-
-
Home » Mukhyaamshalu » ABN andhrajyothy latest telugu news and breaking news on 09th August 2025 VREDDY
-
Breaking News: హైదరాబాద్-విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్
ABN , First Publish Date - Aug 09 , 2025 | 06:12 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
Aug 09, 2025 20:55 IST
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్‌లో వర్షం
తార్నాక, రామంతాపూర్, అబిడ్స్, చార్మినార్‌లో వర్షం
-
Aug 09, 2025 20:55 IST
ముంబై ఎయిర్‌పోర్ట్‌లో సాంకేతిక సమస్య
పలు విమానాల రాకపోకలకు అంతరాయం
ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల పడిగాపులు
-
Aug 09, 2025 20:17 IST
హైదరాబాద్: నిర్మాతలతో ఫిల్మ్ ఫెడరేషన్ నాయకుల చర్చలు విఫలం
నిర్మాతల షరతులను అంగీకరించం: ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్
ఫెడరేషన్‌ను విభజించేలా వేతనాల పెంపు నిర్ణయం: ఫిల్మ్ ఫెడరేషన్
13 సంఘాలకు రోజువారీ వేతనాలు పెంచాల్సిందే: ఫిల్మ్ ఫెడరేషన్
వేతనాల పెంపు నిర్ణయం 10 సంఘాలకే అన్నట్లుంది: ఫిల్మ్ ఫెడరేషన్
డాన్సర్స్, ఫైటర్స్, టెక్నీషియన్ సంఘాలకూ వేతనాలు పెంచాలి: ఫిల్మ్ ఫెడరేషన్
రేపు అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ దగ్గర నిరసన తెలుపుతాం: ఫిల్మ్ ఫెడరేషన్
ఫిల్మ్ ఛాంబర్ పిలిస్తే మరోసారి చర్చల్లో పాల్గొంటాం: ఫిల్మ్ ఫెడరేషన్
-
Aug 09, 2025 20:17 IST
సినీ పరిశ్రమ కార్మికులకు వేతల పెంపుపై క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు
సినీ కార్మికుల వేతనాలు పెంచేందుకు నిర్మాతల నిర్ణయం
మూడు విడతలుగా వేతనాలు పెంచేందుకు నిర్మాతల నిర్ణయం
తొలి విడత 15, రెండో విడత 5, మూడో విడత మరో 5% పెంపు
రోజుకి రూ.2 వేలలోపు వేతనం తీసుకునే కార్మికులకు తొలి ఏడాది 15%, రెండో ఏడాది, మూడో ఏడాది 5% చొప్పున పెంపు
రోజుకి రూ.1000 లోపు వేతనం తీసుకునే కార్మికులకు తొలి ఏడాది 20%, రెండో ఏడాది జీరో శాతం, మూడో ఏడాది 5% పెంపు
షరతులకు అంగీకరిస్తేనే వేతనాల పెంపు: నిర్మాతలు
-
Aug 09, 2025 20:17 IST
భారీగా ట్రాఫిక్ జామ్..
