-
-
Home » Mukhyaamshalu » abn andhrajyothy Telangana Andhra pradesh and national latest breaking news and live updates on 3rd December 2025 kjr
-
ప్రధాని మోదీతో.. సీఎం రేవంత్ రెడ్డి భేటీ
ABN , First Publish Date - Dec 03 , 2025 | 06:28 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Dec 03, 2025 21:22 IST
అమరావతి: సీఎం చంద్రబాబుతో గౌతమ్ అదానీ డిన్నర్ భేటీ
అదానీతో ఏపీలోని వివిధ ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు చర్చ
పోర్టులు, డేటా సెంటర్, సిమెంట్ ఫ్యాక్టరీ అంశాలపై చర్చ
-
Dec 03, 2025 20:30 IST
సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌లో ర్యాగింగ్ కలకలం
MBBS ఫస్టియర్ విద్యార్థిని ర్యాగింగ్ చేసిన సీనియర్లు
ర్యాగింగ్‌పై సీనియర్లను విద్యార్థి సోదరుడు నిలదీయడంతో..
శాంతినగర్‌లోని బాధిత విద్యార్థి ఇంటిపై మెడికోల దాడి
ఇద్దరు మెడికోలను పోలీసులకు అప్పగించిన స్థానికులు
-
Dec 03, 2025 20:13 IST
గుంటూరు: రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు
రేపు విచారణకు రావాలని IPS పీవీ సునీల్‌కుమార్‌కు ఇప్పటికే నోటీసులు
రేపు విచారణకు రాలేనని ఎస్పీ దామోదర్‌కు సునీల్‌కుమార్ సమాచారం
RRR కస్టోడియల్ టార్చర్ కేసులో A1గా IPS పీవీ సునీల్‌కుమార్
-
Dec 03, 2025 20:12 IST
GHMCలో 27 మున్సిపాలిటీల విలీన ప్రక్రియ వేగవంతం
రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరిలోని మున్సిపాలిటీల..
విలీనంపై GHMC కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాలు జారీ
27 మున్సిపాలిటీల్లోని రికార్డులు స్వాధీనం చేసుకోవాలని..
డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లకు ఆర్వీ కర్ణన్ ఆదేశాలు
డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్ల..
బాధ్యతల జాబితా విడుదల చేస్తూ ఆర్వీ కర్ణన్ ఉత్తర్వులు
-
Dec 03, 2025 18:11 IST
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ హుస్నాబాద్ నుంచే..
బహుజనులు దండు కట్టి ఉద్యమించారు: సీఎం రేవంత్
తెలంగాణ ఉద్యమం ఇక్కడి నుంచే ఉవ్వెత్తున ఎగసిపడింది
2004లో కరీంనగర్ గడ్డ నుంచే సోనియా మాట ఇచ్చారు: రేవంత్
2014లో స్వరాష్ట్ర ఆకాంక్షను సోనియా నెరవేర్చారు: రేవంత్‌రెడ్డి
ఇప్పటికే 60 వేల ఉద్యోగాలు ఇచ్చాం.. త్వరలో మరో 40 వేల ఉద్యోగాలు ఇస్తాం
రెండున్నరేళ్ల పాలన పూర్తయ్యేలోగా లక్ష ఉద్యోగాలు పూర్తి చేస్తాం: రేవంత్
-
Dec 03, 2025 18:11 IST
సౌతాఫ్రికా పర్యటన కోసం టీ20 జట్టును ప్రకటించిన BCCI
భారత జట్టు: సూర్యకుమార్(కెప్టెన్),శుభ్‌మన్ గిల్( వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్థిక్ పాండ్యా, శివమ్‌దూబే, జితేశ్ శర్మ, సంజూ శాంసన్
భారత జట్టు: అక్షర్ పటేల్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్
-
Dec 03, 2025 18:10 IST
సిద్దిపేట: హుస్నాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి
రూ.262 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కాసేపట్లో ప్రజాపాలన విజయోత్సవ సభ
-
Dec 03, 2025 17:19 IST
రాయ్‌పూర్ వన్డే: సౌతాఫ్రికా టార్గెట్ 359 పరుగులు
భారత్ స్కోర్: 358/5
భారత్ బ్యాటింగ్: రుతురాజ్ గైక్వాడ్ 105, కోహ్లీ 102
-
