Share News

Book Reading: పుస్తకపఠనం అలవాటు ఎక్కువగా ఉన్న దేశాలు ఏవో తెలుసా

ABN , Publish Date - Dec 20 , 2025 | 08:09 AM

పుస్తకపఠనంలో అమెరికా టాప్‌లో ఉండగా భారత్ రెండో స్థానంలో నిలిచింది. భారతీయులు ఏటా సగటున 352 గంటలు పుస్తకాలు చదివేందుకు కేటాయిస్తున్నారట.

Book Reading: పుస్తకపఠనం అలవాటు ఎక్కువగా ఉన్న దేశాలు ఏవో తెలుసా
Book Reading Habits

ఇంటర్నెట్ డెస్క్: పుస్తకపఠనం అలవాటుతో ఎంత మేలు కలుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెదడును యాక్టివ్‌గా ఉంచేందుకు పుస్తకపఠనానికి మించినది లేదు. మరి టెక్నాలజీ రాజ్యమేలుతున్న ఈ జమానాలో పుస్తకపఠనంలో టాప్‌లో ఉన్న దేశాలు ఏవో చూద్దాం (Book Reading Habits).

వరల్డ్ పాప్యులేషన్ రివ్యూ ప్రకారం, పుస్తకపఠనం అలవాటులో యూఎస్ టాప్‌లో ఉంది. అక్కడి జనాలు పుస్తకాలు చదివేందుకు సగటున ఏడాదికి 357 గంటలు కేటాయిస్తారు. విస్తారమైన పబ్లిక్ లైబ్రెరీ నెట్‌వర్క్, ఈ-బుక్స్ పాప్యులారిటీ పెరగడం వంటివి జనాల్లో పుస్తకపఠనంపై ఆస్తి పెరిగేలా చేస్తుంది.

పుస్తక పఠనంలో భారత్ రెండో స్థానాన్ని ఆక్రమించింది. భారతీయులు ఏటా సగటున పుస్తకపఠనానికి 352 గంటలను కేటాయిస్తున్నారు. వివిధ భాషల్లోని పుస్తకాలు డిజిటల్ రూపంలో అందుబాటులోకి రావడంతో భారతీయులకు పుస్తకాలు మరింతగా అందుబాటులోకి వచ్చాయట.

ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్న బ్రిటన్‌లో జనాలు సగటున ఏడాదికి 343 గంటలు పుస్తకపఠనానికి కేటాయిస్తారు. షేక్స్‌పియర్ మొదలు జేకే రౌలింగ్ వరకూ ఎందరో కవులు, రచయితలు బ్రిటన్ వాసులను పుస్తకపఠనం వైపు మళ్లేలా చేశారు. డిజిటల్ ప్రపంచంలో కూడా బ్రిటన్‌ ప్రజలు ప్రింటెడ్ పుస్తకాలవైపే మొగ్గు చూపుతున్నారు.


ఫ్రాన్స్ ప్రజలు సగటున ఏడాదికి 305 గంటలు పుస్తకపఠనానికి కేటాయిస్తున్నారు. ఫ్రెంచ్ ప్రజలకు ఫిక్షన్, వ్యాసాలు, సైద్ధాంతిక పుస్తకాలపై మక్కువ అధికం. అక్కడి కాఫీ షాపులు, బుక్ షాపుల్లో ప్రజలు పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేస్తారు.

పుస్తకపఠనంలో ఇటలీ ఐదవ స్థానంలో ఉంది. అక్కడి వారు ఏడాదికి సగటున 278 గంటలు పుస్తకాలు చదివేందుకు కేటాయిస్తారు. కవితలు, కళలపై విశ్లేషణలు వంటి వాటికి ఇటలీలో ఆదరణ ఎక్కువట.

ఈ టాప్ ఐద దేశాలతో పాటు రష్యా (223 గంటలు), ఆస్ట్రేలియా (217 గంటలు), స్పెయిన్ (187 గంటలు) దేశాలు కూడా పుస్తకపఠనంలో ముందంజలో ఉన్నాయి. సాహత్యం, వార్తలు మొదలు విద్య సంబంధిత పుస్తకాల వివిధ దేశాల మధ్య ప్రజల ఆసక్తిలో స్పష్టమైన తేడా ఉన్నట్టు తేలింది.


ఇవి కూడా చదవండి:

ఉదయం పూట ఇలా చేస్తారా.. చిన్నతనంలోనే వార్ధక్య లక్షణాలు వస్తాయి జాగ్రత్త!

నా కుమారుడు రోజూ ఉదయం 4 గంటలకే నిద్ర లేస్తాడు: నటుడు మాధవన్

Read Latest and Health News

Updated Date - Dec 20 , 2025 | 01:23 PM