యాదాద్రి: పంతంగి టోల్‌ప్లాజా దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్
వేలాది వాహనాలతో కిక్కిరిసిన టోల్‌ప్లాజా పరిసర ప్రాంతాలు
వీకెండ్, రాఖీ పౌర్ణమితో సొంతూళ్లకు నగరవాసుల పయనం
-
Aug 09, 2025 17:54 IST
హైదరాబాద్: నేను సమాఖ్య నుంచి ఎవరినీ కలవలేదు: చిరంజీవి
ఫిలిం ఫెడరేషన్ సభ్యులు నన్ను కలిశారన్న వార్తలు అవాస్తవం: చిరంజీవి
30% వేతన పెంపు హామీలు ఇచ్చానన్న వార్తలను ఖండిస్తున్నా: చిరంజీవి
గందరగోళం సృష్టించడానికి ఇటువంటి నిరాధారమైన ప్రచారాలు: చిరంజీవి
ఇది సినీ పరిశ్రమ సమస్య ఎవరూ ఏకపక్ష హామీలు ఇవ్వరు: చిరంజీవి
ఫిల్మ్‌ఛాంబర్.. తెలుగు సినీ పరిశ్రమకు అత్యున్నత సంస్థ: చిరంజీవి
ఫిల్మ్‌ఛాంబర్ మాత్రమే చర్చలు జరిపి పరిష్కారం తెస్తుంది: చిరంజీవి
అప్పటి వరకు ఇటువంటి అవాస్తవ ప్రచారాలు చేయొద్దు: చిరంజీవి
-
Aug 09, 2025 16:58 IST
హైదరాబాద్-విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్
వీకెండ్, రాఖీ పౌర్ణమితో సొంతూళ్లకు నగరవాసుల పయనం
ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్న పోలీసులు
ఉప్పల్-వరంగల్ హైవే పైనా భారీగా ట్రాఫిక్
హైవేపై నెమ్మదిగా కదులుతున్న వాహనాలు
-
Aug 09, 2025 16:58 IST
భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ నుంచి బయటకు వెళ్లే రోడ్లలో భారీగా ట్రాఫిక్ జామ్
వేలాది వాహనాలతో కిక్కిరిసిన హైదరాబాద్ శివారు ప్రాంతాలు
పలు రహదారుల్లో కిలోమీటర్ కదిలేందుకు గంటకుపైగా సమయం
-
Aug 09, 2025 16:58 IST
విశాఖ: వరాహలక్ష్మీనృసింహస్వా మి ఆభరణాల తనిఖీలు ప్రారంభం
ఆభరణాల తనిఖీలు ప్రారంభించిన ఫైవ్‌మెన్ కమిటీ సభ్యులు
గతేడాది దేవాదాయశాఖ కమిషనర్‌కు కడపవాసి ప్రభాకరాచారి ఫిర్యాదు
అప్పన్నకు భక్తులు సమర్పించిన స్వర్ణ, రజత ఆభరణాల...
తూనికల్లో తేడాలున్నాయని, కొన్ని మాయమయ్యాయని ఆరోపణలు
విచారణకు ఆదేశాలు జారీ చేసిన అప్పటి ఆర్జేసీ కె.సుబ్బారావు
అరసవల్లి దేవస్థానం ఈఓ ప్రసాద్ చైర్మన్‌గా ఫైవ్‌మెన్ కమిటీ నియామకం
-
Aug 09, 2025 13:37 IST
అల్లూరి: లగిశపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటన
చెప్పినట్టే సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశాం: చంద్రబాబు
సంపద సృష్టించి పేదలకు పంచాలనేదే నా లక్ష్యం: చంద్రబాబు
ఆర్థికంగా అభివృద్ధి చెందినవారు సమాజానికి తిరిగి ఇవ్వాలి
స్థానిక గిరిజనులకే ఉద్యోగాలు ఇచ్చేలా ఎన్టీఆర్ జీవో తెచ్చారు
జీవోను ఒకసారి వైసీపీ, ఒకసారి కాంగ్రెస్ నిలిపివేశాయి: చంద్రబాబు
గిరిజనులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది: చంద్రబాబు
-
Aug 09, 2025 13:21 IST
విశాఖ: ఫిషింగ్ హార్బర్ ప్రమాద బాధిత కుటుంబాలకు పరిహారం
రూ.10 లక్షల చొప్పున పరిహారం చెక్కులు అందజేసిన హోంమంత్రి
ఫిషింగ్ హార్బర్ ప్రమాద ఘటనలో ముగ్గురి మృతి బాధాకరం: అనిత
గాయాలపాలైన ముగ్గురికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం: అనిత
-
Aug 09, 2025 13:21 IST
విజయవాడ: పటమట పీఎస్‌కు వచ్చిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో...
