గల భారతీయ పౌరుడిగా వచ్చా: మంత్రి లోకేష్
2019లో ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన వ్యక్తికి ఏపీ ప్రజలు పట్టం కట్టారు
ఐదేళ్లలో ఏపీకి జగన్ తీరని నష్టాన్ని మిగిల్చారు: మంత్రి లోకేష్
వైసీపీ హయాంలో ఏపీలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయి: లోకేష్
జగన్ పాలనలో పరిశ్రమలు, పెట్టుబడులు రాలేదు: లోకేష్
పారిశ్రామికవేత్తలు ఏపీని విడిచివెళ్లారు: మంత్రి లోకేష్
అలాంటి పరిస్థితి బిహార్‌కు రాకూడదు: మంత్రి నారా లోకేష్
-
Nov 09, 2025 14:13 IST
మరో 8 ఏళ్లు మేమే అధికారంలో ఉంటాం: సీఎం రేవంత్
2028 డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు రావు..
2029 జూన్‌లో జమిలి ఎన్నికలు వస్తాయి: సీఎం రేవంత్
నేను చెప్పేది రాసి పెట్టుకోండి.. 2034 వరకు అధికారంలో ఉండేది కాంగ్రెస్సే
త్వరలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు: రేవంత్
-
Nov 09, 2025 14:13 IST
తెలంగాణ ఖజానాను కేసీఆర్ కుటుంబం కొల్లగొట్టింది: మహేష్‌గౌడ్
వాటా పంపకాల్లో తేడాతో కేసీఆర్, కవిత రోడ్డునపడ్డారు: మహేష్‌గౌడ్
సినీ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది: మహేష్‌గౌడ్
-
Nov 09, 2025 14:12 IST
గత పాలకులు రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేశారు: మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
వైసీపీ ప్రభుత్వ పాపాలు ఇప్పటికీ ప్రజలను వెంటాడుతున్నాయి: బీసీ జనార్దన్‌రెడ్డి
ఇప్పటివరకు రూ.2,800 కోట్లు రోడ్ల అభివృద్ధికి ఖర్చు చేశాం: బీసీ జనార్దన్‌రెడ్డి
మరో రూ.1,000 కోట్లతో రోడ్ల అభివృద్ధికి టెండర్లు పిలుస్తాం: మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
PPP విధానంలో పలు రోడ్లు అభివృద్ధికి సీఎం చర్యలు తీసుకున్నారు
PPP విధావంలో ప్రజలపై టోల్ భారం పడకుండా చర్యలు తీసుకున్నాం: బీసీ జనార్దన్‌రెడ్డి
-
Nov 09, 2025 12:38 IST
ఉత్తరాఖండ్ పర్యటనలో ప్రధాని మోదీ..
ఉత్తరాఖండ్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ..
ఉత్తరాఖండ్ ఏర్పాటు రజతోత్సవ వేడుకల కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ..
కార్యక్రమాన్ని పురస్కరించుకుని స్మారక తపాలా బిళ్లను విడుదల చేసిన ప్రధాని.
-
Nov 09, 2025 11:51 IST
దుర్గగుడిలో భక్తుల రద్దీ
విజయవాడ: దుర్గగుడిలో భక్తుల రద్దీ
వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు
ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఈవో శీనా నాయక్
అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్‌లో బారులుతీరిన భక్తులు
వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లల కోసం ప్రత్యేక లైన్ల ఏర్పాటు.
-
Nov 09, 2025 11:15 IST
వేడుకగా కార్తీక వనభోజన మహోత్సవం..
తిరుమలలో వేడుకగా కార్తీక వనభోజన మహోత్సవం..
శ్రీవారి ఆలయం నుంచి ఊరేగింపుగా పార్వేటి మండపానికి చేరుకున్న శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి..
పార్వేటి మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి సప్న తిరుమంజనాని నిర్వహిస్తున్న అర్చకులు..
