-
-
Home » Mukhyaamshalu » Andhra pradesh Telangana latest national International breaking news and live updates on 11th December 2025 VREDDY
-
BREAKING: రేపు రెండోవిడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల పోలింగ్
ABN , First Publish Date - Dec 13 , 2025 | 08:39 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Dec 13, 2025 10:08 IST
తెలుగు రాష్ట్రాల్లో పడిపోయిన ఉష్ణోగ్రతలు
ఏపీలోని ఏజెన్సీల్లో దట్టంగా పొగమంచు
మరో 3 రోజులపాటు చలి తీవ్రత
పటాన్‌చెరులో 5.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత
ఆదిలాబాద్, మెదక్‌లో 7 డిగ్రీలు
రాజేంద్రనగర్‌లో 7.5 డిగ్రీల ఉష్ణోగ్రత
హనుమకొండలో 8.5, రామగుండంలో 10 డిగ్రీలు
-
Dec 13, 2025 09:49 IST
ఆకాంక్షిత జిల్లాల జాబితాలో దేశంలోనే అగ్రస్థానం కడప
వినూత్న పథకాలు, ఇతర కార్యక్రమాల అమల్లో జాతీయస్థాయిలో..
అగ్రస్థానం సాధించిన కలెక్టర్ చెరుకూరి శ్రీధర్
ఢిల్లీలో కడప కలెక్టర్ శ్రీధర్‌ను అవార్డుతో అభినందించిన నీతిఅయోగ్
కడప జిల్లా అభివృద్ధికి మరో7.50 కోట్లు మంజూరుకు నీతిఅయోగ్ ఆమోదం
-
Dec 13, 2025 08:43 IST
నేడు భారత పర్యటనకు అర్జెంటీనా సాకర్ స్టార్ మెస్సీ
GOAT టూర్‌లో భాగంగా 3 రోజులు భారత్‌లో మెస్సీ టూర్
14 ఏళ్ల తర్వాత భారత్‌లో పర్యటిస్తున్న మెస్సీ
హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, ఢిల్లీలో మెస్సీ పర్యటన
ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులను కలవనున్న మెస్సీ
-
Dec 13, 2025 08:42 IST
ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కిట్ల సరఫరాకు నిధులు మంజూరు
రూ.830.04 కోట్ల నిధులు విడుదలకు ప్రభుత్వం అనుమతి
1 నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు కిట్లు పంపిణీ
సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పేరిట రాష్ట్ర ప్రభుత్వం కిట్లు పంపిణీ
2026-27 విద్యాసంవత్సరంలో విద్యార్థులకు కిట్లు పంపిణీ చేసేందుకు నిధులు విడుదల
నోట్ బుక్ లు, బెల్డ్ ,షూలు, బ్యాగ్ , పిక్టోరియల్ డిక్షనరీ ,ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ ఇవ్వనున్న ప్రభుత్వం
పాఠ్య పుస్తకాలు , వర్క్ బుక్ లు, 3 జతల యూనిఫాం క్లాత్ లతో కూడిన కిట్లు పంపిణీ చేయనున్న ప్రభుత్వం
కిట్ల సేకరణ పంపిణీ కోసం రూ.157.20 కోట్లు నిధులు ఇవ్వనున్న కేంద్ర ప్రభుత్వం
టెండర్ల ప్రక్రియ ద్వారా కిట్ల సరఫరా , పంపిణీ దారులను నిర్ణయించాలని ఆదేశాలు
ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్
-
Dec 13, 2025 08:40 IST
2027 గోదావరి పుష్కరాల తేదీలను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు గోదావరి పుష్కరాలు
12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు కొనసాగనున్నట్లు తెలిపిన ప్రభుత్వం
తిరుమల తిరుపతి దేవస్థానాల ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ గారి అభిప్రాయం మేరకు తేదీలు ప్రకటన
విజయవాడలోని ఎండోమెంట్స్ కమిషనర్ నుంచి అందిన ప్రతిపాదనలను ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం
ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసిన దేవాదాయ శాఖ ప్రభుత్వ ఎక్స్ అఫీషియో కార్యదర్శి ఎం. హరి జవహర్ లాల్
-
Dec 13, 2025 08:40 IST
రేపు రెండోవిడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల పోలింగ్
నేడు పోలింగ్ కేంద్రాలకు సామగ్రి తరలింపు
రెండో విడతలో 3,911 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు
రెండో విడతలో 415 సర్పంచ్ స్థానాలు, 8,304 వార్డులు ఏకగ్రీవం
-
Dec 13, 2025 08:39 IST
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి
రేపు ఓట్ చోరీపై మహాధర్నాలో పాల్గొననున్న రేవంత్‌రెడ్డి
-
Dec 13, 2025 08:39 IST
నేడు హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ
మెస్సీ, రేవంత్ ఫుట్‌బాల్ మ్యాచ్ వీక్షించనున్న రాహుల్