ప్రత్యక్ష సాక్షి సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసిన కేసులో వంశీకి కండిషనల్ బెయిల్
విజయవాడ పటమట పోలీస్‌స్టేషన్‌లో సంతకం చేసేందుకు వచ్చిన వంశీ
-
Aug 09, 2025 13:11 IST
ఆపరేషన్ సిందూర్ వివరాలు వెల్లడించిన ఎయిర్‌చీఫ్ మార్షల్
పాక్‌కు చెందిన 5 యుద్ధ విమానాలు కూల్చాం: ఎయిర్‌చీఫ్ మార్షల్
రెండు వైమానిక స్థావరాలు ధ్వంసం చేశాం: ఎయిర్‌చీఫ్ మార్షల్
మే 9, 10 తేదీల్లో ఆపరేషన్ సిందూర్ నిర్వహించాం: ఎయిర్‌చీఫ్ మార్షల్
మే 9న రాత్రి ఎక్కువగా పాక్ ఉగ్ర శిబిరాలపై దాడులు చేశాం
డ్రోన్, S-400 గగనతల రక్షణ వ్యవస్థ బాగా పనిచేసింది: ఎయిర్‌చీఫ్ మార్షల్
ఆపరేషన్ సింధూర్‌తో పాక్‌కు స్పష్టమైన సందేశమిచ్చాం: ఎయిర్‌చీఫ్ మార్షల్
-
Aug 09, 2025 11:47 IST
కోర్టు ఆదేశాలకు అనుగుణంగానే స్థానిక ఎన్నికలు: పొన్నం
ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని ఎక్కడా పేర్కొనలేదు: పొన్నం
అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు బీజేపీ మద్దతు ఇచ్చింది
ఇప్పుడు కావాలనే రాద్ధాంతం చేస్తోంది: మంత్రి పొన్నం
-
Aug 09, 2025 11:43 IST
హైదరాబాద్: 6వ రోజు కొనసాగుతోన్న సినీ కార్మికుల సమ్మె
ఫిల్మ్ ఛాంబర్ ఆదేశాలతో ఇప్పటికే ఆగిన చిత్రీకరణలు
కాసేపట్లో ఫిల్మ్ ఛాంబర్‌లో నిర్మాతల సమావేవం
మధ్యాహ్నం ఫెడరేషన్ ఆఫీస్‌లో యూనియన్ నేతల భేటీ
నిర్మాతల ప్రతిపాదనలపై చర్చించనును్న యూనియన్ నేతలు
-
Aug 09, 2025 11:43 IST
కడప: పులివెందులలో వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారు: బీటెక్ రవి
సాక్షి రిపోర్టర్లు వాళ్లపై వాళ్లే దాడులు చేసుకుని మాపై నిందవేయాలని చూస్తున్నారు
జగన్ దగ్గర మెప్పు కోసమే అవినాష్ ఇలా చేయిస్తున్నారు: బీటెక్ రవి
-
Aug 09, 2025 11:37 IST
కాంగ్రెస్ చరిత్రను బీజేపీ తుడిచివేయాలని చూస్తోంది: మహేష్‌గౌడ్
రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ కుట్ర: టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్
ఎన్నికల కమిషన్ బీజేపీకి తొత్తుగా మారింది: మహేష్‌గౌడ్
ప్రశ్నిస్తే దేశ ద్రోహులుగా ముద్ర వేస్తున్నారు: మహేష్‌గౌడ్
క్విట్ బీజేపీ అంటేనే దేశానికి భవిష్యత్: మహేష్‌గౌడ్
-
Aug 09, 2025 10:52 IST
హైదరాబాద్‌లో మొదలైన వర్షం
చార్మినార్, సైదాబాద్, మలక్‌పేట్, ఎంజీబీఎస్, కోఠి,..
బహదూర్‌పురా, శాలిబండ, గౌలిగూడ, బండ్లగూడ,..
