Kailash Mansarovar Yatra: పవిత్ర కైలాస మానస సరోవర్ యాత్ర.. ఖర్చులు, పూర్తి వివరాలు తెలుసుకోండి.!
ABN , Publish Date - Nov 17 , 2025 | 02:11 PM
దాదాపు ఐదేళ్ల తర్వాత కైలాష్ మానస సరోవర్ యాత్ర జూన్ 2025లో పునఃప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే, కైలాస మానస సరోవర్ యాత్ర అంటే ఏంటి? ఈ పవిత్రమైన యాత్రకు ఎలా వెళ్లాలి? ఎంత ఖర్చు అవుతుంది? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: పవిత్ర కైలాస మానస సరోవర్ యాత్ర హిందువులకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన పుణ్య క్షేత్రాలలో ఒకటి. ఈ యాత్రను చేపట్టడం చాలా మందికి ఒక జీవిత కాల. COVID-19, కొన్ని దౌత్యపరమైన కారణాల వల్ల నిలిచిపోయిన ఈ యాత్ర దాదాపు ఐదేళ్ల తర్వాత జూన్ 2025లో తిరిగి ప్రారంభమైంది. అయితే, కైలాస మానస సరోవర్ యాత్ర అంటే ఏంటి? ఈ పవిత్రమైన యాత్రకు ఎలా వెళ్లాలి? ఎంత ఖర్చు అవుతుంది? అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
కైలాస మానస సరోవర యాత్ర
కైలాస మానస సరోవర యాత్ర అంటే హిందువులు శివుని నివాసంగా భావించే కైలాస పర్వతాన్ని, పవిత్రమైన మానస సరోవరాన్ని సందర్శించే ఒక ఆధ్యాత్మిక యాత్ర.. ఈ యాత్రలో ట్రెక్కింగ్, రోడ్డు ప్రయాణం ఉంటాయి. ఇది హిందువులతో పాటు బౌద్ధ, జైన మతాలకు కూడా చాలా పవిత్రమైనది. చైనా పరిపాలనలో ఉన్న ఈ యాత్ర టిబెట్‌లో ఉంది.
ప్రయాణ మార్గాలు:
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం జూన్ నుండి సెప్టెంబర్ వరకు రెండు మార్గాల ద్వారా ఈ యాత్రను నిర్వహిస్తుంది. లిపులేఖ్ పాస్ (ఉత్తరాఖండ్), నాథు లా పాస్ (సిక్కిం). భారతదేశం నుండి వెళ్లేవారు ఢిల్లీ నుండి లక్నోకు విమానంలో వెళ్లి, అక్కడి నుండి రోడ్డు మార్గంలో నేపాల్‌గంజ్, సిమికోట్, హిల్సా మీదుగా టిబెట్‌లోకి ప్రవేశిస్తారు. ఎంచుకున్న మార్గాన్ని బట్టి తీర్థయాత్ర ఖర్చు మారుతుంది. ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ పాస్ మార్గం ఒక్కొక్కరికి దాదాపు రూ.1.74 లక్షలు ఖర్చవుతుందని అంచనా. సిక్కింలోని నాథు లా పాస్ మార్గం ఖరీదైనది, ఒక్కొక్కరికి రూ.2.83 లక్షలు ఖర్చవుతుందని అంచనా.
యాత్రకు వెళ్లాలంటే..
భారతీయ పౌరుడై ఉండాలి
చెల్లుబాటు అయ్యే భారతీయ పాస్‌పోర్ట్ తప్పనిసరి
వయసు 18 నుండి 70 ఏళ్లు మధ్య ఉండాలి
బాడీ మాస్ ఇండెక్స్ (BMI) 25 లేదా అంతకంటే తక్కువ ఉండాలి
శారీరకంగా దృఢంగా ఉండాలి.
దరఖాస్తు చేసేటప్పుడు పాస్‌పోర్ట్ సైజు ఫోటో (JPG, 300 KB మించకూడదు) ఉండాలి.
పాస్‌పోర్ట్ స్కాన్ కాపీ – ముందు పేజీ, చివరి పేజీ (PDF, 500 KB మించకూడదు)
అర్హత కలిగినవారు ఆన్‌లైన్‌లో సులభంగా అప్లై చేసుకోవచ్చు.
Also Read:
కోపంలో గట్టిగా అరిచే అలవాటు ఉందా? జాగ్రత్త.!
ఈ 5 అలవాట్లు మెదడుకు ఔషధంలా పనిచేస్తాయి..
For More Latest News