-
-
Home » Mukhyaamshalu » latest and breaking ABN Andhra Jyothy news across the world on 9th september 2025 kjr
-
BREAKING: ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన రాధాకృష్ణన్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
ABN , First Publish Date - Sep 09 , 2025 | 06:01 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Sep 09, 2025 20:50 IST
ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన రాధాకృష్ణన్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
రాధాకృష్ణన్ జీవితం ఎల్లప్పుడూ ప్రజాసేవకే అంకితం: ప్రధాని మోదీ
అణగారిన వర్గాల సాధికారతకు కృషి చేసిన వ్యక్తి రాధాకృష్ణన్: మోదీ
అత్యుత్తమ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ నిలుస్తారని భావిస్తున్నా: మోదీ
రాజ్యాంగ విలువలను రాధాకృష్ణన్ బలేపేతం చేస్తారని ఆశిస్తున్నా: మోదీ
-
Sep 09, 2025 19:43 IST
భారత 17వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్
NDA అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు
సీపీ రాధాకృష్ణన్ పూర్తిపేరు చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్
ఇండీ కూటమి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డికి 300 ఓట్లు
781లో పోలైన మొత్తం ఓట్లు 767, చెల్లనివి 15
జార్ఖండ్, తెలంగాణ, మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన రాధాకృష్ణన్
1998, 1999లో కోయంబత్తూరు ఎంపీగా గెలిచిన సీపీ రాధాకృష్ణన్
2004-2007 మధ్య తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన రాధాకృష్ణన్
-
Sep 09, 2025 19:00 IST
సైనికులు మృతి..
జమ్మూకశ్మీర్: లడఖ్‌లోని సియాచిన్‌లో విషాదం
హిమపాతంలో చిక్కుకుని ముగ్గురు సైనికులు మృతి
-
Sep 09, 2025 19:00 IST
గ్రూప్-1 పరీక్ష తిరిగి నిర్వహించాలి: కేటీఆర్
గ్రూప్-1 అవకతవకలపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలి: కేటీఆర్
-
Sep 09, 2025 19:00 IST
ఈ-కార్ రేస్ కేసు ఒక లొట్టపీసు కేసు: కేటీఆర్
చార్జిషీట్ అనేది ప్రొసీజర్‌లో భాగమే: కేటీఆర్
ప్రభుత్వానికి దమ్ముంటే మీడియా ఎదుట..
నాకు, ముఖ్యమంత్రికి లైడిటెక్టర్ టెస్ట్ చేయాలి: కేటీఆర్
-
Sep 09, 2025 18:50 IST
సంగారెడ్డి జిల్లాలో విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం
మునిపల్లి మండలం లింగంపల్లిలో కూలిన బాలుర గురుకుల హాస్టల్ భవనం
ముగ్గురు విద్యార్థులకు గాయాలు, ఆస్పత్రికి తరలింపు
ప్రమాదానికి ముందు భవనంలో 84 మంది విద్యార్థులు
విద్యార్థులు లంచ్‌కు వెళ్లడంతో తప్పిన ప్రమాదం
40 ఏళ్లనాటి భవనంలో హాస్టల్ నిర్వహణ
ఘటనా స్థలానికి కలెక్టర్ ప్రావీణ్య, ఇతర ఉన్నతాధికారులు
గురుకులానికి నూతన హాస్టల్ భవనం నిర్మించాలని కోరుతున్న పేరెంట్స్
-
Sep 09, 2025 18:30 IST
ఉపరాష్ట్రపతి ఎన్నిక ఓట్ల లెక్కింపు, కాసేపట్లో ఫలితాలు
ఓటుహక్కు వినియోగించుకున్న 768 మంది ఎంపీలు
ఓటింగ్‌లో పాల్గొనని బీజేడీ, బీఆర్‌ఎస్, శిరోమణి అకాలీదళ్
బరిలో సీపీ రాధాకృష్ణన్(NDA), బి.సుదర్శన్‌రెడ్డి(I.N.D.I.A)
-
Sep 09, 2025 18:30 IST
హైదరాబాద్‌లో NSG, ఆక్టోపస్ ఉమ్మడి కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, కంచన్‌బాగ్, DRDL, తాజ్ ఫలక్‌నుమాలో మాక్‌డ్రిల్
నాలుగు రోజులపాటు మాక్‌డ్రిల్ నిర్వహించనున్న NSG, ఆక్టోపస్
-
Sep 09, 2025 17:02 IST
ముగిసిన పోలింగ్..
