-
-
Home » Mukhyaamshalu » ap telangana and todays latest news across globe 25th october 2025 vreddy
-
BREAKING: కాకినాడకు వెళ్లే యోచనలో పవన్‌కల్యాణ్
ABN , First Publish Date - Oct 25 , 2025 | 06:23 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Oct 25, 2025 21:30 IST
అమరావతి: మొంథా తుఫాన్ దృష్ట్యా కాకినాడకు వెళ్లే యోచనలో పవన్‌కల్యాణ్
ప్రస్తుత పరిస్థితుల్లో వెళ్లవద్దని డిప్యూటీ సీఎం పవన్‌ను వారించిన అధికారులు
టెలీ, వీడియో కాన్ఫరెన్స్‌లతో అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ దిశానిర్దేశం
తుఫాన్ హెచ్చరికల దృష్ట్యా కాకినాడ కలెక్టర్‌కు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు
మొంథా తుఫాన్ పట్ల అధికారులు అలర్ట్‌గా ఉండాలి: పవన్ కల్యాణ్
కాకినాడ పరిసరాల్లో తుఫాన్ తీరం తాకే అవకాశం: పవన్ కల్యాణ్
ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ అలర్ట్ చేయాలి: పవన్ కల్యాణ్
ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వాలి: పవన్
-
Oct 25, 2025 19:29 IST
అసోం కోక్రాజార్‌లో ఎన్‌కౌంటర్
పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు
కాల్పుల్లో మావోయిస్టు రోహిత్ ముర్ము మృతి
కోక్రాజార్ రైల్వేట్రాక్ పేలుడు కేసులో నిందితుడు రోహిత్ ముర్ము
ఘటనాస్థలంలో ఆయుధాలు స్వాధీనం
-
Oct 25, 2025 15:50 IST
సిడ్నీ వన్డేలో భారత్ ఘన విజయం
9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై భారత్ గెలుపు
చివరి వన్డేలో సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ
3 వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో ఆస్ట్రేలియా కైవసం
స్కోర్లు: ఆస్ట్రేలియా 236 ఆలౌట్ (46.4), భారత్ 237/1
భారత్ బ్యాటింగ్: రోహిత్ శర్మ 121, విరాట్ కోహ్లీ 74 పరుగులు
ఆస్ట్రేలియా బ్యాటింగ్: రెన్‌షా 56, మార్ష్ 41 రన్స్
భారత్ బౌలింగ్: హర్షిత్ రానా 4, సుందర్ 2 వికెట్లు
భారత్ బౌలింగ్: సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్‌దీప్, అక్సర్ పటేల్ తలా వికెట్
-
Oct 25, 2025 13:12 IST
తెలంగాణ మద్యం టెండర్లపై హైకోర్టులో ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్
టెండర్ల గడువు పొడిగింపును సవాల్ చేసిన ఐదుగురు వ్యాపారులు
ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ వాదనలు
ఏ నిబంధనల ప్రకారం గడువు పొడిగించారని ప్రశ్నించిన హైకోర్టు
లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తామన్న ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్
సోమవారం యథావిధిగా డ్రా తీయొచ్చు కానీ..
కోర్టు తీర్పునకు లోబడి ఉండాలని తెలంగాణ హైకోర్టు ఆదేశం
-
Oct 25, 2025 13:11 IST
ఢిల్లీ: కాసేపట్లో కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ
పాల్గొననున్న డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ మహేష్‌గౌడ్
డీసీసీ అధ్యక్షుల ఎంపికపై చర్చించనున్న నేతలు
-
Oct 25, 2025 13:11 IST
హైదరాబాద్ వ్యాప్తంగా 6 బృందాలతో ఆర్టీఏ స్పెషల్ డ్రైవ్
54 బస్సులపై కేసులు నమోదు, 8 బస్సులు సీజ్
నిబంధనలు పాటించని బస్సులకు రూ.97వేలు జరిమానా
-
Oct 25, 2025 13:11 IST
గన్‌పార్క్ దగ్గర అమరుల స్థూపానికి నివాళులర్పించిన కవిత
ఉద్యమకారుల కోసం పోరాడలేకపోయా: కల్వకుంట్ల కవిత
అమరవీరుల కుటుంబాలకు అనుకున్నంత న్యాయం చేయలేకపోయాం
నేను మంత్రిగా లేకపోయినా ఎంపీగా..
అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగాలని అడిగా: కవిత
ఉద్యమకారులకు న్యాయం జరిగేవరకు పోరాడనందుకు..
