Himalayan Mountain Trip: రైలు Vs రోడ్.. హిమాలయ యాత్రకు బెస్ట్ ఆప్షన్ ఏది?
ABN , Publish Date - Aug 07 , 2025 | 11:53 AM
మీరు హిమాలయాలకు ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, రైలు మార్గం బెటరా? లేక రోడ్డు ప్రయాణమా? ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: హిమాలయాలు చాలా అందంగా ఉంటాయి. ఎత్తైన శిఖరాలు, లోతైన లోయలు, మంచుతో కప్పబడిన పర్వతాలు, స్వచ్ఛమైన నదులు, అడవులు కలిసి హిమాలయాలకు ఒక ప్రత్యేకమైన అందాన్ని చేకూరుస్తాయి. హిమాలయాల అందం కేవలం దృశ్యపరంగానే కాకుండా అక్కడి ప్రకృతి, సంస్కృతి, జీవవైవిధ్యం కూడా చాలా గొప్పవి. హిమాలయాలు అనేక రకాల మొక్కలు, జంతువులు, పక్షులకు నిలయం. ఇవి కేవలం పర్యాటకులను మాత్రమే కాకుండా ట్రెక్కింగ్ ఔత్సాహికులను, ప్రకృతి ప్రేమికులను, సాహసాలను ఇష్టపడేవారిని కూడా ఆకర్షిస్తాయి.

చాలా మందికి లైఫ్‌లో ఒక్కసారి అయినా హిమాలయాల సహాాజ అందాలను చూడాలనే కోరిక ఉంటుంది. అయితే, ఈ హిమాలయాలకు వెళ్లడానికి రైలు మార్గం బెటరా? లేక రోడ్డు ప్రయాణమా? ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
రైలు ప్రయాణం వల్ల కలిగే ప్రయోజనాలు:
ట్రైన్‌లో హిమాలయాలకు ప్రయాణించడం వల్ల ఎక్కువగా అలసట అనిపించదు. కల్కా-సిమ్లా టాయ్ ట్రైన్ లేదా డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే వంటి ప్రసిద్ధ మార్గాలు మలుపులు తిరుగుతున్న రోడ్లపై ప్రయాణించే శ్రమ లేకుండా చేస్తాయి.
రైలు ప్రయాణానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది.
ఈ పర్వత రైల్వేలలో చాలా వరకు ఒక శతాబ్దం నాటివి, చెక్క స్టేషన్లు ఉంటాయి. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే వంటి కొన్నింటిని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా కూడా నియమించారు. కాబట్టి, ట్రైన్‌లో ప్రయాణిస్తే వాటి అందాన్ని చూసి ఎంజాయ్ చేయవచ్చు.
రైలు ప్రయాణం హ్యాపీగా అనిపించినప్పటికీ, అది మిమ్మల్ని కొంత దూరం మాత్రమే తీసుకెళుతుంది. ఎత్తైన ప్రదేశాల పట్టణాలు, మారుమూల గ్రామాలు లేదా అసాధారణ బసలకు చేరుకోవడానికి, మీరు మళ్లీ టాక్సీ, షేరింగ్ జీప్ లేదా బస్సులో ప్రయాణించాల్సి ఉంటుంది.

