-
-
Home » Mukhyaamshalu » ABN Andhra Jyothy latest and breaking news across the globe on 12th september 2025 kjr
-
BREAKING: నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి
ABN , First Publish Date - Sep 12 , 2025 | 06:14 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Sep 12, 2025 21:36 IST
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి ప్రమాణస్వీకారం
ప్రమాణం చేయించిన అధ్యక్షుడు రాంచంద్ర పాడెల్
నేపాల్ తొలి మహిళా సీజేగా గతంలో పనిచేసిన సుశీల కర్కి
-
Sep 12, 2025 19:28 IST
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి
సుశీల కర్కి పేరు ప్రతిపాదించిన జెన్-Z నిరసనకారులు
కాసేపట్లో తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి ప్రమాణస్వీకారం
జెన్-Z, ఆర్మీ, అధ్యక్షుడి మధ్య కుదిరిన ఏకాభిప్రాయం
-
Sep 12, 2025 16:55 IST
రాహుల్‌గాంధీని ఉద్దేశించి ఎక్స్‌లో కేటీఆర్ పోస్ట్
ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిన ఫొటోలు షేర్ చేసిన కేటీఆర్
ఫొటోల్లోని కాంగ్రెస్ జెండాలను రాహుల్ గుర్తు పట్టగలరా?: కేటీఆర్
ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఢిల్లీలో రాహుల్‌ను కూడా కలిశారు: కేటీఆర్
-
Sep 12, 2025 16:54 IST
గ్రీన్ ఎనర్జీలో కూడా సింగరేణి సంస్థ భాగస్వామ్యం అవుతోంది: భట్టి
హైదరాబాద్: సింగరేణి సంస్థ కేవలం బొగ్గు గనులే కాకుండా ఇతర ఖనిజాల తవ్వకాల్లో పాల్గొనాలని బోర్డు నిర్ణయం: భట్టి
సింగరేణిలో బొగ్గు నిల్వలు తగ్గుతున్నాయి: భట్టి విక్రమార్క
సింగరేణికి అదనంగా రావాల్సిన బొగ్గు బ్లాకులు దక్కడం లేదు: భట్టి విక్రమార్క
సింగరేణి సంస్థ ఇబ్బందులు ఎదుర్కొంటోంది: డిప్యూటీ సీఎం భట్టి
బొగ్గు తవ్వకాలు పెంచడం, ఇతర మినరల్స్ మైనింగ్ చేయాలని నిర్ణయం
రాయచూర్, దేవదుర్గ ప్రాంతాల్లో రాగి, బంగారం ఖనిజాల అన్వేషణలో సింగరేణి పాల్గొన్నది: భట్టి విక్రమార్క
రాగి, బంగారం మైనింగ్‌ను ఏ సంస్థ చేసినా సింగరేణికి 37.75శాతం వాటా
గ్రీన్ ఎనర్జీలో కూడా సింగరేణి సంస్థ భాగస్వామ్యం అవుతోంది: భట్టి
కీలక ఖనిజాల తవ్వకాల కోసం సింగరేణి గ్లోబల్ అనే పేరుతో వెళ్తుంది: భట్టి
సింగరేణి గనుల్లో బొగ్గు తవ్వకాలు పెంచాలి: భట్టి విక్రమార్క
అంతర్జాతీయ మార్పులకు అనుగుణంగా సింగరేణి మారుతోంది
ఖనిజాలపైనా సింగరేణి దృష్టిసారించాలని నిర్ణయం: భట్టి విక్రమార్క
క్రిటికల్ మినరల్స్ వెలికితీత కోసం కమిటీ వేశాం: భట్టి
గ్రీన్ ఎనర్జీపైనా సింగరేణి దృష్టిపెట్టింది: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
-
Sep 12, 2025 16:54 IST
గ్రూప్-1 పోస్టులను రూ.కోట్లకు అమ్ముకుంటున్నారు: దాసోజు
కోర్టు తీర్పును బేఖాతరు చేస్తే విద్యార్థులను రెచ్చగొట్టినట్టే: దాసోజు
కేసీఆర్‌పై ఎగిరిపడే బండి సంజయ్ ఎందుకు మాట్లాడట్లేదు?: దాసోజు శ్రవణ్
ఐదేళ్లు ఇష్టారాజ్యమని కాంగ్రెస్ అనుకుంటోంది: దాసోజు శ్రవణ్
-
Sep 12, 2025 16:52 IST
హైదరాబాద్: కేటీఆర్‌కు మంత్రి జూపల్లి కౌంటర్
సిగ్గుందా అనే పదం కేటీఆర్‌కు ఇప్పుడు గుర్తొచ్చిందా?: జూపల్లి
కాంగ్రెస్ ఎమ్మెల్యేలను BRSలో చేర్చుకున్నప్పుడు ఏమైంది?: జూపల్లి
అమరుల ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ ఒక్కపనైనా చేశారా?
