Share News

BREAKING: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హత్యకు కుట్ర

ABN , First Publish Date - Aug 29 , 2025 | 06:25 AM

LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

BREAKING: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హత్యకు కుట్ర

Live News & Update

  • Aug 29, 2025 16:45 IST

    విజయవాడ: లిక్కర్‌ కేసు నిందితులకు ఏసీబీ కోర్టు నోటీసులు

    ఆస్తులను అటాచ్‌ చేస్తూ సిట్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై అభ్యంతరాలు ఉంటే చెప్పాలని కోర్టు నోటీసులు

    రాజ్ కసిరెడ్డి, చాణక్య, శ్రీనివాస్, పైలా దిలీప్, వరుణ్‌, చెవిరెడ్డితో పాటు ఎంపీ డిస్టిలరీస్‌, SNJ షుగర్స్‌ సంస్థలకు ఏసీబీ కోర్టు నోటీసులు

    అభ్యంతరాలు ఉంటే తెలపాలని SBI, ICICI బ్యాంకులు, విజయవాడ ట్రెజరీ అధికారికి కోర్టు నోటీసులు

    సిట్ పిటిషన్‌పై అభ్యంతరం లేదన్న వరుణ్ పురుషోత్తం, SNJ షుగర్స్‌, ఎంపీ డిస్టిలరీస్‌ ప్రతినిధులు

  • Aug 29, 2025 16:43 IST

    నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హత్యకు కుట్ర

    • కోటంరెడ్డిని చంపితే డబ్బే డబ్బు అంటూ వీడియో వైరల్

    • కోటంరెడ్డి హత్యకు ఐదుగురు రౌడీషీటర్లు మాస్టర్ ప్లాన్

    • కుట్ర వెనుక రౌడీషీటర్లు శ్రీకాంత్, జగదీష్ ఉన్నట్టు అనుమానం

    • హత్యపై రౌడీషీటర్లు చర్చించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్

  • Aug 29, 2025 16:43 IST

    • ఏసీబీ కోర్టులో లిక్కర్ కేసు నిందితుడు దిలీప్ పిటిషన్

    • తన అమ్మను పోలీసులు బెదిరిస్తున్నారని పిటిషన్‌ దాఖలు

    • లిక్కర్ స్కామ్ డబ్బులతో తన ఇంటిని నిర్మించినట్టు..

    • ఒప్పుకోవాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని దిలీప్ పిటిషన్

    • కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసులకు ఏసీబీ కోర్టు ఆదేశాలు

    • తదుపరి విచారణ వచ్చే నెల 3కు వాయిదా

  • Aug 29, 2025 15:57 IST

    విశాఖ: డబుల్‌డెక్కర్‌ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు

    • డబుల్‌ డెక్కర్‌ బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు

    • ఆర్కే బీచ్ నుంచి తోట్లకొండ వరకు తిరగనున్న పర్యాటక బస్సులు

    • రూ.500టికెట్ ఛార్జీలో సగం మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది: చంద్రబాబు

    • ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా బీచ్‌లను మారుస్తాం: చంద్రబాబు

    • రోడ్లపై గుంతలు పెట్టిన పాలకులు వాటిలోనే కొట్టుకుపోయారు: చంద్రబాబు

    • విశాఖలో త్వరలోనే డేటా సెంటర్, సీ కేబుల్ ఏర్పాటు చేస్తాం: చంద్రబాబు

    • దేశానికి టెక్నాలజీ హబ్‌గా విశాఖ ఎదుగుతుంది: సీఎం చంద్రబాబు

    • మహిళలకు సురక్షితమైన నగరంగా విశాఖ మారింది: చంద్రబాబు

  • Aug 29, 2025 15:57 IST

    పిటిషన్ కొట్టివేత..

    • విజయవాడ: సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో నిందితుడి పిటిషన్ కొట్టివేత

    • కొమ్మాకోట్లు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన ఎస్సీ, ఎస్టీ కోర్టు

    • సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఏ2గా ఉన్న కొమ్మాకోట్లు

  • Aug 29, 2025 15:47 IST

    థాయ్‌లాండ్ ప్రధాని పదవి నుంచి షినవత్రా తొలగింపు

    • థాయ్‌లాండ్ ప్రధాని, కేబినెట్‌ను తొలగించిన రాజ్యాంగ ధర్మాసనం

    • కంబోడియాతో ఘర్షణలో బాధ్యతారహితంగా వ్యవహరించారని ఆరోపణ

    • జూన్ నుంచి ప్రధాని బాధ్యతలకు దూరంగా ఉన్న షినవత్రా

    • కంబోడియా మాజీ ప్రధానితో ఫోన్‌ కాల్ లీక్తో గతంలో కోర్టు చర్యలు

  • Aug 29, 2025 14:00 IST

    ఢిల్లీ: రామసేతుపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

    • రామసేతును "జాతీయ స్మారకం"గా ప్రకటించాలని పిల్‌

    • సుప్రీంకోర్టులో పిల్‌ దాఖలు చేసిన సుబ్రహ్మణ్యం స్వామి

    • 4 వారాల్లో అభిప్రాయం తెలపాలని కేంద్రానికి కోర్టు నోటీసులు

  • Aug 29, 2025 13:26 IST

    ఢిల్లీ: తాడిపత్రికి వెళ్లేందుకు పెద్దారెడ్డికి సుప్రీంకోర్టు అనుమతి

    • ఏపీ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు కొనసాగుతాయని ఆదేశాలు

    • ఏపీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు

  • Aug 29, 2025 12:49 IST

    ఢిల్లీ: సుప్రీంకోర్టులో శ్రీలక్ష్మికి ఊరట

    • OMC కేసులో డిశ్చార్జ్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ...

    • తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చిన సుప్రీం కోర్టు

  • Aug 29, 2025 12:04 IST

    ఢిల్లీ: బిజినెస్‌, ప్రీమియం క్లాస్‌ విమాన టికెట్లపై పెరగనున్న GST

    • ఈ-టికెట్లపై 12% ఉన్న ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ 18% పెంచాలని కేంద్రం యోచన

  • Aug 29, 2025 12:04 IST

    అమరావతి: సీఎం చంద్రబాబుకు సీపీఐ రామకృష్ణ లేఖ

    • ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రాయితీ బకాయిలు విడుదల చేయాలని వినతి

  • Aug 29, 2025 12:03 IST

    హైదరాబాద్: డ్రగ్స్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

    • హైదరాబాద్‌కు అక్రమంగా కొరియర్ల ద్వారా డ్రగ్స్ సరఫరా

    • 10 కొరియర్ సంస్థల నుంచి రెండేళ్లలో రూ.100 కోట్లు డ్రగ్స్ తరలింపు

    • ప్రముఖ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు...

    • మారుతీ కొరియర్స్ ద్వారా ఓజీ గంజాయి తెప్పించుకున్నట్లు గుర్తింపు

    • పుష్ప తరహాలో పుస్తకాలు, గాజులు, మెడిసిన్ ముసుగులో డ్రగ్స్ సరఫరా

    • కొరియర్ సంస్థలపై కూడా కేసులు నమోదు చేసిన పోలీసులు

  • Aug 29, 2025 12:03 IST

    అనంతపురం: బుక్కరాయసముద్రంలో టీడీపీ కార్యకర్తల ఆందోళన

    • ఇటీవల రెండువర్గాలుగా విడిపోయి ఫిల్డ్‌ అసిస్టెంట్లు పరస్పర దాడులు

    • ఐదుగురు ఫీల్డ్‌ అసిస్టెంట్లను పదవి నుంచి తొలగించిన అధికారులు

    • ఫీల్డ్ అసిస్టెంట్లకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన

    • సేవ్ టీడీపీ సీఎం సార్ అంటూ రోడ్డెక్కిన తెలుగు తమ్ముళ్లు

    • ఎంపీ లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే శ్రావణికి వ్యతిరేకంగా నినాదాలు