రోడ్డు మార్గంలో ప్రయాణించడం వల్ల కలిగే ప్రయోజనాలు
హిమాలయాలకు రోడ్డు ప్రయాణం అనేది కేవలం ఒక ప్రయాణం కాదు, అది ఒక మంచి అనుభూతి. మార్గంలో వచ్చే అందాలు, అనూహ్య మలుపులు, స్నేహితులతో జ్ఞాపకాలు.. ఇవన్నీ కలసి రోడ్ ట్రిప్‌ను ప్రత్యేకంగా మార్చతాయి.
అందమైన ప్రదేశం కనిపిస్తే, అక్కడ ఫొటో తీసుకోవడానికి ఆగిపోవచ్చు. ఏదైనా ఊరిలో బస చేయవచ్చు. మ్యాప్‌లో చూపించని మార్గాల్లో ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఇది అనేక ఆశ్చర్యాలను అందిస్తుంది. మారుమూల పర్వత ప్రాంతాలకు చేరుకోవడం.. కేవలం రోడ్డు ద్వారా సాధ్యం.
హిమాలయాల్లో ఉన్న కొన్ని అద్భుతమైన ప్రదేశాలు స్పితి లోయ (Spiti Valley), తవాంగ్ (Tawang), ఇతర సుదూర పర్వత ప్రాంతాలు ఇవి ట్రైన్ లేదా ప్లైన్ ద్వారా నేరుగా చూడలేము.
ఇక్కడికి వెళ్లాలంటే కచ్చితంగా రోడ్డు మార్గం అవసరం. అంటే బైక్ డ్రైవ్ చేయడం లేదా కారు, బస్సు ప్రయాణం వంటివి చేయవచ్చు.
కారు ప్రయాణాలు స్నేహితులతో కలిసినప్పుడు చాలా మధురంగా ఉంటాయి. కారు లోపల పాటలు పాడడం, జోకులు చెప్పడం, మీకు నచ్చినట్లు హ్యాపీగా జర్నీ చేయవచ్చు. ఇవన్నీ కలసి ఒక మంచి జ్ఞాపకాలుగా ఉంటాయి.

అయితే, హిమాలయాలకు రోడ్డు మార్గంలో ప్రయాణించడం వల్ల కలిగే నష్టాలు కూడా ఉన్నాయి. పర్వతాలు అనూహ్యమైనవి కావచ్చు. రోడ్డు ప్రయాణం అంటే తరచుగా వంపులు తిరిగిన ప్రదేశాలు, కొండచరియలు విరిగిపడే అవకాశం, ఆకస్మిక వాతావరణ మార్పులు చోటుచేసుకోవచ్చు.
ఏది బెస్ట్?
మీరు అలసిపోకుండా విశ్రాంతి తీసుకుంటూనే హిమాలయాలకు వెళ్లాలనుకుంటే రైలు ప్రయాణం బెస్ట్. ఎందుకంటే, సౌకర్యవంతమైన సీటులో కూర్చొని, కిటికీ బయటకు చూస్తూ, ప్రకృతి అందాలు ఆస్వాదించవచ్చు. ప్రయాణం ప్రశాంతంగా ఉంటుంది. శరీరానికి ఒత్తిడి ఉండదు.
అలా కాకుండా, మీరు సాహసాన్ని ఇష్టపడితే రోడ్ ట్రిప్ బెస్ట్ ఆప్షన్. మీకు స్వేచ్ఛ ఉంటుంది. ఎక్కడైనా ఆగొచ్చు, మార్గం మార్చవచ్చు. మారుమూల అందమైన గ్రామాలు, లోయలు వంటి ప్రదేశాలు కేవలం రోడ్ ద్వారా మాత్రమే చూడవచ్చు. స్పితి లోయ, తవాంగ్ లాంటి హిమాలయ రత్నాలు కేవలం రోడ్డు మార్గం ద్వారానే చూడవచ్చు.
అయితే, చాలా మంది ప్రయాణికులు ఇలా చేస్తారు:
రైలులో పర్వతాల అంచులకు చేరుతారు (ఉదా: కల్కా, కట్రా, రిషీకేష్, న్యాలా).
ఆ తర్వాత రోడ్డు ద్వారా లోతైన ప్రాంతాలకు ట్రిప్ కొనసాగిస్తారు.
ఇలా చేస్తే అటు రైలులో విశ్రాంతి తీసుకున్నట్లు ఉంటుంది ఇటు రోడ్డు మార్గం ద్వారా హిమాలయాల అందాలను పూర్తిగా చూసినట్లు ఉంటుంది.
Also Read:
రక్షా బంధన్ చరిత్ర మీకు తెలుసా? ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
మందులు తీసుకున్న తర్వాత ఈ ఆహారాలు అస్సలు తినకండి.!
For More Latest News