Share News

BREAKING: కర్రెగుట్ట అడవుల్లో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

ABN , First Publish Date - Oct 14 , 2025 | 05:56 AM

LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

BREAKING: కర్రెగుట్ట అడవుల్లో భారీగా  పేలుడు పదార్థాలు స్వాధీనం

Live News & Update

  • Oct 14, 2025 13:47 IST

    కర్రెగుట్ట అడవుల్లో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

    • ఛత్తీస్ గడ్ కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు

    • అటవీ ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు కంటపడిన పేలుడు పదార్థాలు

    • 51 లైవ్ బీజీఎల్, 100 హెచ్డీ అల్యూమినియం వైర్ కట్టలు, 50 పైపులు తదితర వస్తువుల స్వాధీనం

  • Oct 14, 2025 13:18 IST

    ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంలో కీలక పరిణామం

    • సుప్రీం కోర్టులో ఫోన్ టాపింగ్ కేసు విచారణ

    • విచారణ జరిపిన జస్టిస్ బీవీ నాగరత్నం, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం

    • తెలంగాణ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు

    • ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో ప్రభాకర్ రావు ఐ క్లౌడ్ పాస్వర్డ్ రీసెట్ చేయమని సూచించిన సుంప్రీంకోర్టు

    • మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు కు అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ పొడిగింపు

    • తదుపరి విచారణ నవంబర్ 18కి వాయిదా

  • Oct 14, 2025 13:00 IST

    చెవిరెడ్డి రెడ్డి, మిథున్ రెడ్డి పిటిషన్లపై నేడు విచారణ

    • విజయవాడ: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్‌పై ఈరోజు ఏసీబీ కోర్టులో విచారణ

    • వెన్ను నొప్పి శస్త్ర చికిత్సకు అనుమతివ్వాలని చెవిరెడ్డి పిటిషన్

    • విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చెవిరెడ్డి

    • అలాగే వైసీపీ నేత మిథున్ రెడ్డి పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ

    • ఈనెల 20న యూఎస్ వెళ్లాలని కోర్టును అనుమతి కోరిన ఎంపీ మిథున్ రెడ్డి

    • 27న యూఎస్ లో జరిగే భేటీలో పాల్గొనాల్సి ఉందన్న మిథున్ రెడ్డి

    • మిథున్ రెడ్డి పిటిషన్‌పై ఈరోజు విచారణ జరపనున్న ఏసీబీ కోర్టు

  • Oct 14, 2025 12:52 IST

    మిథున్ రెడ్డి ఇల్లు, ఆఫీసుల్లో సోదాలు

    • లిక్కర్ స్కాం కేసులో మిథున్ రెడ్డి ఇల్లు ఆఫీసుల్లో సిట్ సోదాలు.

    • లిక్కర్ స్కాం కేసు ఏ4గా ఉన్న మిథున్ రెడ్డి.

    • లిక్కర్ స్కాం కేసులో మిథున్ రెడ్డికి అరెస్టు కాగా ఇటీవల బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు.

    • మిథున్ రెడ్డిపై త్వరలో ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న సిట్ అధికారులు.

    • హైదరాబాద్, బెంగుళూరులో కొనసాగుతున్న సిట్ సోదాలు.

  • Oct 14, 2025 12:06 IST

    మాగంటి అక్షరపై కేసు నమోదు

    • జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత, కూతురు మాగంటి అక్షరపై కేసు నమోదు చేసిన పోలీసులు

    • యూసుఫ్‌గూడ డివిజన్ వెంకటగిరిలో శుక్రవారం రోజు నమాజ్ చేయడానికి వెళ్తున్న వారిని ఓటు వేయడానికి ప్రభావితం చేస్తున్నారని కేసు నమోదు

    • మాగంటి సునీతను A1, మాగంటి అక్షరను A2గా మరికొంత మందిని చేరుస్తూ కేసు నమోదు చేసిన పోలీసులు

  • Oct 14, 2025 12:04 IST

    18 కేజీల గంజాయి సీజ్

    • నెల్లూరు వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద 18 కేజీల గంజాయి పట్టుకున్న ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు.

    • వాహన తనిఖీల్లో పట్టుబడ్డ నలుగురు వ్యక్తులు..

    • నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న అధికారులు..

  • Oct 14, 2025 11:01 IST

    మావోయిస్టు నేత లొంగుబాటు..!

    • ఛత్తీస్‌గఢ్: మావోయిస్టు నేత మల్లోజుల వేణుగోపాల్‌రావు లొంగుబాటు?