నాంపల్లి, అంబర్‌పేట్ సహా పలు ప్రాంతాల్లో వర్షం
-
Aug 09, 2025 10:36 IST
గిరిజనులకు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం శుభాకాంక్షలు: చంద్రబాబు
ఏజెన్సీ ప్రాంతాలను మైదాన ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చేస్తున్నాం
ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం
ఆదివాసీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది: చంద్రబాబు
-
Aug 09, 2025 10:35 IST
ఈనెల 22న నేషనల్ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ అథారిటీ భేటీ
CWC చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన జలసౌధలో సమావేశం
ఇచ్చంపల్లి రిజర్వాయర్ నుంచి గోదావరి-కావేరి అనుసంధానంపై చర్చ
-
Aug 09, 2025 10:19 IST
ధర్మస్థలపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు
ధర్మస్థల వంటి పుణ్యక్షేత్రంలో దారుణ ఘటనలు జరిగాయి
ట్రస్టు నిర్వాహకులే 500 మందిని చంపేశారు: సీపీఐ నారాయణ
హత్యలను గత బీజేపీ ప్రభుత్వం దాచి పెట్టింది: సీపీఐ నారాయణ
కాంగ్రెస్ అధికారంలోకి ఉండటంతోనే దారుణలు బయటకొచ్చాయి
సిట్ దర్యాప్తును వేగవంతం చేయాలి: సీపీఐ నారాయణ
ధర్మస్థలను న్యాయస్థానం స్వాధీనం చేసుకోవాలి: సీపీఐ నారాయణ
ట్రస్ట్ సభ్యులను వెంటనే అరెస్ట్ చేయాలి: సీపీఐ నారాయణ
-
Aug 09, 2025 10:11 IST
జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతోన్న ఆపరేషన్ అఖల్
కుల్గాంలో భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు
ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు వీరమరణం
కాల్పుల్లో మరో ఇద్దరు భద్రతా సిబ్బందికి గాయాలు
మృతులు ప్రిత్పాల్ సింగ్, హర్మిందర్‌సింగ్‌గా గుర్తింపు
మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన భారత ఆర్మీ
-
Aug 09, 2025 09:48 IST
అమెరికా-రష్యా అధ్యక్షుల భేటీ తేదీ ఖరారు
ఈనెల 15న అలస్కాలో ట్రంప్, పుతిన్ భేటీ
రష్యా, ఉక్రెయిన్ శాంతి ఒప్పందంపై దృష్టి సారిస్తాం: ట్రంప్
ఒప్పందంలో ఉక్రెయిన్ కొంత భూభాగాన్ని వదులుకోవాల్సి ఉంటుంది
ప్రపంచంలో శాంతి, స్థిరత్వాన్ని తీసుకురావడమే నా ఆకాంక్ష: ట్రంప్
-
Aug 09, 2025 08:53 IST
సృష్టి ఫెర్టిలిటీ కేసులో కీలకంగా వైసీపీ నేత సోదరుడు
విశాఖకు చెందిన డాక్టర్ రవికుమార్ సహా ముగ్గురు వైద్యులు అరెస్ట్
కేజీహెచ్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా ఉన్న డాక్టర్ రవికుమార్
వైసీపీ నేత వాసుపల్లి గణేష్ సోదరుడు డాక్టర్ రవికుమార్
వైసీపీ హయాంలో బదిలీ అయిన డాక్టర్ రవికుమార్
తిరిగి కొంతకాలానికే డిప్యుటేషన్‌పై కేజీహెచ్‌కు వచ్చిన రవికుమార్
రవికుమార్‌కు డాక్టర్ నమ్రత భారీగా డబ్బులు పంపినట్టు అనుమానం
1988లో ఒకేసారి MBBS పూర్తి చేసిన వైద్యులు నమ్రత, రవికుమార్
80శాతం శిశువులను ఏజెన్సీ ప్రాంతాల నుంచే తీసుకొచ్చినట్టు గుర్తింపు
ఏజెన్సీల్లో నిరుపేద గర్భిణీలను గుర్తించి శిశువులను విక్రయించేలా ఒప్పందం
ఏజెన్సీ ప్రాంతాల్లో శిశు విక్రయాలపై ఆరా తీస్తున్న పోలీసులు
-
Aug 09, 2025 08:23 IST
కడప: వైఎస్ వివేకా హత్యకేసు నిందితులకు నోటీసులు
బెదిరింపుల కేసులో భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డికి నోటీసులు
ఇటీవల టీడీపీలో చేరిన విశ్వనాథరెడ్డిని..