కవిత ఆరోపణలపై కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదు?: జూపల్లి
నా వ్యాఖ్యలను BRS నేతలు వక్రీకరిస్తున్నారు: మంత్రి జూపల్లి
హామీలు ఇవ్వకున్నా అనేక పనులు చేశానని చెప్పా: జూపల్లి
హామీలు అమలు చేశాను కాబట్టే.. ప్రజలు నన్ను గెలిపించారు: జూపల్లి
వాస్తవాలు మాట్లాడితే బూతులు మాట్లాడారని ప్రచారం చేస్తారా?: జూపల్లి
ఫిరాయింపులపై స్పందించిన మంత్రి జూపల్లి
ఎవరు ఏ పార్టీలో చేరలేదు: మంత్రి జూపల్లి
ఎవరైనా పార్టీ మారితే స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు: జూపల్లి
-
Sep 12, 2025 15:37 IST
రేపటి నుంచి ఈనెల 15 వరకు 5రాష్ట్రాల్లో ప్రధాని పర్యటన
మిజోరం, మణిపూర్, అసోం, బెంగాల్, బిహార్‌లో పర్యటన
రూ.71,850కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేయనున్న మోదీ
మణిపూర్ హింస తర్వాత తొలిసారి ఆ ప్రాంతానికి ప్రధాని మోదీ
మణిపూర్‌లోని చురచాంద్‌పూర్ బహిరంగసభలో పాల్గొననున్న ప్రధాని
అనంతరం ఇంఫాల్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ
-
Sep 12, 2025 15:37 IST
రేపు మణిపూర్ పర్యటనకు ప్రధాని మోదీ
మణిపూర్ హింస తర్వాత తొలిసారి వెళ్తున్న మోదీ
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న మోదీ
చురచాంద్‌పూర్ బహిరంగసభలో పాల్గొననున్న ప్రధాని
అనంతరం ఇంఫాల్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ
-
Sep 12, 2025 14:24 IST
తిరుమలలో చోరీ.. నిందితుడు అరెస్ట్..
తిరుమల: శ్రీవారి హుండిలో చోరికి యత్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది.
ఆలయంలోని స్టీల్ హుండీలో నాలుగు వేల రూపాయలను తస్కరించిన దొంగ.
సీసీ టీవీ ద్వారా దొంగతనాన్ని గుర్తించి నిందితుడిని పట్టుకున్న విజిలెన్స్ సిబ్బంది.
దొంగను తమిళనాడు రాష్ట్రం తిరువణ్వేలికీ చెందిన వేణుగా గుర్తించిన భద్రతా సిబ్బంది.
విజిలెన్స్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్న పోలీసులు.
-
Sep 12, 2025 14:09 IST
ఈనెల 15న జరగాల్సిన కాంగ్రెస్ కామారెడ్డి సభ వాయిదా
వర్షాల కారణంగా సభ వాయిదా వేస్తున్నట్లు TPCC ప్రకటన.
త్వరలోనే సభ నిర్వహణ తేదీ ప్రకటిస్తామన్న మహేష్‌గౌడ్.
-
Sep 12, 2025 13:59 IST
ఏపీ లిక్కర్ స్కాం కేసు నిందితుల రిమాండ్ పొడిగింపు
ఈనెల 18 వరకు రిమాండ్ పొడిగించిన ACB కోర్టు.
మిథున్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై ఈనెల 16న వాదనలు.
కాసేపట్లో రాజమండ్రి జైలుకు ఎంపీ మిథున్‌రెడ్డి తరలింపు.
