Share News

BREAKING: సమ్మక్క సాగర్‌ ప్రాజెక్ట్‌కు ఛత్తీస్‌గఢ్‌ గ్రీన్‌సిగ్నల్‌

ABN , First Publish Date - Sep 22 , 2025 | 06:40 AM

LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

BREAKING: సమ్మక్క సాగర్‌ ప్రాజెక్ట్‌కు ఛత్తీస్‌గఢ్‌ గ్రీన్‌సిగ్నల్‌

Live News & Update

  • Sep 22, 2025 18:50 IST

    ఛత్తీస్‌గఢ్‌: నారాయణపూర్ జిల్లాలో ఎన్‌కౌంటర్‌

    • ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టు సభ్యులు మృతి

    • మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి అలియాస్ రాజు మృతి

    • మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సత్యనారాయణరెడ్డి అలియాస్ కోసా మృతి

  • Sep 22, 2025 18:49 IST

    తెలంగాణ అసెంబ్లీలో బతుకమ్మ వేడుకలు

    • హాజరైన స్పీకర్ ప్రసాద్‌, మండలి చైర్మన్ గుత్తా, వైస్‌చైర్మన్ బండ ప్రకాష్

    • బతుకమ్మ ఆడిన అసెంబ్లీ ఉద్యోగులు

  • Sep 22, 2025 18:49 IST

    సమ్మక్క సాగర్‌ ప్రాజెక్ట్‌కు ఛత్తీస్‌గఢ్‌ గ్రీన్‌సిగ్నల్‌

    • NOCకి అంగీకరించిన ఛత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణుదేవ్‌

    • రాయ్‌పూర్‌లో సీఎం విష్ణుదేవ్‌ను కలిసిన మంత్రి ఉత్తమ్‌

    • నష్టపరిహారం భరించేందుకు తెలంగాణ అంగీకారం

    • 6.7 TMCల కెపాసిటీతో ములుగులో ప్రాజెక్ట్ నిర్మాణం

  • Sep 22, 2025 18:49 IST

    హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం

    • బంజారాహిల్స్‌లో 8.6 సెం.మీ., శ్రీనగర్‌ కాలనీలో 8.6 సెం.మీ.