ఉపరాష్ట్రపతి ఎన్నికకు ముగిసిన పోలింగ్
90 శాతం పైగా పోలింగ్, కాసేపట్లో ఓట్ల లెక్కింపు
-
Sep 09, 2025 15:01 IST
భద్రాద్రి కొత్తగూడెం: చర్ల మండలం ఒద్దిపేటలో విషాదం
మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ శ్లాబ్ కూలి ఇద్దరు కూలీలు మృతి
మరో ఇద్దరు కూలీలకు తీవ్రగాయాలు, పరిస్థితి విషమం
వాటర్ ట్యాంక్‌పై శ్లాబ్ సెంట్రింగ్ పనులు చేస్తుండగా ఘటన
-
Sep 09, 2025 15:01 IST
పెండింగ్ ప్రాజెక్టులు స్పీడప్ అవుతున్నాయి: మంత్రి కోమటిరెడ్డి
SLBC పూర్తయితో గ్రావిటీ ద్వారా నీరు తెచ్చుకోవచ్చు: కోమటిరెడ్డి
SLBC పనులను గత BRS ప్రభుత్వం పక్కనపెట్టింది: కోమటిరెడ్డి
2027 నాటికి SLBC పనులు పూర్తిచేస్తాం: మంత్రి కోమటిరెడ్డి
-
Sep 09, 2025 15:01 IST
అమరావతి: APలో స్థానిక సంస్థలకు 4 దశల్లో ఎన్నికలు: ఎస్‌ఈసీ నీలం సాహ్ని
EVMలతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వాన్ని సంప్రదిస్తాం: నీలం సాహ్ని
మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్‌లో EVMలు వాడారు: నీలం సాహ్ని
EVMల కొనుగోలు, వినియోగంపై త్వరలో నిర్ణయం: నీలం సాహ్ని
-
Sep 09, 2025 15:01 IST
అమరావతి: సచివాలయంలో మంత్రి కొలుసు పార్థసారథి సమీక్ష
PMAY 1.0 కింద ఇళ్ళు పూర్తిచేసి లబ్ధిదారులకు అందించడంపై చర్చ
PMAY 1.0 కింద చేపట్టిన 94,952 ఇళ్ళు త్వరగా పూర్తిచేయాలని ఆదేశాలు
హుద్‌హుద్ ఇళ్లను అప్పగించాలని విశాఖ హౌసింగ్ అధికారులకు ఆదేశాలు
Pmay 2.0 లబ్ధిదారుల గుర్తింపును వేగవంతం చేయాలని మంత్రి ఆదేశాలు
-
Sep 09, 2025 15:01 IST
వైసీపీ ప్రతిపక్షం కాదు.. విషవృక్షం: మంత్రి వాసంశెట్టి సుభాష్
వైసీపీ దుష్ర్పచారంతో ఆందోళనలో రైతులు: మంత్రి వాసంశెట్టి
ఏపీలో యూరియా కొరత అనేది అవాస్తవం: వాసంశెట్టి సుభాష్
రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ విషప్రచారం: మంత్రి వాసంశెట్టి
-
Sep 09, 2025 14:09 IST
ఉపరాష్ట్రపతి ఎన్నికకు కొనసాగుతున్న పోలింగ్
ఇప్పటివరకు 90 శాతం పైగా పోలింగ్ నమోదు