Dec 03, 2025 17:19 IST
ఛత్తీస్‌గఢ్: బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్
ఏడుగురు మావోయిస్టులు మృతి
ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి
-
Dec 03, 2025 17:05 IST
ఐ బొమ్మ రవి కేసులో ట్విస్ట్
కస్టడీ పూర్తయ్యాక ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్
మరో 4 కేసుల్లో కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్
ఒక్కో కేసులో 7 రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్
కౌంటర్ దాఖలు చేయాలని ఐబొమ్మ రవి న్యాయవాదికి కోర్టు ఆదేశం
ఇప్పటివరకు ఒక్క కేసులోనే రెండుసార్లు కస్టడీకి తీసుకున్న పోలీసులు
-
Dec 03, 2025 16:28 IST
బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం
క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారనున్న తీవ్ర అల్పపీడనం
అల్పపీడన ప్రభావంతో కోస్తాకు మోస్తరు వర్ష సూచన
దక్షిణ కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం
రాయలసీమలో మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్ష సూచన
-
Dec 03, 2025 16:23 IST
రాయ్‌పూర్ వన్డేలో రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ
77 బంతుల్లో సెంచరీ చేసిన రుతురాజ్ గైక్వాడ్
వన్డేల్లో తొలి సెంచరీ నమోదు చేసిన గైక్వాడ్
రాయ్‌పూర్ వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ
వన్డేల్లో 53వ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ
-
Dec 03, 2025 15:54 IST
సంచార్ సాథీ యాప్‌పై కేంద్రం కీలక నిర్ణయం
ఫోన్లలో సంచార్ సాథీ యాప్ తప్పనిసరి నిబంధన రద్దు
-
Dec 03, 2025 15:43 IST
నా వ్యాఖ్యలపై అనవసర వివాదం చేస్తున్నారు: సీఎం రేవంత్
పార్టీలో భిన్న మనస్తత్వాలుంటాయని చెప్పాలనుకున్నా
డీసీసీ అధ్యక్షులు వయసులో చిన్నవారైనా..
పెద్ద బాధ్యతలో ఉన్నారని చెప్పే ప్రయత్నం చేశా..
రెండు టర్మ్‌లు నేనే సీఎం: రేవంత్ రెడ్డి
-
Dec 03, 2025 14:36 IST
ఛత్తీస్‌గఢ్: బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్
నలుగురు మావోయిస్టులు మృతి
బస్తర్‌లో కొనసాగుతున్న భద్రతా బలగాల కూంబింగ్
-
Dec 03, 2025 12:26 IST
ప్రధాని మోదీతో.. సీఎం రేవంత్ రెడ్డి భేటీ
ఢిల్లీ: ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ ..
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రధాని మోదీకి ఆహ్వానం..
తెలంగాణకు పూర్తి సహకారం అందిస్తామని రేవంత్‌కు ప్రధాని హామీ..
మన్మోహన్ పీఎంగా ఉన్నపుడు గుజరాత్ మోడల్‌కి సహకరించారన్న మోదీ..
అదేవిధంగా పీఎంగా తెలంగాణకు సహకరించాలని మోదీని కోరిన రేవంత్ రెడ్డి ..
తెలంగాణకు సహకరిస్తే అభివృద్ధిలోకి తెలంగాణ మోడల్ తెస్తానన్న రేవంత్ రెడ్డి.
-
Dec 03, 2025 12:21 IST
ప్రైవేట్ స్కూల్ వద్ద ఉద్రికత్త
పశ్చిమగోదావరి: నరసాపురం జై సికిలి స్కూల్ వద్ద ఉద్రిక్తత
భవాని మాల ధరించి స్కూలుకు వచ్చిన నాలుగో తరగతి విద్యార్థిని.. తరగతిలోకి అనుమతించని స్కూల్ యాజమాన్యం..
స్కూల్ యాజమాన్యం తీరును నిరసిస్తూ విద్యార్థులు తల్లిదండ్రులతో రెండు గంటలుగా భవానీల ఆందోళన..
స్పందించని స్కూల్ యాజమాన్యం.. పోలీసులు భవానీలకు మధ్య వాగ్వాదం..
స్కూల్లోకి దూసుకెళ్లిన భవానీలు.. యాజమాన్యం క్షమాపణ చెప్పాలని డిమాండ్.