మరికాసేపట్లో భక్తులకు శ్రీవారి ప్రసాదాలను వితరణ చేయనున్న టీటీడీ అధికారులు..
-
Nov 09, 2025 09:37 IST
మరోసారి క్షుద్రపూజల కలకలం
వరంగల్ : వర్ధన్నపేట మండలం ఇల్లందలో మరోసారి క్షుద్రపూజల కలకలం
ఊరి శివారులో క్షుద్రపూజలు చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
కార్తీక పౌర్ణమి రోజున కూడా ఇదే ప్రాంతంలో జంతు బలి ఇచ్చి క్షుద్రపూజలు చేసిన దుండగులు
భయాందోళనలో స్థానికులు
-
Nov 09, 2025 08:56 IST
నేటితో ముగియనున్న బీహార్ ఎన్నికల ప్రచారం
సాయంత్రం 5 గంటలకు ముగియనున్న బీహార్ రెండో విడత ఎన్నికల ప్రచారం
చివరి రోజు ఎన్నికల ప్రచారం కావడంతో హోరాహోరీగా ప్రచారం చేస్తున్న ప్రధాన పార్టీలు
బీహార్ రెండో విడత ఎన్నికల ప్రచారంలో బీజేపీ అగ్రనేతలతో పాటు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రచారం నిర్వహిస్తున్నారు
ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఎం సహా అనేక పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి..
రెండో విడతలో 122 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న పోలింగ్..
ఇప్పటికే 121 స్థానాలకు ముగిసిన పోలింగ్.. 14 వ తేదీన ఎన్నికల ఫలితాలు.
-
Nov 09, 2025 08:17 IST
రోడ్డుపై కాలిపోయిన కారు..
నంద్యాల : శ్రీశైలం - హైద్రాబాద్ ఘాట్ రోడ్డులో కారులో చెలరేగిన మంటలు..
మంటల్లో దగ్దమైన కారు ..
హైద్రాబాద్ నుంచి శ్రీశైలానికి కారులో వస్తున్న సమయంలోఈగలపెంట వద్ద ఘటన
ఈగలపెంట మైసమ్మ ఆలయం సమీపంలో రాత్రి సమయంలో మంటల్లో దగ్దమైన కారు.. భక్తులు సురక్షితం
షార్ట్‌సర్క్యూట్ కారులో చెలరెగిన మంటలుగా భావిస్తున్న పోలీసులు
భయంతో కారును నిలిపివేసి బయటకు దిగిన మల్లన్న భక్తులు.
-
Nov 09, 2025 07:14 IST
నేటితో ముగియనున్న ప్రచారం
నేటితో ముగియనున్న జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం
ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు మూగబోనున్న మైకులు
దాదాపు 17 రోజుల పాటు సాగిన ఉప ఎన్నికల ప్రచారం
హోరాహోరీగా సాగిన అన్ని ప్రధాన పార్టీల ప్రచారం
ఇవాళ చివరి రోజు కావడం తో భారీగా రోడ్ షో లు , ర్యాలీలకు ప్లాన్ చేసుకున్న బీజేపీ , కాంగ్రెస్ , బిఆర్ఎస్ లు
11 న పోలింగ్ ఉండటం తో 48 గంటల ముందు ప్రచారం ఆపనున్న పార్టీలు
14న ఓట్ల లెక్కింపు. 3.92 లక్షల ఓట
-
Nov 09, 2025 07:12 IST
నేడు పలమనేరుకు డిప్యూటీ సీఎం..
చిత్తూరు: నేడు పలమనేరుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ముసలి మడుగు వద్ద ఏర్పాటుచేసిన ఆపరేషన్ ఎలిఫెంట్ కుంకి ఏనుగుల శిబిరానికి ప్రారంభం చేయనున్న పవన్ కళ్యాణ్..
10.45 గంటలకు శిబిరం ప్రారంభం..
అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్.