-
-
Home » Mukhyaamshalu » INSTANT BREAKING NEWS FROM ABN IS HERE VR
-
BREAKING: కేసీఆర్‌తో మీ రిలేషన్ ఏమైంది.. జగన్‌కు పయ్యావుల కౌంటర్..
ABN , First Publish Date - Aug 13 , 2025 | 06:11 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
Aug 13, 2025 18:19 IST
కేసీఆర్‌తో మీ రిలేషన్ ఏమైంది.. జగన్‌కు పయ్యావుల కౌంటర్..
జగన్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన మంత్రి పయ్యావుల కేశవ్.
దొంగఓట్ల గురించి రాహుల్ గాంధీ, రేవంత్, మాణిక్యం ఠాగూర్ ఎందుకు మాట్లాడడం లేదు అని జగన్ అన్నారు.
అసలు ఈ దొంగ ఓట్ల వ్యవహారం మీరు ఉరవకొండ నుండి మొదలెట్టారు.
విశాఖపట్నం, తిరుపతి, పర్చూరు ఘటనలు మర్చిపోయారా?
మేం ప్రజల్ని నమ్ముకున్నాం దొంగఓట్ల కార్యక్రమాన్ని నమ్ముకోలేదు.
ఈ విషయంలో మీరే రాహుల్ గాంధీకి హట్ లైన్‌లో చెప్పి నేర్పించినట్టు ఉన్నారు.
కేంద్రంలో ఎన్డీయేలో బలమైన, నమ్మకమయిన భాగస్వామ్యంతో ఉన్నాము.
అవును.. రేవంత్ రెడ్డి ఒకప్పుడు మా పార్టీ నాయకుడు.
మీకు కేసీఆర్‌తో సంబంధాలు లేవా?
గిఫ్ట్‌లు, రిటర్న్ గిఫ్ట్‌లు ఏమయ్యాయి?
చంద్రబాబు ఇప్పుడు చాలా పెద్ద నాయకుడు. జాతీయ స్థాయిలో గొప్ప నాయకుడు.
మరో పదేళ్లపాటు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉంటారు.
అసలు మీరు వచ్చే ఎన్నికల బరిలో నిలిచేందుకు అర్హులుగా ఉంటారో లేదో చూసుకోండి.
అంటూ పయ్యావుల సంచలన కామెంట్స్ చేశారు.
-
Aug 13, 2025 17:52 IST
BREAKING: విజయవాడలో భారీ వర్షం..
లోతట్టు ప్రాంతాలు జలమయం.
పలు ప్రధాన రహదారులపై మోకాళ్ల లోతు నిలిచిన నీరు.
ఇబ్బందులు పడుతున్న వాహనదారులు.
-
Aug 13, 2025 17:49 IST
BREAKING: ఫిల్మ్ ఛాంబర్‌లో నిర్మాతలు, ఫెడరేషన్ చర్చలు విఫలం.
నిర్మాతలు, ఫెడరేషన్ మధ్య కొలిక్కిరాని కొన్ని ప్రతిపాదనలు.
మరి కొన్ని రోజులు కొనసాగనున్న సమ్మె.
రేపు ఎల్లుండి కూడా మీటింగ్స్ జరుగుతాయి అంటున్న నిర్మాత సి కళ్యాణ్.
డాన్సర్స్, ఫైటర్స్, టెక్నీషియన్స్ ఈ మూడు యూనియన్‌లకు పర్సంటేజ్ పెంచలేమన్న నిర్మాతలు.
సమ్మె కొనసాగించెందుకు తాము సిద్దమే అన్న నిర్మాతలు.
ఛాంబర్‌లో హోరాహోరీగా మారిన భేటీ.
దిల్ రాజుతో మాట్లాడుతున్న ఫెడరేషన్ నాయకులు.
-
Aug 13, 2025 17:27 IST
పలు విమానాల దారి మళ్లింపు..
హైదరాబాద్: వివిధ ప్రాంతాల నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు రావలసిన ఐదు విమానాలు దారిమళ్లింపు.
వివిధ ప్రాంతాల నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు రావాల్సిన మూడు విమానాలను విజయవాడకు మళ్ళించిన ఆధికారులు.
మరో రెండు విమానాలను తిరుపతి బెంగళూరుకు మళ్ళింపు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో వాతావరణం అనుకూలించకపోవడంతో దారి మళ్లించిన ఆధికారులు.
-
Aug 13, 2025 17:21 IST
జనగామ జిల్లాలో దారుణం..
యువతిపై 10మంది యువకుల సామూహిక అత్యాచారం.
నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.
జూన్ నెలలో జరిగిన దారుణం.
ఆలస్యంగా ఫిర్యాదు చేసిన యువతి బంధువు.