  • Aug 29, 2025 12:02 IST

    విశాఖ: రుషికొండ ప్యాలెస్‌ను పరిశీలించిన పవన్‌ కల్యాణ్‌

    • జగన్‌ నివాసం ఉండడానికే రుషికొండ ప్యాలెస్‌ కట్టారు: పవన్‌

    • మొత్తం 7 బ్లాక్‌లకు గాను 4 బ్లాక్‌లు నిర్మించారు: పవన్‌ కల్యాణ్‌

    • 4 బ్లాక్‌ల నిర్మాణాలకు రూ.454 కోట్లు ఖర్చు చేశారు: పవన్‌

    • ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది: పవన్‌ కల్యాణ్‌

    • ప్యాలెస్‌ను టూరిజం కోసం ఎలాచేయాలన్నదే ఆలోచన: పవన్‌

    • గతంలో రిసార్ట్స్‌ ఉన్నప్పుడు ఏడాదికి రూ.7 కోట్ల ఆదాయం వచ్చేది

    • ఇప్పుడు ఏటా రూ.15 లక్షల కరెంట్‌ బిల్లు కట్టాల్సిన పరిస్థితి: పవన్‌

    • గతంలో ప్యాలెస్‌ పరిశీలనకు మమ్మల్ని రానివ్వలేదు: పవన్‌ కల్యాణ్‌

  • Aug 29, 2025 11:00 IST

    భారత్‌పై సుంకాల నేపథ్యంలో అమెరికా ఆర్థిక శాస్త్రవేత్త కీలక వ్యాఖ్యలు

    • భారత్‌పై 50% సుంకాలు ఏనుగుతో ఎలుకు ఢీకొంటున్నట్లేనని వ్యాఖ్య

    • న్యూఢిల్లీకి వ్యతిరేకంగా అమెరికా కఠినంగా వ్యవహరిస్తోంది: అమెరికా ఆర్థిక శాస్త్రవేత్త రిచర్డ్ వోల్ఫ్‌

  • Aug 29, 2025 10:56 IST

    హైదరాబాద్: జంట జలాశయాల గేట్లు ఎత్తివేతతో మూసీ ఉధృతి

    • ఉస్మాన్‌సాగర్‌ 8 గేట్లు, హిమాయత్‌సాగర్‌ 3 గేట్లు ఎత్తివేత

    • మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన GHMC

  • Aug 29, 2025 10:55 IST

    ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్‌తో కేటీఆర్, హరీష్‌రావు భేటీ

    • అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

  • Aug 29, 2025 10:52 IST

    బిహార్‌: 3 లక్షల మంది ఓటర్లకు ఈసీ నోటీసులు

    • బిహార్‌ జాబితాలో బంగ్లాదేశ్‌, ఆఫ్ఘాన్‌, నేపాల్‌ ఓటర్లు

    • ఓటరు ధ్రువపత్రాల్లో అవకతవకలు గుర్తించిన అధికారులు

  • Aug 29, 2025 10:38 IST

    BCCI ప్రెసిడెంట్‌గా వైదొలిగిన రోజర్‌ బిన్నీ

    • తాత్కాలిక బాధ్యతలు స్వీకరించనున్న రాజీవ్‌ శుక్లా

    • ప్రస్తుతం వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న రాజీవ్ శుక్లా

  • Aug 29, 2025 10:00 IST

    తమిళనాడు: సుప్రీంకోర్టుకు నటుడు విజయ్‌ టీవీకే పార్టీ

    • పరువు హత్యలపై ప్రత్యేక చట్టం తీసుకురావాలని పిటిషన్‌

    • తమిళనాడులో దళిత సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ హత్య నేపథ్యంలో పిటిషన్‌

  • Aug 29, 2025 09:57 IST

    పోలాండ్‌: ఎయిర్‌షో రిహార్సల్స్‌లో అపశృతి

    • కూలిన F-16 యుద్ధ విమానం, ఆర్మీ పైలట్‌ మృతి

    • పోలాండ్‌లోని రాడోమ్‌లో రిహార్సల్స్‌లో కూలిన ఫైటర్‌జెట్‌

  • Aug 29, 2025 09:57 IST

    అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ సంచలన వ్యాఖ్యలు

    • అవసరమైతే అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తా: జేడీ వాన్స్‌

    • అమెరికాలో విషాదం జరిగితే అధ్యక్ష బాధ్యతల స్వీకరణకు సిద్ధం: వాన్స్‌

    • ట్రంప్‌ ఆరోగ్యంపై ఊహాగానాల నేపథ్యంలో వాన్స్‌ వ్యాఖ్యలకు ప్రాధాన్యం

  • Aug 29, 2025 09:29 IST

    విజయవాడ: IPS సంజయ్‌ కస్టడీ పిటిషన్‌పై నేడు ACB కోర్టు విచారణ

    సంజయ్‌ను 7 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ పిటిషన్‌

  • Aug 29, 2025 09:29 IST

    హైదరాబాద్‌: సృష్టి ఫెర్టిలిటీ కేసులో 7 కేసులు నమోదు

    • సృష్టి ఫెర్టిలిటీ అక్రమాలపై కొనసాగుతున్న సోదాలు

  • Aug 29, 2025 09:01 IST

    విశాఖ: శాంతిపురం దగ్గర ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం

    • షార్ట్‌సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు, ఆర్పుతున్న స్థానికులు