-
Dec 03, 2025 11:51 IST
కేంద్ర మంత్రితో ఎంపీ శ్రీభరత్ భేటీ
ఢిల్లీ: కేంద్రమంత్రి కుమారస్వామితో ఎంపీ శ్రీభరత్ భేటీ
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ చర్యలపై చర్చ
స్టీల్ ప్లాంట్‌కు పూర్తిస్థాయి చైర్మన్, డైరెక్టర్లు నియమించాలి
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను SAIL పరిధిలోకి తీసుకురావాలి
-
Dec 03, 2025 11:49 IST
స్క్రబ్ టైఫస్ కలకలం..
పల్నాడు జిల్లాలో స్క్రబ్ టైఫస్ కలకలం..
స్క్రబ్ టైఫస్‌తో ఇద్దరు మృతి, మరొకరికి చికిత్స..
స్క్రబ్ టైఫస్ లక్షణాలతో రుద్రవరంలో జ్యోతి (20) మృతి..
స్క్రబ్ టైఫస్ లక్షణాలతో రాజుపాలెంకు చెందిన నాగమ్మ(62) మృతి.
-
Dec 03, 2025 11:32 IST
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
మందకొడిగా ప్రారంభమైన దేశీయ సూచీలు..
314 పాయింట్లు తగ్గి 84,824 దగ్గర ట్రేడవుతున్న సెన్సెక్స్..
117 పాయింట్ల నష్టంతో 25,914 వద్ద కొనసాగుతోన్న నిఫ్టీ.
-
Dec 03, 2025 11:27 IST
ఇండిగో ఫ్లైట్‌లలో సాంకేతిక లోపం.. ప్రయాణికుల పడిగాపులు..
హైదరాబాద్: నిన్న రాత్రి నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో గందరగోళం..
ఇండిగో ఫ్లైట్‌లలో సాంకేతిక లోపం..
ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ , కేరళ వెళ్లవలసిన ఫ్లైట్‌లలో సాంకేతిక లోపం..
నిన్న రాత్రి నుంచి దాదాపు 1000 మంది ప్రయాణికులు ఎయిర్ పోర్ట్‌లో నిరీక్షణ..
మరోవైపు శబరిమల వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్న 200మందికి పైగా స్వాములు..
ఫ్లైట్స్ రద్దు కావడంతో ఎయిర్‌పోర్ట్‌లోనే ఉన్న ప్రయాణికులు..
విమాన రాకపోకల ఆలస్యంపై సమాధానం చెప్పలేని స్థితిలో ఇండిగో ఉద్యోగులు..
ఇండిగో సిబ్బంది తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు ..
-
Dec 03, 2025 11:12 IST
కళాశాలలకు బాంబు బెదిరింపు
ఢిల్లీ: రాంజాస్, దేశబంధు కళాశాలలకు బాంబు బెదిరింపు..
ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు మెస్సేజ్..
బాంబ్ స్క్వాడ్, ఢిల్లీ పోలీసులు కళాశాలలో తనిఖీలు..
ఆధారాలు లభించకపోవడంతో ఫేక్ బాంబ్ బెదిరింపుగా గుర్తింపు.
-
Dec 03, 2025 10:19 IST
రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చిన బీజేపీ..
గాంధీభవన్ దగ్గర భారీగా మోహరించిన పోలీసులు..
నిన్న సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్లని ఉద్దేశించి మాట్లాడిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం..
రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకి పిలుపునిచ్చిన బీజేపీ.
-
Dec 03, 2025 09:47 IST
వీధి కుక్కల దాడి ఘటనపై స్పందించిన సీఎం
హయత్ నగర్: ప్రేమ్ చంద్ అనే దివ్యాంగ బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి..
ఢిల్లీలో ఉదయం పేపర్లలో ఈ ఘటన వార్త చూసి చలించిపోయిన సీఎం..
వెంటనే సీఎంఓ అధికారులతో మాట్లాడి.. బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని అదేశం..
బాలుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన సీఎం రేవంత రెడ్డి..
కమిషనర్ స్వయంగా బాలుడిని పరామర్శించటంతో పాటు, కుటుంబాన్ని కూడా కలవాలని.. ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని ఆదేశం..
వీధి కుక్కల కట్టడిపై అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని అదేశించిన సీఎం రేవంత్ రెడ్డి.
-
Dec 03, 2025 09:37 IST
ప్రధాని మోదీతో భేటీ కానున్న సీఎం రేవంత్ రెడ్డి..
ఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో ప్రధాని మోదీతో భేటీ కానున్న సీఎం రేవంత్ రెడ్డి..
8, 9 తేదీల్లో తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఆహ్వానించనున్న సీఎం రేవంత్ రెడ్డి.
-
Dec 03, 2025 09:17 IST
దివ్యాంగులకు ట్రై సైకిళ్లు అందజేత..
పల్నాడు జిల్లా: ముఖ్యమంత్రిగా 15 ఏళ్లు పాలన పూర్తి చేసుకున్న నారా చంద్రబాబు నాయుడు..
దివ్యాంగులకు ట్రై సైకిళ్ళు పంపిణీ చేసిన .. శివ శక్తి లీలా అంజన్ ఫౌండేషన్..
వినుకొండలో దివ్యాంగులకు ట్రై సైకిళ్ళు అందజేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జి.వి. ఆంజనేయులు..
పాల్గొన్న రాష్ట్ర గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ కోటేశ్వరరావు, జీడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ మక్కెన మల్లికార్జున రావు..
సీఎం చంద్రబాబు స్పూర్తి తోనే తాను రాజకీయాల్లోకి వచ్చాను..
15 ఏళ్ళు మచ్చలేని పాలన చేసిన చంద్రబాబు మాకు ఆదర్శం: ప్రభుత్వ చీఫ్ విప్ జి.వి. ఆంజనేయులు
-
Dec 03, 2025 08:06 IST
ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి
నేడు ప్రధాని మోదీతో భేటీ కానున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క..
తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌కు ఆహ్వానించనున్న సీఎం.
-
Dec 03, 2025 07:30 IST
హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,830
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,000
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,80,600
-
Dec 03, 2025 07:29 IST
465కు చేరిన మృతుల సంఖ్య
శ్రీలంకలో 465కు చేరిన తుఫాన్ మృతుల సంఖ్య..
'దిత్వా' తుఫాన్ దాటికి గల్లంతైన మరో 366 మంది..
'దిత్వా' తుఫాన్ వరదలతో శ్రీలంక అల్లకల్లోలం.
-
Dec 03, 2025 07:28 IST
కేంద్రంపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
కేంద్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
కేంద్రం నుంచి రావాల్సిన నిధులు విడుదల చేయకపోతే పోరాటం తప్పదు: రేవంత్
బీజేపీకి తెలంగాణ రుచి చూపిస్తామని హెచ్చరించిన రేవంత్‌రెడ్డి
-
Dec 03, 2025 06:55 IST
నేడు నల్లజర్లలో సీఎం చంద్రబాబు పర్యటన
తూ.గో.జిల్లా: నేడు నల్లజర్లలో సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటన..
ఉదయం ఉండవల్లి నివాసం నుండి హెలికాప్టర్లో నల్లజర్ల చేరుకో నున్న సీఎం..
ఉదయం 10.50 గంటలకు నల్లజర్ల రానున్న సీఎం..
రైతులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను వీక్షించనున్న సీఎం..
రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు..
రైతులతో ముఖాముఖి నిర్వహించనున్న సీఎం..
అనంతరం నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం కానున్న సీఎం చంద్రబాబు..
సాయంత్రం 4గంటలకు ఉండవల్లి బయలుదేరనున్న సీఎం..
సీఎం కార్యక్రమం ఏర్పాట్లు పూర్తిచేసిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, ఐ జి అశోక్ కుమార్, జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి.
-
Dec 03, 2025 06:34 IST
బీభత్సం సృష్టించిన టిప్పర్.. స్తంభించిన ట్రాఫిక్..
హైదరాబాద్: మలక్ పేట దిల్‌సుఖ్ నగర్ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం..
బ్రేక్ ఫెయిల్ అయి బీభత్సం సృష్టించిన టిప్పర్..
డివైడర్‌ని ఢీ అనంతరం అనంతరం బస్సుని ఢీ కొన్న టిప్పర్ ..
టిప్పర్ డ్రైవర్ సంఘటన స్థలం నుంచి పరారీ..
ప్రమాదంలో ఎవరికి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు..
సంఘటన స్థలానికి చేరుకున్న మలక్ పేట పోలీసులు...
మలక్ పేట నుండి దిల్‌సుఖ్ నగర్, ఇటు మలక్ పేట నుంచి చదర్ ఘాట్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్.