Share News

Lifestyle: ఎవరూ పట్టించుకోవడం లేదని ఫీలయిపోతున్నారా.. ఇలా ఎందుకు జరుగుతుందంటే..

ABN , Publish Date - Jan 10 , 2024 | 03:56 PM

రోజురోజుకు మారిపోతున్న లైఫ్ స్టైల్ లో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. కానీ కొన్నాళ్ల క్రితం ఉమ్మడి కుటుంబం కాన్సెప్ట్ ఉండేది. ఫ్యామిలీ అంతా

Lifestyle: ఎవరూ పట్టించుకోవడం లేదని ఫీలయిపోతున్నారా.. ఇలా ఎందుకు జరుగుతుందంటే..

రోజురోజుకు మారిపోతున్న లైఫ్ స్టైల్ లో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. కానీ కొన్నాళ్ల క్రితం ఉమ్మడి కుటుంబం కాన్సెప్ట్ ఉండేది. ఫ్యామిలీ అంతా ఒకే ఇంట్లో ఉంటూ మంచిచెడూ చూసుకునేవారు. అలాంటి ఇళ్లల్లో ఆప్యాయత, అనురాగాలూ ఎక్కువే. విద్య, ఉపాధి, ఉద్యోగం కోసం చాలా మంది ఉమ్మడి కుటుంబాలను వదిలేస్తున్నారు. ఎవరికి వారు యమునా తీరే అన్నట్లు వెళ్లిపోతున్నారు. దీంతో క్రమక్రమంగా ఉమ్మడి కుటుంబాలు కనుమరుగైపోయాయి. ఒంటరి జీవితం, చిన్న కుటుంబానికి అలవాటు పడటం వల్ల ప్రేమాభిమానాలు పొందలేకపోతున్నారు. ఫలితంగా భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేకపోతున్నారు. చిన్న చిన్న కారణాలకే చిన్నబుచ్చుకుపోవడం, తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు.

సాధారంగా మనం కుటుంబం తర్వాత ఎక్కువగా స్నేహితులతోనే ఉంటాం. అయితే.. వారు ఎక్కడ తమను నిర్లక్ష్యం చేస్తారో అని ఆత్మనూన్యతా భావానికి గురవుతుంటారు. మనం ఎలా మట్లాడితే ఎదుటి వారూ అలాగే మాట్లాడతారు. ఎదుటివారిపై మన ప్రభావం అధికంగా ఉంటుంది. కొంతమంది వ్యక్తులు సున్నితంగా ఉంటారు. మరికొందరు మాత్రం ఏవీ పట్టించుకోకుండా హాయిగా కాలం గడిపేస్తుంటారు. కాబట్టి.. మనసులో ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా అందరితో కలిసిపోయేందుకు ప్రయత్నించాలి. కొత్తలో కష్టంగా ఉన్నా.. కాలం గడుస్తు్న్న కొద్దీ అలవాటుగా మారుతుంది.


సెల్ఫ్ మోటివేషన్ వీడియోలు చూడడం, వక్తల ప్రసంగాలు వినడం వంటివి చేయడం వల్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. పాటలు వినడం, కథలు చదవడం వంటి పనుల వల్ల భాషపై పట్టు వస్తుంది. మన గురించి ఇతరులు ఏమనుకుంటారో అనే ఫీలింగ్ నుంచి బయటపడాలి. మనం ఎలాగైతే వ్యవహరిస్తామో.. సమాజం కూడా అలాగే వ్యవహరిస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 10 , 2024 | 03:56 PM