  • Aug 29, 2025 07:45 IST

    నేడు మరోసారి పోలవరానికి విదేశీ నిపుణుల బృందం

    • పోలవరంలో 3 రోజులపాటు పర్యటించనున్న నిపుణులు

  • Aug 29, 2025 07:44 IST

    నేడు విశాఖలో మంత్రి నారా లోకేష్‌ పర్యటన

    • ICAI జాతీయ సదస్సులో పాల్గొననున్న మంత్రి లోకేష్‌

    • చంద్రపాలెం జడ్పీ హైస్కూల్‌లో AI ల్యాబ్‌ ప్రారంభించనున్న లోకేష్

    • రాడిసన్ బ్లూ రిసార్ట్‌లో వర్చువల్‌గా AI ల్యాబ్స్‌ ప్రారంభించనున్న లోకేష్‌

    • ఏరోస్పేస్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌పై CII సదస్సుకు హాజరుకానున్న లోకేష్‌

    • అనంతరం AU కన్వెన్షన్‌ హాల్‌లో స్పోర్ట్స్‌ మీట్‌లో పాల్గొననున్న లోకేష్‌

  • Aug 29, 2025 07:11 IST

    పట్నా: బిహార్‌లోకి చొరబడిన పాకిస్తాన్‌ ఉగ్రవాదులు, ఎన్నికల ముందు రాష్ట్రంలో భద్రత కట్టుదిట్టం

  • Aug 29, 2025 07:11 IST

    విశాఖలో రెండోరోజు జనసేన సమావేశాలు

    • నేడు జనసేన క్రియాశీల నాయకులతో పవన్‌ సమావేశం

    • పార్లమెం06:46 29-08-2025

    • ట్‌ నియోజకవర్గాలవారీగా సమీక్షించనున్న పవన్‌

    • ఒక్కో నియోజకవర్గం నుంచి 10 మంది నేతలు హాజరు

    • రేపు జనసేన విస్తృతస్థాయి సమావేశం

  • Aug 29, 2025 07:11 IST

    నేడు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన

    • ఇండియా ఫుడ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ సమ్మిట్‌..

    • గ్రీఫిన్‌ ఫౌండర్‌ నెట్‌వర్క్స్‌ మీటింగ్‌కు సీఎం చంద్రబాబు హాజరు

  • Aug 29, 2025 07:09 IST

    ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు

    • తెలంగాణలో 20 సెం.మీ. వరకు వర్షం కురిసే అవకాశం

    • అన్ని పోర్టుల్లో మూడో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ

    • మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక

  • Aug 29, 2025 06:35 IST

    నేడు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన

    • ఇండియా ఫుడ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ సమ్మిట్‌..

    • గ్రీఫిన్‌ ఫౌండర్‌ నెట్‌వర్క్స్‌ మీటింగ్‌కు సీఎం చంద్రబాబు హాజరు

  • Aug 29, 2025 06:35 IST

    ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు

    • తెలంగాణలో 20 సెం.మీ. వరకు వర్షం కురిసే అవకాశం

    • అన్ని పోర్టుల్లో మూడో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ

    • మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక

  • Aug 29, 2025 06:34 IST

    సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నేడు ప్రమాణం

    • ప్రమాణం చేయనున్న జస్టిస్‌ ఆలోక్‌ ఆరాధే, జస్టిస్‌ విపుల్‌ మనుభాయ్‌ పంచోలీ

  • Aug 29, 2025 06:34 IST

    కామారెడ్డిలో నేడు, రేపు కూడా విద్యాసంస్థలకు సెలవు

    • నేడు మెదక్‌ జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు

    • భారీ వర్షాలతో సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్‌

  • Aug 29, 2025 06:34 IST

    ACB కోర్టులో ధనుంజయ్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌

    • ధనుంజయ్‌రెడ్డి పిటిషన్‌పై నేడు విచారణ

    • లిక్కర్‌ కేసులో అరెస్టయిన ధనుంజయ్‌ రెడ్డి

  • Aug 29, 2025 06:25 IST

    నేడు తెలంగాణ బీజేఎల్పీ సమావేశం

    • ఉ.9 గంటలకు రాంచందర్‌రావు ఆధ్వర్యంలో BJLP భేటీ

    • అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చ

    • ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్న రాంచందర్‌రావు