బహిరంగ క్షమాపణలు చెబుతున్నా: కవిత
అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.కోటి ఇవ్వాలి: కవిత
-
Oct 25, 2025 11:34 IST
వాయుగుండంగా మారనున్న అల్పపీడనం
ఈ నెల 27 నాటికి తుఫాన్‌గా మారే అవకాశం
నేడు కోనసీమ, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు
ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు
-
Oct 25, 2025 11:23 IST
తెలంగాణ మద్యం టెండర్లపై హైకోర్టులో విచారణ
టెండర్ల గడువు పొడిగించడాన్ని సవాల్ చేసిన ఐదుగురు వ్యాపారులు
-
Oct 25, 2025 10:58 IST
మహారాష్ట్ర మంత్రి చంద్రశేఖర్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఫోన్లు, వాట్సాప్‌పై నిఘా ఉందన్న మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి
తాను బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి అన్నానని మాట మార్చిన మంత్రి చంద్రశేఖర్
-
Oct 25, 2025 10:50 IST
యూపీ మంత్రి బేబీ రాణి మౌర్యకు తప్పిన ముప్పు
మంత్రి ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టిన ట్రక్కు
-
Oct 25, 2025 10:49 IST
బెంగళూరు: శబరిమలలో బంగారం వివాదం
బళ్లారిలో కేరళ పోలీసుల దర్యాప్తు
శబరిమల బంగారాన్ని బళ్లారి వ్యాపారికి విక్రయించానన్న ప్రధాన నిందితుడు
నిందితుడితో బళ్లారికి వెళ్లి కేరళ పోలీసుల దర్యాప్తు
-
Oct 25, 2025 10:48 IST
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు డైరెక్టర్‌గా షాన్ మసూద్ నియామకం
ఇప్పటివరకు పాక్ టెస్ట్ కెప్టెన్‌గా వ్యవహరించిన షాన్ మసూద్
-
Oct 25, 2025 10:48 IST
త్వరలో UAE–ఏపీ మధ్య సరికొత్త వాణిజ్య బంధం: చంద్రబాబు
ఆశావహంగా ముగిసిన సీఎం చంద్రబాబు UAE పర్యటన
రాష్ట్రంలో అవకాశాలు పరిశీలించాలని UAE మంత్రులకు ఆహ్వానం
పర్యటన చివరి రోజూ పలు సంస్థల ప్రతినిధులతో వరుస సమావేశాలు
-
Oct 25, 2025 10:48 IST
ఛత్తీస్‌గఢ్: బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం
ఇన్‌ఫార్మర్ నెపంతో ఇద్దరు గ్రామస్తులను హత్యచేసిన మావోయిస్టులు
మృతులు బాసగూడా పీఎస్ పరిధి నేలకాంకేర్ వాసులు తిరుపతి, రవి
-
Oct 25, 2025 09:54 IST
మేడ్చల్: మూసాపేట పరిధి గూడ్స్ షెడ్ రోడ్డులో అగ్నిప్రమాదం
ఇండియన్ కంటైనర్స్ కార్పొరేషన్ డిపోలో చెలరేగిన మంటలు
కెమికల్ విభాగంలో ఎగిసిపడుతున్న మంటలను ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది
-
Oct 25, 2025 09:53 IST
కర్నూలు బస్సు ప్రమాదంలో కీలకంగా మారిన DNA పరీక్షలు
మృతదేహాలను గుర్తించేందుకు 16 మందితో ఫోరెన్సిక్ టీమ్
మృతదేహాల నుంచి శాంపిల్స్ సేకరించిన ఫోరెన్సిక్ బృందం
రిపోర్ట్స్ వచ్చాక మృతదేహాలను అప్పగించనున్న అధికారులు
-
Oct 25, 2025 09:53 IST
తెలంగాణలో హామ్ రోడ్ల కోసం నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలో రూ.11,540 కోట్లతో హామ్ రోడ్ల నిర్మాణం
32 ప్యాకేజీల్లో 400 రోడ్లు నిర్మించనున్న R&B
2026లో ప్రారంభం కానున్న హామ్ రోడ్ల పనులు
-
Oct 25, 2025 08:42 IST
తెలంగాణలో మున్సిపాలిటీలకు భారీగా నిధులు విడుదల