    • ఖైరతాబాద్‌లో 7.5, మైత్రివనంలో 5.6, యూసఫ్‌గూడలో 5.4 సెం.మీ. వర్షపాతం

  • Sep 22, 2025 17:57 IST

    హైదరాబాద్‌ను మరోసారి ముంచెత్తిన వాన

    • రెండుగంటల నుంచి ఎడతెరిపిలేని వర్షం

    • చెరువులను తలపిస్తున్న హైదరాబాద్‌ రోడ్లు

    • పంజాగుట్ట-ఖైరతాబాద్‌ రూట్‌లో నిలిచిన వాహనాలు

    • లక్డీకాపూల్‌-అసెంబ్లీ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్

    • ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌ కింద భారీగా వర్షపునీరు

    • ఐకియా, రాయదుర్గం, బయోడైవర్సిటీ, ఖాజాగూడ మార్గంలో ట్రాఫిక్ జామ్‌

    • ఐటీ ఉద్యోగులు ఒకేసారి ఆఫీస్‌ల నుంచి బయటికి రావొద్దని పోలీసుల సూచన

    • భారీ వర్షంతో GHMC అలర్ట్

  • Sep 22, 2025 16:28 IST

    హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం

    • ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌లో వర్షం

    • జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌లో వర్షం

    • SR నగర్‌, అమీర్‌పేట్‌, ఎర్రగడ్డ, బోరబండలో వర్షం

    • యూసఫ్‌గూడ, సనత్‌నగర్‌, మూసాపేట్‌లో వర్షం

    • కూకట్‌పల్లి, కేబీహెచ్‌బీ, మియాపూర్‌లో వర్షం

  • Sep 22, 2025 15:48 IST

    2023లో తిరుపతి పరకామణిలో చోరీ: మంత్రి లోకేష్‌

    • మరుసటి రోజు చార్జ్‌షీట్‌ దాఖలు: మంత్రి లోకేష్‌

    • అంటే వెంటనే చార్జ్‌షీట్‌ రెడీ చేసుకున్నారు: మంత్రి లోకేష్‌

    • పరకామణి చోరీపై 41 CRPC నోటీస్ ఇచ్చారు: మంత్రి లోకేష్‌

    • ఆ తర్వాత లోక్ అదాలత్‌లో రాజీ కుదిర్చారు: మంత్రి లోకేష్‌

    • ఇపుడు దేవుడే ఆ కేసును బయటకు తీశారు: మంత్రి లోకేష్‌

    • పరకామణి చోరీపై త్వరలో విచారణకు ఆదేశిస్తాం: లోకేష్‌

    • పరకామణి చోరీ దొంగలను దేవుడు కూడా వదలలేదు: మంత్రి లోకేష్‌

    • తిరుమల ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడటం ఏంటి?: లోకేష్‌

    • అసలు నెయ్యిలో నెయ్యే లేదని తేల్చారు: మంత్రి లోకేష్‌

  • Sep 22, 2025 15:48 IST

    తల్లికి వందనంతో పాటు 3 నెలల్లో బకాయిలు చెల్లిస్తాం: మంత్రి లోకేష్‌

    • క్వాంటమ్‌ కంప్యూటర్‌ 2026 జనవరిలో వచ్చేస్తుంది: మంత్రి లోకేష్‌

    • కొత్త భవనం నిర్మాణం పూర్తయ్యేలోపు విట్‌లో క్వాంటమ్‌ కంప్యూటర్ సేవలు

    • అక్టోబర్‌ నుంచి వరుస పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేలా ప్రణాళికలు: లోకేష్‌

    • ప్రజా-ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రైవేట్‌ను భాగస్వామ్యం చేస్తే ప్రైవేటీకరణా?

    • సామాన్యుడికి మెరుగైన సేవలు త్వరగా అందించేందుకే..

    • పీపీపీ మోడ్‌లో మెడికల్ కాలేజీలు: మంత్రి లోకేష్‌

  • Sep 22, 2025 12:46 IST

    ప్రభుత్వం, సింగరేణి కలిసి గొప్ప నిర్ణయం తీసుకున్నాయి: భట్టి

    • సింగరేణి లాభాల్లో కొంత మొత్తం ఉద్యోగులకు కేటాయింపు

    • గత పదేళ్లు సింగరేణి సంస్థ కొత్త బ్లాక్‌లకు వేలంలో పాల్గొనలేదు

    • దీంతో రెండు బ్లాక్‌లు కోల్పోయింది: డిప్యూటీ సీఎం భట్టి

    • ఆ రెండు బ్లాక్‌లు ప్రభుత్వ నేతల సన్నిహితుల చేతికి వెళ్లాయి

    • సింగరేణి తెలంగాణ ప్రభుత్వానికి ఆత్మవంటిది: భట్టి

    • బొగ్గు గని మాత్రమే కాదు. అది ఒక ఉద్యోగ గని: భట్టి

    • సింగరేణిలో 71 వేల మంది ఉన్నారు: డిప్యూటీ సీఎం భట్టి

  • Sep 22, 2025 12:45 IST

    సింగరేణి కార్మికులకు బోనస్‌ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

    • సింగరేణి లాభాల్లో 34 శాతం వాటా కార్మికులకు బోనస్‌

    • ఒక్కో కార్మికుడికి రూ.1,95,610 బోనస్‌

    • కాంట్రాక్ట్‌ కార్మికులకు రూ.5,500 బోనస్‌

    • మొత్తం రూ.810 కోట్లు సింగరేణి కార్మికులకు పండగ బోనస్‌

  • Sep 22, 2025 12:44 IST

    గాజులరామారంలో కబ్జా చేసిన వారిలో రౌడీ షీటర్లు ఉన్నారు

    • ఫేక్‌ పట్టాలతో భూములు భారీగా కబ్జా చేశారు: కమిషనర్‌ రంగనాథ్‌

    • ఫేక్‌ డాక్యుమెంట్లతో భూముల అమ్మకం చేస్తున్నారు

    • కొన్నవారు, అమ్మినవారి పేర్లను బయటకు చెప్పాలి: రంగనాథ్‌

    • ఆ భూముల విలువ రూ.15 వేల కోట్లు: హైడ్రా కమిషనర్‌

    • ఇప్పటివరకు 30 శాతం కబ్జాలను మాత్రమే కూల్చాం

    • నిర్మాణంలో ఉన్న భవనాలనే కూల్చాం: రంగనాథ్‌

  • Sep 22, 2025 11:25 IST

    ధరలు తగ్గేవి: పాలు, నెయ్యి, పన్నీర్, జున్ను, బియ్యం, పప్పులు, సబ్బులు, షాంపూ, టూత్‌పేస్ట్, బ్రష్‌, ఫేస్ పౌడర్‌, హెయిర్‌ ఆయిల్‌, బట్టలు, చెప్పులు, షూ