ఫోన్‌లో బెదిరించిన వైఎస్ భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి
ఇద్దరికి 41 నోటీసులు జారీ చేసిన పులివెందుల పోలీసులు
-
Aug 09, 2025 08:19 IST
శ్రీహరికోట: 'కలాం 1200' తొలి స్టాటిక్ టెస్ట్ విజయవంతం
విక్రమ్-1 వాహననౌక తొలిదశ మోటారుకు చెందిన స్టాటిక్ టెస్ట్
విక్రమ్-1కు సంబంధించిన వివిధ వ్యవస్థల్లో ఇదో మైలురాయి: ఇస్రో
-
Aug 09, 2025 08:15 IST
ఏపీలో కొలిక్కిరాని నామినేటెడ్ పదవుల భర్తీ
సిఫార్సుల కంటే IVRSకే ప్రాధన్యంపై నేతల అసంతృప్తి
టీడీపీ సంస్థాగత ఎన్నికల అలస్యంపైనా అసంతృప్తి
ప్రభుత్వ కార్యక్రమాల్లోనే సీఎం చంద్రబాబు, లోకేష్ బిజీ
ఈ నెలాఖరుకు నామినేటెడ్ పదవుల భర్తీకి సన్నాహాలు
ఏపీ టీడీపీ చీఫ్ పల్లాపైనే పార్టీ నేతల సమన్వయ భారం
-
Aug 09, 2025 06:49 IST
ఏపీలో కొలిక్కిరాని నామినేటెడ్ పదవుల భర్తీ
సిఫార్సుల కంటే IVRSకే ప్రాధన్యంపై నేతల అసంతృప్తి
టీడీపీ సంస్థాగత ఎన్నికల అలస్యంపైనా అసంతృప్తి
ప్రభుత్వ కార్యక్రమాల్లోనే సీఎం చంద్రబాబు, లోకేష్ బిజీ
ఈ నెలాఖరుకు నామినేటెడ్ పదవుల భర్తీకి సన్నాహాలు
ఏపీ టీడీపీ చీఫ్ పల్లాపైనే పార్టీ నేతల సమన్వయ భారం
-
Aug 09, 2025 06:36 IST
అమరావతి: సీఎం చంద్రబాబును కలిసిన గాయని వరలక్ష్మి
చంద్రబాబు సీఎం అయితే 108 ఆలయాల్లో..
సంకీర్తనా గానం చేస్తానని మొక్కుకున్న గాయని వరలక్ష్మి
ఏపీతో పాటు మహారాష్ట్ర, తెలంగాణలోని ప్రముఖ ఆలయాల్లో..
సంగీత కచేరీలతో మొక్కు చెల్లించుకున్న గాయని వరలక్ష్మి
గాయని వరలక్ష్మికి ధన్యవాదాలు తెలిపిన సీఎం చంద్రబాబు
-
Aug 09, 2025 06:20 IST
ఉపరాష్ట్రపతి ఎన్నికకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
ఈనెల 21 వరకు గడువు, 25న నామినేషన్ల పరిశీలన
-
Aug 09, 2025 06:15 IST
తెలంగాణ మహిళలకు సీఎం రేవంత్ రాఖీ పండుగ శుభాకాంక్షలు
మహిళా సాధికారత సహా కోటీశ్వరులను చేసే సంకల్పంతో..
ప్రజా ప్రభుత్వం కార్యక్రమాలు, పథకాల అమలు: సీఎం రేవంత్
రాష్ట్రాభివృద్ధిలో మహిళలందరూ భాగస్వాములయ్యే వరకు..
ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుంది: తెలంగాణ సీఎం రేవంత్
మహిళల రక్షణ, భద్రత, అభివృద్ధి, సంక్షేమంలో రాజీలేదు: రేవంత్