రూ.2,780 కోట్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
138 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 2,432 పనులకు ఆమోదం
వెంటనే టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని సీఎం రేవంత్ ఆదేశం
-
Oct 25, 2025 08:42 IST
రంగారెడ్డి: బద్వేల్ దగ్గర ఆర్టీఏ అధికారుల తనిఖీలు
కర్నూలు బస్సు ప్రమాదంతో ప్రైవేట్ బస్సుల్లో సోదాలు
పలు బస్సుల్లో కనీస భద్రత ఏర్పాట్లు లేవని గుర్తించిన ఆర్టీఏ
6 బస్సులపై కేసులు నమోదు చేసిన బండ్లగూడ ఆర్టీఏ
-
Oct 25, 2025 08:42 IST
కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో వెలుగులోకి కీలక విషయాలు
ఫేక్ సర్టిఫికెట్‌తో డ్రైవింగ్ లైసెన్స్ పొందిన డ్రైవర్ లక్ష్మయ్య
6వ తరగతి చదివి టెన్త్ ఫెయిల్ అయినట్టు ఫేక్ సర్టిఫికెట్‌తో లైసెన్స్
గతంలో లారీతో చెట్టుకు ఢీకొట్టి క్లీనర్ మృతికి కారణమైన లక్ష్మయ్య
ప్రస్తుతం పోలీసుల అదుపులో డ్రైవర్ లక్ష్మయ్య
-
Oct 25, 2025 06:25 IST
హైదరాబాద్: ప్రైవేట్ బస్సులపై చర్యలకు సిద్ధమైన అధికారులు
నేటి నుంచి హైదరాబాద్‌లో రవాణాశాఖ అధికారుల తనిఖీలు
6 ప్రత్యేక టీమ్‌లతో తనిఖీలు చేపట్టనున్న అధికారులు
-
Oct 25, 2025 06:24 IST
అమెరికా: టెన్నెస్సీలో భారీ పేలుడు, 16 మంది మృతి
ఓ కార్మాగారంలో భారీ పేలుడుతో ఘటన
ఘటనాస్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు
-
Oct 25, 2025 06:24 IST
బస్సు ప్రమాద ఘటనలో మృతదేహాల గుర్తింపుకు కీలకం కానున్న డీఎన్‌ఏ
డీఎన్‌ఏ పూర్తికి ఫోరెన్సిక్ డైరెక్టర్ పాలరాజు నేతృత్వంలో బృందం
డీఎన్‌ఏ పరీక్షల నివేదికలను 48 గంటలకుపైగా సమయం పట్టే అవకాశం
19 మృతదేహాల నుంచి సాఫ్ట్ టిష్యూ, ఎముక మూలుగ సహా ఇతర నమూనాలు సేకరణ
-
Oct 25, 2025 06:24 IST
కర్నూలు బస్సు ప్రమాదంలో కీలక విషయాలు గుర్తించిన ఫోరెన్సిక్ బృందాలు
బస్సు లగేజీ క్యాబిన్‌లో 400కు పైగా మొబైల్ ఫోన్ల పార్సిల్ ఉన్నట్లు గుర్తింపు
ఫోన్లు పేలడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగి ప్రాణనష్టం జరిగినట్లు గుర్తింపు
బస్సులో మంటలు చెలరేగడంతో పేలిన ఫోన్లలోని బ్యాటరీలు
బ్యాటరీలు పేలడంతో బస్సుకు భారీగా వ్యాపించిన మంటలు
ప్రయాణికులు తప్పించుకునేందుకు వీలు లేకపోవడంతో భారీగా ప్రాణనష్టం
-
Oct 25, 2025 06:24 IST
వెండి పథకాల్లో పెట్టుబడులు పెట్టొచ్చు.. ఆంక్షలు తొలగించిన ఫండ్ సంస్థలు
-
Oct 25, 2025 06:23 IST
హైదరాబాద్: నేటి నుంచి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం
ఉపఎన్నికను సీరియస్‌గా తీసుకోవాలని పార్టీ నేతలకు సీఎం రేవంత్ సూచన
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ప్రచారం చేయనున్న సీఎం రేవంత్
ఒక్కో డివిజన్‌కు ఇద్దరు మంత్రుల చొప్పున 13 మందికి ప్రచార బాధ్యతలు
-
Oct 25, 2025 06:23 IST
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి
ఢిల్లీలో నేడు తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం
DCC అధ్యక్షుల నియామకంపై కీలక చర్చ
ఇవాళ మ.3 గంటలకు AICC ఆఫీస్‌లో TPCC నేతల భేటీ
ఈ నెలాఖరుకు DCC అధ్యక్షులను ప్రకటించనున్న AICC