    తగ్గనున్న కిచెన్‌ వేర్, డ్రై ఫ్రూట్స్, హ్యాండ్‌ బ్యాగులు, పౌచ్‌లు, పర్సులు, ఏసీ, టీవీ, ఫ్రిడ్జ్‌లు, కార్లు, 350సీసీ బైక్‌ ధరలు, కేక్‌లు, బిస్కెట్లు, కార్న్ ఫ్లెక్స్, బేకర్ల ఉత్పత్తులు

    తగ్గనున్న స్టీల్ గిన్నెల ధరలు, మసాలాలు, మసాలా పొడి, టీ , కాఫీ పౌడర్, సిమెంట్, జనపనార, వరి పొట్టు ధరలు, డయాగ్నస్టిక్ కిట్లు, ఫీడింగ్ బాటిళ్లు, సర్జికల్ చేతిగ్లౌజులు, విద్యుత్ వాహనాలు, అంబులెన్స్, బస్సులు, ట్రక్కులు, టైర్లు, ట్రాక్టర్ విడి భాగాలు

    జీఎస్టీ 2.Oతో ధరలు పెరిగేవి: పాన్ మసాలా, ఆల్కహాల్ లేని పానీయాలు, పండ్ల పానీయాలు, కెఫిన్ ఉన్న పానీయాలు, ముడి పొగాకు, పొగాకు ఉన్న ఉత్పత్తులు,

    బొగ్గు, బ్రికెట్లు, లిగ్నైట్, బైక్స్ (350cc పైన), లగ్జరీ కార్లు, ప్రైవేట్ జెట్‌లు, వ్యాపార విమానాలు, హెలికాప్టర్లు, షిప్స్

  • Sep 22, 2025 11:24 IST

    కాలినడకన వెళ్లి అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమ

  • Sep 22, 2025 11:11 IST

    సుప్రీంకోర్టులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు పిటిషన్‌పై విచారణ

    • కేసు విచారణ అక్టోబర్ 8కి వాయిదా వేసిన సుప్రీం ధర్మాసనం

    • ప్రభాకర్ రావు మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని కోరిన TG ప్రభుత్వం

  • Sep 22, 2025 10:41 IST

    విశాఖ మెట్రో టెండర్లకు వచ్చే నెల 10 వరకు గడువు

    • విజయవాడ మెట్రో టెండర్లకు వచ్చే నెల 14 వరకు గడువు

    • టెండర్లలో జాయింట్‌ వెంచర్స్‌కు అవకాశం ఇచ్చాం: మెట్రో ఎండీ రామకృష్ణారెడ్డి

    • మూడు కంపెనీలు కలిసి జేవీగా టెండర్లు వేసుకోవచ్చు: రామకృష్ణారెడ్డి

    • కాంట్రాక్ట్ సంస్థల వినతి మేరకు నిర్ణయం తీసుకున్నాం: రామకృష్ణారెడ్డి

    • రెండు ప్రాజెక్టులను తక్కువ సమయంలో పూర్తి చేసి..

    • నిర్మాణ వ్యయం తగ్గించాలనేదే మా ఉద్దేశం: మెట్రో ఎండీ రామకృష్ణారెడ్డి

  • Sep 22, 2025 10:24 IST

    తిరుపతి: ఎస్వీ యూనివర్సిటీ సమీపంలో మరోసారి చిరుత కలకలం

    • స్థానికులు కేకలు వేయడంతో అడవిలోకి వెళ్లిపోయిన చిరుత

    • అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక

  • Sep 22, 2025 10:22 IST

    విశాఖలో 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సు

    • రెండురోజుల పాటు ఈ-గవర్నెన్స్ జాతీయ సదస్సు

    • 'సివిల్ సర్వీస్ అండ్‌ డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌' థీమ్‌తో సదస్సు

    • సీఎం చంద్రబాబు, ఎంపీ భరత్‌, సీఎస్‌ విజయానంద్‌ హాజరు

    • ఈ గవర్నెన్స్ స్టాళ్లను సందర్శించిన ముఖ్యమంత్రి.

  • Sep 22, 2025 09:56 IST

    అమరావతి: మెడికల్ కాలేజీ అంశం మీద మరోసారి వైసీపీ నిరసన

    • అసెంబ్లీ బయట ఉన్న ఫైర్ స్టేషన్ నుంచి...