-
Aug 13, 2025 17:09 IST
FLASH NEWS: సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన ఎమ్మెల్సీ అలీ ఖాన్..
* ఏబీఎన్‌తో ఎమ్మెల్సీ ఆమీర్ అలీ ఖాన్.
* సుప్రీంకోర్టు ఈ విధమైన తీర్పు ఇస్తుందని అనుకోలేదు.
* కోర్టు ఆర్డర్ చదివిన తర్వాత అన్ని మాట్లాడుతాను.
* కాసేపటి క్రితమే లాయర్ కాల్ చేసి సుప్రీం కోర్టులో జరిగిన విషయాలు చెప్పారు.
* నేను మొన్నటి వరకు జర్నలిస్టును.
* నాకు ఎలాంటి రాజకీయం బ్యాక్ గ్రౌండ్ లేదు.
* నాటి ప్రభుత్వ పెద్దలు ఇంకా ఏం మాట్లాడలేదు.
-
Aug 13, 2025 16:52 IST
సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఎమ్మెల్సీ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకం రద్దు..
ఢిల్లీ: సుప్రీంకోర్టు సంచలన తీర్పు
గవర్నర్ కోటాలో కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల నియామకం రద్దు: సుప్రీం స్పష్టం
రెండు ఎమ్మెల్సీ స్థానాలలో తాజా నామినేషన్లు తమ తుది తీర్పుకి లోబడే ఉంటాయన్న సుప్రీం
దాసోజు శ్రావణ్, సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల గవర్నర్ తిరస్కరణపై కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు
తమ అభ్యర్థిత్వన్ని గవర్నర్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన దాసోజు శ్రావణ్, సత్యనారాయణ.
తదుపరి విచారణ సెప్టెంబర్ 17 కు వాయిదా.
గవర్నర్ కోటాలో కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ నియామకం.
ఆగస్టు 14, 2024 తీర్పులో మార్పులు చేసిన సుప్రీంకోర్టు.
-
Aug 13, 2025 13:25 IST
హైదరాబాద్: భారీ వర్షం నేపథ్యంలో GHMC అప్రమత్తం
అత్యవసర సేవల కోసం కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు
NDRF 83330 68536, ICCC 87125 96106, 87126 74000
హైడ్రా 91541 70992, 87126 60600, 040-278524482
రాచకొండ 87126 62999, 85004 11111, 87126 81241
TGSPDCL 79015 30966, RTC 94440 97000
108 EMRI 91007 99129, DG 87126 81251, HMWSNB 99499 30003
ఎక్సైజ్ 87126 59607, GHMC 81259 71221, ఫైర్ విభాగం 99499 91101
-
Aug 13, 2025 13:24 IST
దొంగ ఓట్లపై ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలి: జగ్గారెడ్డి
గత లోక్‌సభ ఎన్నికల్లో 40కి పైగా ఎంపీలు బోగస్ ఓట్లతో గెలిచారు
దొంగ ఓట్లతో మూడోసారి NDA అధికారంలోకి వచ్చింది: జగ్గారెడ్డి
దేశవ్యాప్తంగా దొంగఓట్ల ప్రక్రియ జరిగింది: జగ్గారెడ్డి
బీజేపీ అడుగుజాడల్లో ఎన్నికల సంఘం నడుస్తోంది: జగ్గారెడ్డి
-
Aug 13, 2025 13:00 IST
విజయవాడ: లిక్కర్ స్కామ్ కేసులో 12 మంది నిందితులను..
ఏసీబీ కోర్టు న్యాయాధికారి ఎదుట హాజరుపరిచిన సిట్
హైదరాబాద్‌లో సిట్ సీజ్ చేసిన రూ.11 కోట్ల విషయంలో..
ఆధారాలు ధ్వంసం చేస్తున్నారని కోర్టుకు తెలిపిన రాజ్ కసిరెడ్డి
కాల్ డేటా రికార్డ్స్‌ను స్వచ్ఛంద సంస్థతో విచారణ జరిపితే.. అసలు విషయం బయటకు వస్తుందని చెప్పిన రాజ్ కసిరెడ్డి
SBI, సిట్ కలిసి ఆధారాలను ధ్వంసం చేస్తున్నాయని..