విజయవాడ జైలుకు చెవిరెడ్డి సహా మిగిలిన నిందితులు.
-
Sep 12, 2025 13:35 IST
లిక్కర్ స్కామ్ కేసులో సంచలన పరిణామం..
విజయవాడ: లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం.
మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మొబైల్‌ను FSL కి పంపేందుకు ఏసీబీ కోర్టు అనుమతి.
నారాయణ స్వామి కాల్ డేటాతో పాటు, బ్యాంక్ లావాదేవీలపై ఫోకస్ పెట్టిన సిట్.
గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణ స్వామి.
ఇప్పటికే లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి నారాయణస్వామిని విచారించిన సిట్.
నారాయణ స్వామి మొబైల్‌లో కీలక ఆధారాలు లభిస్తాయని FSL రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్న సిట్.
-
Sep 12, 2025 12:35 IST
ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపు
మూడు బాంబులు పెట్టినట్లు బెదిరింపు మెయిల్.
మూడు ప్రదేశాల్లో RDX అమర్చినట్లు లేఖ.
బాంబు బెదిరింపుతో ఆగిన కోర్టు కార్యకలాపాలు.
ఢిల్లీ హైకోర్టులో పోలీసుల తనిఖీలు.
-
Sep 12, 2025 12:33 IST
నటి కంగనా రనౌత్‌కు షాక్..
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్‌కు సుప్రీంకోర్టులో నిరాశే ఎదురైంది.
రైతుల నిరసనపై వ్యంగంగా తను చేసిన ట్వీట్ పై దాఖలైన ఫిర్యాదును కొట్టివేయాలన్న కంగనా రనౌత్ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు.
కంగనా ట్వీట్‌తో అగ్నికి ఆజ్యం పోశారంటూ సుప్రీం ధర్మాసనం వ్యాఖ్య.
నల్లచట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసనలపై కంగనా గతంలో ట్వీట్ చేశారు
ఆమె ట్వీట్ పై పంజాబ్ లో కేసు నమోదు.
ఎఫ్‌ఐఆర్ ను రద్దు చేయాలన్న కంగనా రనౌత్ పిటీషన్‌ను కొట్టివేసిన హర్యానా హైకోర్టు.
హర్యానా హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేసిన కంగనా.
సుప్రీంలోనూ కంగనకు దక్కని ఊరట.
-
Sep 12, 2025 12:11 IST
లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
400 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్
100 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ
-
Sep 12, 2025 10:39 IST
స్మశానంలో గలీజ్ పనులు..
బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పిట కేసు నమోదు.
ధనియాల గుట్ట స్మశాన వాటికలో నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల తనిఖీలు.
గ్రేవీ యార్డ్ దగ్గర ఉన్న రూమ్‌లో అసభ్య కార్యకలాపాలు.
నిర్వాహకురాలు మాధవిని అరెస్టు చేసి బేగంపేట్ పోలీసులకు అప్పగించిన నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్.
గతంలో బోయినపల్లిలో మాధవి మీద కేసు నమోదు.
ఒక మహిళకు, విటుడికి నోటీసులు ఇచ్చిన బేగంపేట పోలీసులు.
-
Sep 12, 2025 07:40 IST
నేపాల్ నుంచి ఏపీ చేరుకున్న తెలుగు యాత్రికులు
ఏపీ ప్రభుత్వ చొరవతో ప్రత్యేక విమానం ఏర్పాటు.
తొలివిడత ఏపీ చేరుకున్న 144 మంది యాత్రికులు.
యాత్రికులను బస్సుల్లో స్వస్థలాలకు పంపిన అధికారులు.
-
Sep 12, 2025 07:14 IST
నిరుద్యోగ ట్రైనింగ్ సెంటర్‌లో మహిళలకు లైంగిక వేధింపులు
మహిళలతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్
బావలు.. సైయ్యా... మరదలు సైయ్యా అంటూ మహిళలతో స్టెప్పులు.
శిక్షణ ముగిసి సర్టిఫికెట్స్ తీసుకునే వరకు ఆయన వేధింపులు
వేధింపుల విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో చితకబాదిన వైనం