    • ఫ్లకార్టులతో నిరసన తెలుపుతూ అసెంబ్లీకి వైసీపీ మండలి సభ్యులు

    • మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళన

    • నల్ల కండువాలతో అసెంబ్లీకి బయల్దేరిన వైసీపీ ఎమ్మెల్సీలు

    • ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే విరమించాలని డిమాండ్‌

  • Sep 22, 2025 09:55 IST

    అమరావతి: నేడు ఏపీ అసెంబ్లీ 3వ రోజు సమావేశం

    • మెడికల్‌ కాలేజీల అంశంపై నేడు అసెంబ్లీలో చర్చ

    • మెడికల్‌ కాలేజీలపై సమాధానం ఇవ్వనున్న చంద్రబాబు

    • నేడు ఏపీ అసెంబ్లీలో వ్యవసాయంపై లఘు చర్చ

  • Sep 22, 2025 09:43 IST

    స్వల్ప నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

    • 150 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్‌

    • 60 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ

  • Sep 22, 2025 09:42 IST

    మొరాకో: కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కీలక వ్యాఖ్యలు

    • సిందూర్‌ పార్ట్‌ 2.. పాక్‌ తీరుపై ఆధారపడి ఉంటుంది

    • ఆపరేషన్‌ సిందూర్‌ ఇంకా ముగియలేదు..

    • కేవలం తాత్కాలికంగానే నిలిపివేశాం: రాజ్‌నాథ్

    • పాక్‌ ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తే..

    • ఆ దేశానికి తగిన విధంగా బదులిస్తాం: రాజ్‌నాథ్

  • Sep 22, 2025 08:36 IST

    నేడు ఛత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణుదేవ్‌తో మంత్రి ఉత్తమ్ కీలక సమావేశం

    • సా. 4 గంటలకు విష్ణుదేవ్ సాయిని కలవనున్న మంత్రి ఉత్తమ్

    • సమ్మక్క సాగర్‌కు NOC కోసం చర్చించనున్న మంత్రి ఉత్తమ్

  • Sep 22, 2025 08:14 IST

    వైసీపీలో సంచలనం.. సీన్‌లోకి భారతీ రెడ్డి ఎంట్రీ

    • వైసీపీ ముఖ్యనేతలతో భారతీ రెడ్డి మాటామంతీ

    • పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చ

    • పార్టీలో ఎవరెవరు ఏం చేస్తున్నారని ఆరా

    • జగన్‌కు నమ్మకస్తుడు, రిటైర్డ్‌ అధికారి ఫోన్‌ నుంచి మంతనాలు

    • మధ్య, దిగువ శ్రేణి నేతలకు ఓ స్థాయి నేతల ద్వారా సూచనలు

    • భారతీ రెడ్డి ఎంట్రీపై పార్టీలో కలకలం

  • Sep 22, 2025 08:13 IST

    ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

    • 9 రోజుల పాటు 16వాహనాలపై భక్తులకు శ్రీవారి దర్శనం

    • ఉత్సవాలకు రేపు రాత్రి అంకురార్పణ కార్యక్రమం

  • Sep 22, 2025 07:30 IST

    నేడు అరుణాచల్‌, త్రిపురలో ప్రధాని మోదీ పర్యటన

    • రూ.5 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన

  • Sep 22, 2025 07:30 IST

    నేడు సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటన

    • కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం రేవంత్, భట్టి

    • సింగరేణి కార్మికుల కోసం కీలక ప్రకటన చేసే అవకాశం

  • Sep 22, 2025 07:29 IST

    నేడు జాతీయ హైవే ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌ సమీక్ష

    • కేంద్ర రోడ్డు రవాణా, NHAI అధికారులతో సమావేశం

    • తెలంగాణలోని హైవే ప్రాజెక్టుల పురోగతిపై చర్చ

  • Sep 22, 2025 07:11 IST

    దేశవ్యాప్తంగా అమల్లోకి జీఎస్టీ 2.O

    • పలు నిత్యావసరాలపై 18% నుంచి 5శాతానికి GST తగ్గింపు

    • ఆరోగ్య బీమా,పలు స్టేషనరీ వస్తువులపై సున్నా జీఎస్టీ

    • ఔషధాలపై 12% నుంచి 5 శాతానికి GST తగ్గింపు

    • చిన్న కార్లు, బైక్‌లపై 28% నుంచి 18శాతానికి GST

    • ఏసీలు, టీవీలపై 28% నుంచి 18శాతానికి GST తగ్గింపు

  • Sep 22, 2025 06:44 IST

    నేటి నుంచి GST ఉత్సవ్‌ ప్రారంభం

    • నేటి నుంచి అమల్లోకి GST 2.O సంస్కరణలు

  • Sep 22, 2025 06:43 IST

    నేటి నుంచి విజయవాడలో దసరా ఉత్సవాలు

    • 5 ప్రదేశాల్లో 11 రోజులపాటు వివిధ కార్యక్రమాల నిర్వహణ

  • Sep 22, 2025 06:40 IST

    నేటినుంచి ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రులు

    • ఈ ఏడాది 11 అలంకారాల్లో దుర్గమ్మ దర్శనం