    • 60 మందితో కలిసి గడ్చిరోలిలో ఆయుధాలు వదిలేసినట్టు సమాచారం

  • Oct 14, 2025 10:29 IST

    జూబ్లీహిల్స్ క్షేత్రంలోకి కాంగ్రెస్ పెద్దలు

    • నేడు జూబ్లీహిల్స్‌లో పర్యటించనున్న పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, పార్టీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్

    • బూత్ స్థాయి ట్రైనింగ్ సమావేశాలు నిర్వహించనున్న హస్తం నేతలు

    • రేపటి నుండి విస్తృతంగా ప్రచారం చేయనున్న కాంగ్రెస్ నేతలు

    • ఎన్నికల ప్రచారం, ప్రచార ఎజెండాను రూపొందించిన కాంగ్రెస్

    • బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకుంటామన్న హస్తం నేతలు

  • Oct 14, 2025 10:18 IST

    సుప్రీం కోర్ట్‌లో తెలంగాణ బీసీ రిజర్వేషన్ల ప్రస్తావన

    • 42 శాతం రిజర్వేషన్ల పిటిషన్‌పై సుప్రీంకోర్టులో మెన్షన్ చేసిన తెలంగాణ ప్రభుత్వం

    • సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ దగ్గర మెన్షన్ చేసిన రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులు

    • గురువారం లేదా శుక్రవారం విచారణకు తీసుకోవాలని విజ్ఞప్తి చేసిన న్యాయవాదులు

    • ప్రధాన న్యాయమూర్తి అనుమతితో లిస్ట్ చేయనున్నట్లు పేర్కొన్న రిజిస్ట్రార్

    • గురువారం లేదా శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం

  • Oct 14, 2025 10:07 IST

    బాలాపూర్ చెరువులో గుర్తుతెలియని మృతదేహం ..

    • హైదరాబాద్ బాలాపూర్ చెరువులో గుర్తుతెలియని మృతదేహం ..

    • ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు

    • మిస్సింగ్ కేసు వివరాలు పరిశీలిస్తున్న పోలీసులు

  • Oct 14, 2025 09:55 IST

    బండ్లగూడలో బాలుడిపై లైంగిక దాడికి యత్నం

    • హైదరాబాద్ బండ్లగూడ పరిధిలో 11 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి యత్నం..

    • ఆదివారం రాత్రి కిరాణా దుకాణానికి వెళ్లిన బాలుడు..

    • ఒంటరిగా ఉన్న బాలుడిని మాయమాటలతో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ తీసుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తి

    • అక్కడ బెదిరించి దుస్తులు విప్పుతుండంగా కేకలు పెట్టిన బాలుడు..

    • బాలుడు అరవడంతో పరారైన వ్యక్తి..

    • కేసు నమోదు చేసుకుని, సీసీ కెమెరాలు పరిశీలిస్తున్న బండ్లగూడ పోలీసులు

  • Oct 14, 2025 09:32 IST

    బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్

    • జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్

    • రేపు ఉదయం 11గంల నుంచి మధ్యహాన్నం 1గంల మధ్య నామినేషన్

    • హంగు అర్బాటం లేకుండా.. నామినేషన్ వేయాలని భావిస్తోన్న బీఆర్ఎస్

    • నామినేషన్ తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భారీ ర్యాలీకి బీఆర్ఎస్ ప్లాన్

    • మరోవైపు ఎల్లుండి నుంచి ఉప ఎన్నిక ప్రచారాన్ని ఉదృతం చేయనున్న ప్రధాన ప్రతిపక్షం

    • కేటీఆర్, హరీష్ రావు సహా.. జూబ్లీహిల్స్ లోనే మకాం వేయనున్న బీఆర్ఎస్ నేతలు

  • Oct 14, 2025 09:26 IST

    స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ.. ఇరుక్కుపోయిన డ్రైవర్

    • నల్లగొండ వేములపల్లి మండలం శెట్టిపాలెం జంక్షన్ వద్ద స్కూల్ బస్సును ఢీ కొట్టిన లారీ.

    • బస్సు క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్.. అరగంట నుంచి ఆర్తనాదాలు..

    • డ్రైవర్‌ను బయటికి తీసేందుకు ప్రయత్నం చేస్తున్న స్థానికులు.

    • శెట్టిపాలెంలో స్కూల్ విద్యార్థులను తీసుకువచ్చేందుకు వెళ్తుండగా ఘటన.

    • ప్రమాద సమయంలో బస్సులో విద్యార్థులు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం.

  • Oct 14, 2025 07:21 IST

    నేడు జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ నేతల పర్యటన

    • నేడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల పర్యటన

    • వివిధ డివిజన్లలో బూత్‌ స్థాయి సమావేశాలు

    • హాజరుకానున్న మీనాక్షి, మహేష్‌గౌడ్, పొన్నం, వివేక్, తుమ్మల