700కి పైగా ఓటుహక్కు వినియోగించుకున్న ఎంపీలు
సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్
సాయంత్రం 6 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు
బరిలో రాధాకృష్ణన్(NDA), జస్టిస్ సుదర్శన్‌రెడ్డి(ఇండి కూటమి)
NDA అభ్యర్థి రాధాకృష్ణన్‌కు 437 మంది ఎంపీల మద్దతు
ఇండి కూటమి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డికి 324 మంది MPల మద్దతు
770 మంది ఎలక్టోరల్ సభ్యులు, మ్యాజిక్ ఫిగర్ 385 ఓట్లు
-
Sep 09, 2025 12:55 IST
మద్యం కుంభకోణం కేసులో నేటితో ముగిసిన నిందితుల రిమాండ్
మిథున్ రెడ్డి మినహా మిగిలిన 11 మంది కోర్టుకు హాజరు
సిట్ అధికారులు పట్టుకున్న 11కోట్ల అంశాన్ని కోర్టుకు వివరించిన కేసి రెడ్డి
దానిపై తగిన ఆదేశాలు జారీ చేశామన్న న్యాయాధికారి
బెయిల్ పిటిషన్లపై ప్రాసిక్యూషన్, నిందితుల తరపు మద్య వాదనలు
డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై 11వ తేదీన హైకోర్టులో విచారణ ఉందని కోర్టుకు చెప్పిన న్యాయవాదులు
12వ తేదీకి రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు
-
Sep 09, 2025 12:08 IST
దుబాయ్ వెళ్లిపోయేందుకు నేపాల్ ప్రధాని ప్రయత్నాలు
విమానాన్ని సిద్ధం చేసుకున్న నేపాల్ ప్రధాని కేపీ ఓలీ
నేపాల్‌లో ముదురుతున్న సంక్షోభం
రెండో రోజు కొనసాగుతోన్న ఆందోళనలు
-
Sep 09, 2025 11:52 IST
నేపాల్‌లో మరింత ముదిరిన సంక్షోభం
నేపాల్‌లో రెండో రోజు కొనసాగుతోన్న ఆందోళనలు
నేపాల్ ప్రధాని రాజీనామా చేయాలని నిరసనకారుల డిమాండ్లు
నేతల ఇళ్ల ముట్టడికి ఆందోళనకారుల యత్నం
టియర్ గ్యాస్ ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తెస్తున్న ఆర్మీ
ఇప్పటికే పదవులకు హోం, వ్యవసాయశాఖ మంత్రులు రాజీనామా
-
Sep 09, 2025 11:33 IST
హాస్పిటల్ బిల్డింగ్‌లో మంటలు
నూజివీడు ట్రిపుల్ ఐటీ హాస్పిటల్ బిల్డింగ్ బ్లాక్‌లో షార్ట్ సర్క్యూట్ తో వ్యాపించిన మంటలు.
భయందోళనతో బయటకు పరుగులు పెట్టిన విద్యార్థులు.
ఎటువంటి నష్టం జరగకుండా హుటాహుటిన నివారణ చర్యలు చేపట్టిన అధికారులు.
