New Year Celebrations 2026: న్యూ ఇయర్ 2026.. పార్టీ కోసం వెళ్లాల్సిన బెస్ట్ డెస్టినేషన్స్ ఇవే
ABN , Publish Date - Dec 19 , 2025 | 04:02 PM
కొత్త సంవత్సరం రాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని నగరాలు అంగరంగ వైభవంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటాయి. అలాంటి వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న అర్థరాత్రి ప్రపంచం మొత్తం నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు, నగరాలు తమ తమ సంప్రదాయాలు, సంస్కృతులతో నూతన సంవత్సర వేడుకలను అద్భుతంగా జరుపుకుంటాయి. కొన్ని నగరాలు అయితే ఈ వేడుకలను చాలా గ్రాండ్‌గా నిర్వహించి ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షిస్తాయి. మీరు కూడా న్యూ ఇయర్ 2026 పార్టీని బాగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే, టాప్ బెస్ట్ డెస్టినేషన్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
బ్రెజిల్ – రియో డి జనీరో
రియో డి జనీరోలో నూతన సంవత్సర వేడుకలు సముద్ర తీరంలో జరగడం ప్రత్యేకత. ప్రజలు తెల్ల దుస్తులు ధరించి, బీచ్‌లపై చేరి సంగీతం, నృత్యాలతో ఆనందిస్తారు. అర్థరాత్రి అద్భుతమైన ఫైర్‌వర్క్స్‌తో ఆకాశం వెలుగులతో నిండిపోతుంది.
యునైటెడ్ స్టేట్స్ – న్యూయార్క్ నగరం
న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ నూతన సంవత్సర వేడుకలకు ప్రసిద్ధి. వేలాది మంది ప్రజలు ఇక్కడ చేరి కౌంట్‌డౌన్‌లో పాల్గొంటారు. అర్థరాత్రి బాల్ డ్రాప్ ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

ఆస్ట్రేలియా – సిడ్నీ
సిడ్నీ నగరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్‌గా జరుగుతాయి. సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్, ఓపెరా హౌస్ పరిసరాల్లో జరిగే ఫైర్‌వర్క్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి.
జపాన్ – టోక్యో
టోక్యోలో నూతన సంవత్సరం వేడుకలు సంప్రదాయ పద్ధతుల్లో జరుగుతాయి. ఆలయాల్లో ప్రార్థనలు అదే సమయంలో ఆధునిక నగర ప్రాంతాల్లో లైటింగ్ షోలు, ఈవెంట్లు కూడా జరుగుతాయి.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ – దుబాయ్
దుబాయ్‌లో నూతన సంవత్సర వేడుకలు అత్యంత వైభవంగా ఉంటాయి. బుర్జ్ ఖలీఫా చుట్టూ జరిగే లేజర్ షోలు, ఫైర్‌వర్క్స్ ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తాయి.

థాయిలాండ్ – బ్యాంకాక్
బ్యాంకాక్ నగరంలో నూతన సంవత్సరం సందర్భంగా రోడ్లన్నీ వెలుగులతో మెరుస్తాయి. సంగీత కార్యక్రమాలు, పార్టీలతో నగరం మొత్తం ఉత్సవ వాతావరణంలో మునిగిపోతుంది.
యునైటెడ్ స్టేట్స్ – లాస్ వెగాస్
లాస్ వెగాస్‌లో నూతన సంవత్సర వేడుకలు పార్టీలకు పెట్టింది పేరు. పెద్ద పెద్ద హోటళ్లు, క్యాసినోలు ప్రత్యేక కార్యక్రమాలతో సందర్శకులను ఆకర్షిస్తాయి. రాత్రంతా నగరం వెలుగులతో కళకళలాడుతుంది.
ఇటలీ – రోమ్
చరిత్రతో నిండిన రోమ్ నగరంలో నూతన సంవత్సరం వేడుకలు ప్రత్యేకంగా ఉంటాయి. పురాతన కట్టడాల మధ్య సంగీతం, నృత్య కార్యక్రమాలతో ప్రజలు ఆనందిస్తారు.

యునైటెడ్ స్టేట్స్ – న్యూ మెక్సికో
శాంటా ఫేలో నూతన సంవత్సరం వేడుకలు సంప్రదాయంగా, కుటుంబ వాతావరణంలో జరుగుతాయి. స్థానిక కళలు, సంస్కృతిని ప్రతిబింబించే కార్యక్రమాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ.
దక్షిణాఫ్రికా – కేప్ టౌన్
కేప్ టౌన్‌లో నూతన సంవత్సరాన్ని సముద్రతీరాలు, వీధి వేడుకలతో ఘనంగా జరుపుకుంటారు. సంగీతం, నృత్యాలు, ఫైర్‌వర్క్స్‌తో నగరం ఉత్సాహంగా మారుతుంది.
ప్రపంచంలోని ఈ నగరాలు తమ ప్రత్యేక శైలిలో నూతన సంవత్సరాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటాయి. ఎక్కడ ఉన్నా, ఏ సంస్కృతి అయినా నూతన సంవత్సరం అందరికీ కొత్త ఆశలు, కొత్త ప్రారంభాలకు ప్రతీకగా నిలుస్తుంది.
(Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతుంది. కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధృవీకరించలేదు )
Also Read:
న్యూ ఇయర్ పార్టీ.. ఇండియాలో బెస్ట్ బీచ్ డెస్టినేషన్స్ ఏవో తెలుసా?
కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో కనిపించే సంకేతాలు ఇవే.!
For MOre Latest News