కోర్టు దృష్టికి తెచ్చిన రాజ్ కసిరెడ్డి తరపు న్యాయవాది
-
Aug 13, 2025 12:48 IST
అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి 2019లో శంకుస్థాపన చేశాం: బాలకృష్ణ
అప్పటి వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది
వైసీపీ నిర్లక్ష్యంతో ఆసుపత్రి నిర్మాణ పనులు చేపట్టలేకపోయాం: బాలకృష్ణ
కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు చేపట్టాం: బాలకృష్ణ
-
Aug 13, 2025 12:18 IST
విజయవాడలో భారీ వర్షాలకు ఇద్దరు మృతి
మ్యాన్‌హోల్‌లో పడి 53వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు మధుసూదన్ మృతి
లయోలా కాలేజ్ దగ్గర వర్షాలకు కూలిన చెట్టును ఢీకొని వ్యక్తి మృతి
-
Aug 13, 2025 11:48 IST
తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్ష బీభత్సం
పొంగుతున్న వాగులు, వంకలు
ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వర్షం
హైదరాబాద్‌లో ఒంటిపూట బడులు, 5 జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు
హైదరాబాద్‌లో పలుచోట్ల మొదలైన వర్షం
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్టలో వర్షం
గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్ సిటీ, ఫిల్మ్‌నగర్‌లో వర్షం
శేరిలింగంపల్లి, మియాపూర్, లింగంపల్లిలో వర్షం
కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో స్తంభించిన జనజీవనం
తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు వరద పోటు
-
Aug 13, 2025 11:47 IST
ZPTC ఉపఎన్నికల్లో కుట్రపూరితంగా బూత్‌లు మార్చారు: జగన్
పోలింగ్ బూత్‌ల దగ్గర సీసీ ఫుటేజ్ బయటపెట్టాలి: జగన్
మొత్తం వెబ్‌కాస్టింగ్ బయటపెట్టాలి: జగన్
పులివెందులలో జరిగింది ఎన్నికేనా?: జగన్
ఇతర గ్రామాలకు వెళ్లి ప్రజలు ఓటు వేయాలా?: జగన్
ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకే పోలీసులను పెట్టారు
6 పంచాయతీల్లో 700 మంది పోలీసులను పెట్టారు: జగన్
ఒక్కో బూత్‌లో 500 మంది వరకు బయటివాళ్లు ఓటు వేశారు
బీటెక్ రవి పులివెందుల ఓటరు కాకపోయినా అక్కడే తిష్టవేశారు
బందిపోటు దొంగల తరహాలో ఎన్నిక జరిగింది: జగన్
-
Aug 13, 2025 11:14 IST
ఢిల్లీ: బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణకు క్రికెటర్ సురేష్ రైనా
బెట్టింగ్ యాప్ ప్రమోషన్‌పై సురేష్ రైనాను ప్రశ్నిస్తున్న ఈడీ
-
Aug 13, 2025 11:04 IST
జమ్మూకశ్మీర్ సరిహద్దులో పాక్ కవ్వింపు చర్యలు
యురి సెక్టార్‌లో కాల్పులకు తెగబడ్డ పాక్ రేంజర్లు
పాక్ రేంజర్ల కాల్పుల్లో భారత జవాను మృతి
పాక్ కాల్పులను తిప్పికొడుతున్న భారత్ బలగాలు
-
Aug 13, 2025 10:59 IST
హైదరాబాద్: ఈడీ విచారణకు హాజరైన నటి మంచు లక్ష్మి
పలు గేమింగ్ యాప్స్ ప్రమోట్ కేసులో ప్రశ్నిస్తున్న ఈడీ
బ్యాంక్ స్టేట్‌మెంట్స్‌తో విచారణకు హాజరైన మంచు లక్ష్మి
-
Aug 13, 2025 10:58 IST
మహబూబాబాద్: నెల్లికుదురులో యూరియా కోసం రైతుల పడిగాపులు
PACS ఎదుట గంటల తరబడి క్యూలైన్‌లో బారులుతీరిన అన్నదాతలు
ఒక్కో రైతుకు రెండు బస్తాల కూపన్స్ మాత్రమే ఇస్తున్న అధికారులు
-
Aug 13, 2025 10:58 IST
ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం
జస్టిస్ హరినాథ్, జస్టిస్ కిరణ్మయి, జస్టిస్ సుమతి, జస్టిస్ విజయ్ ప్రమాణం
న్యాయమూర్తులతో ప్రమాణం చేయించిన హైకోర్టు సీజే ధీరజ్‌సింగ్ ఠాకూర్
-
Aug 13, 2025 10:07 IST
భారీ వర్షాలపై ఉన్నతాధికారులు, కలెక్టర్లతో సీఎం రేవంత్ వీడియో కాన్ఫరెన్స్
క్లౌడ్ బరెస్ట్ నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై సీఎం దిశానిర్దేశం
మూడు రోజులు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సెలవులు రద్దు
ముంపు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి: ఎక్స్‌లో సీఎం రేవంత్
ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్
డ్రైనేజ్ వ్యవస్థను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి: సీఎం రేవంత్
వర్షాలు, వరదల పరిస్థితిపై ఎఫ్ఎం రేడియోలలో అలర్ట్ చేయాలి: సీఎం రేవంత్
-
Aug 13, 2025 10:05 IST
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు ముగిసిన రిమాండ్