-
Sep 09, 2025 11:13 IST
నేపాల్ ప్రధాని కేపీ ఓలీకి మరో ఎదురుదెబ్బ
పదవికి వ్యవసాయశాఖ మంత్రి రామ్‌నాథ్ రాజీనామా
నిరసనలకు బాధ్యత వహిస్తూ ఇప్పటికే నేపాల్ హోంమంత్రి రాజీనామా
నిన్నటి ఆందోళనల్లో 19 మంది మృతి, 347 మందికిపైగా గాయాలు
-
Sep 09, 2025 10:57 IST
సుప్రీంకోర్టులో వివేకా హత్య కేసు విచారణ వాయిదా
తదుపరి దర్యాప్తు అవసరమా? లేదా? అన్నదానిపై అఫిడవిట్ దాఖలుకు సమయం కోరిన సీబీఐ
సీబీఐ తరపున కోర్టుకు హాజరైన ఏఎస్‌జీ రాజు
తదుపరి విచారణ 16వ తేదీకి వాయిదా
16వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు వివేకా హత్య కేసులో నిందితుల బెయిల్ రద్దుపై విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు
-
Sep 09, 2025 09:58 IST
తొలి ఓటు వేసిన ప్రధాని మోదీ
పార్లమెంట్ భవన్‌లో ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్
సా.5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్
సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక
బరిలో రాధాకృష్ణన్(NDA), సుదర్శన్‌రెడ్డి(ఇండి కూటమి)
ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఎంపీలు
సాయంత్రం 6 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు
-
Sep 09, 2025 09:48 IST
నేడు హైదరాబాద్ ఆర్ బీవీఆర్ఆర్ పోలీస్ అకాడమీలో ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరుకానున్న తెలంగాణ గవర్నర్ విష్ణుదేవ్ వర్మ , తెలంగాణ సీఎస్ రామకృష్ణ రావు, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా, డీజీపీ జితేందర్
2015 తర్వాత రెండోసారి తెలంగాణలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్
కార్యక్రమానికి 21 రాష్ట్రాల నుంచి 1300 జైలు శాఖ సిబ్బంది రాక
ఈ నెల 9,10,11 మూడు రోజులు పాటు నిర్వహించనున్న కార్యక్రమం
అథ్లెటిక్స్, వాలీబాల్, కబడ్డీ, బిజినెస్ మోడల్స్, కంప్యూటర్ నాలెడ్జ్ షేరింగ్ మెడికల్ స్కిల్స్ వంటి 36 కార్యక్రమాలలో పోటీ పడనున్న సిబ్బంది
కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న బ్యూరో ఆఫ్ పోలీస్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్(బీపీఆర్‌అండ్‌డీ) ఆధ్వర్యంలో క్రీడా పోటీలు
జైళ్ళ శాఖ ఆధ్వర్యంలో పలు స్టాల్స్ ఏర్పాటు
9:30 నిమిషాలకు కార్యక్రమాన్ని ప్రారంభించనున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
-
Sep 09, 2025 09:13 IST
సృష్టి అక్రమాల కేసులో ముగ్గురు వైద్యుల సస్పెన్షన్..
విశాఖపట్నం సృష్టి యూనివర్సల్ ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాల కేసులో నిందితులుగా ఉన్న, ఆంధ్ర మెడికల్ కాలేజ్ , అనస్తీషియా విభాగాధిపతి డాక్టర్ వాసుపల్లి రవి, గైనకాలజిస్ట్ పి ఉషా దేవి..
శ్రీకాకుళం, ప్రభుత్వ వైద్య కళాశాల పీడియాట్రిక్ డాక్టర్ విద్యులతపై చర్యలు
-
Sep 09, 2025 08:57 IST
సంగారెడ్డి ఆర్డీవోపై బదిలీ వేటు
పోస్టింగ్ ఇవ్వకుండానే సంగారెడ్డి ఆర్డీవో రవీందర్ రెడ్డిని ఆకస్మికంగా బదిలీ చేసిన ఉన్నతాధికారులు
పటాన్‌చెరు నియోజకవర్గంలోని పలు వివాదాస్పద భూములపై ఆర్డీవో కొందరికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నట్లు ఆరోపణలు
ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో బదిలీ
ఆర్డీవోను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి లోకేశ్ కుమార్
-
Sep 09, 2025 08:18 IST
లిక్కర్ స్కాం కేసులో నిందితుల రిమాండ్ నేటితో పూర్తి
ఈరోజు ఏడుగురు నిందితులను ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్న అధికారులు
ఈ కేసులో నలుగురికి బెయిల్ మంజూరు కాగా, మిథున్ రెడ్టికి ఐదు రోజులు మధ్యంతర బెయిల్ ఇచ్చిన ఎసీబీ కోర్టు