ఎంపీ మిథున్‌రెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలింపు
రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న మిథున్‌రెడ్డి
-
Aug 13, 2025 10:00 IST
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
200 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్
100 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ
-
Aug 13, 2025 09:05 IST
ఏపీ సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్
మ.12 గంటలకు విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు రివ్యూ
మ.2.30 గంటలకు టీడీపీ సెంట్రల్ ఆఫీస్‌కు సీఎం చంద్రబాబు
-
Aug 13, 2025 08:00 IST
విజయవాడ: కృష్ణానదికి వరద ప్రమాద ముందస్తు హెచ్చరిక
ప్రకాశం బ్యారేజీకి రెండు నుంచి ఐదు లక్షల క్యూసెక్కుల వరద
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచన
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు.. ఫోన్ నెంబర్- 91549 70454
-
Aug 13, 2025 08:00 IST
దేశంలో కుటుంబ వ్యాపారాల సంపద జాబితా
ఆదానీ కుటుంబ సంపద రూ.14.01 లక్షల కోట్లు
300 మంది కుటుంబ సంపద రూ.140 లక్షల కోట్లు
-
Aug 13, 2025 07:41 IST
హైదరాబాద్: బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం
విచారణకు హాజరుకానున్న నటులు ప్రకాష్‌రాజ్, రానా, విజయ్ దేవరకొండ
-
Aug 13, 2025 07:16 IST
ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
దౌసా-మనోహర్‌పూర్ రోడ్డులో ఢీకొన్న వ్యాను, కంటైనర్
ఈ ఘటనలో 10 మంది మృతి
మృతుల్లో ముగ్గురు మహిళలు, ఏడుగురు పిల్లలు.
-
Aug 13, 2025 06:52 IST
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో రెండు కేంద్రాల్లో రీపోలింగ్
3, 14 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలని ఎస్‌ఈసీ ఆదేశాలు
ఇవాళ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు రీపోలింగ్
3, 14 పోలింగ్ కేంద్రాల్లో వెయ్యి మంది ఓటర్లు
టీడీపీ తరపున మారెడ్డి లతారెడ్డి, వైసీపీ తరపున హేమంత్‌రెడ్డి పోటీ
రేపు పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు
-
Aug 13, 2025 06:35 IST
ప.గో: నేడు భీమవరం వెళ్లనున్న మాజీ సీఎం జగన్ రెడ్డి
భీమవరం వీఎస్‌ఎస్ గార్డెన్స్‌లో వివాహ వేడుకకు హాజరు
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు కుమార్తె...
వివాహా వేడుకకు హాజరుకానున్న జగన్ రెడ్డి
-
Aug 13, 2025 06:15 IST
తెలంగాణలో పలు జిల్లాల్లో నేడు, రేపు పాఠశాలలకు సెలవు
GHMC పరిధిలో నేడు, రేపు ఒంటి పూట బడి
హనుమకొండ, జనగాం, మహబూబాబాద్, వరంగల్,..
యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్ష సూచన
ఈ జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించిన విద్యాశాఖ
-
Aug 13, 2025 06:14 IST
నేడు ఏపీ కేబినెట్ సబ్‌కమిటీ భేటీ
జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పులపై చర్చ
జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పుపై భారీగా వినతులు
వినతులపై జీవోఎం ఏర్పాటు చేసిన ప్రభుత్వం
-
Aug 13, 2025 06:14 IST
అమరావతి: నేడు టీడీపీ సెంట్రల్ ఆఫీస్‌కు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్
టీడీపీ ఆఫీస్ దగ్గర బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించనున్న చంద్రబాబు, లోకేష్
ఇవాళ సాయంత్రం వరకు నాయకులకు అందుబాటులో చంద్రబాబు, లోకేష్
-
Aug 13, 2025 06:13 IST
హైదరాబాద్: ఇవాళ ఫిల్మ్ ఛాంబర్‌కు వెళ్లనున్న ఫిల్మ్ ఫెడరేషన్
ఫిల్మ్‌ఛాంబర్‌లో చర్చలకు రావాలని ఫిల్మ్ ఫెడరేషన్‌కు లేఖ
నూతన వేతనాలు, పని పరిస్థితులపై చర్చించనున్న ఇరుపక్షాలు
-
Aug 13, 2025 06:11 IST
తెలంగాణలో నేడు ఐదు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్
పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు
ములుగు, భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు: వాతావరణశాఖ
సిద్దిపేట, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు
9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