Winter Steaming Tips: చలికాలంలో ఆవిరి పడుతున్నారా..? ఈ తప్పులు చేస్తే అంతే..
ABN , Publish Date - Nov 02 , 2025 | 07:42 PM
చలికాలంలో ఆవిరి పట్టుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే, ఈ తప్పులు చేస్తే మాత్రం సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కాబట్టి..
ఇంటర్నెట్ డెస్క్: చలికాలంలో ఆవిరి పట్టుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆవిరి పట్టుకోవడం వల్ల జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. వేడి నీటి ఆవిరి ముక్కు దిబ్బడను తగ్గిస్తుంది, గొంతు నొప్పిని నివారిస్తుంది. శ్వాసనాళాలను శుభ్రపరుస్తుంది. అయితే, ఆవిరి పట్టే సమయంలో ఈ తప్పులు చేస్తే మాత్రం సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ జాగ్రత్తలు తీసుకోండి
ఆవిరి పట్టుకునే ముందు ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. జిడ్డుగా లేకుండా చూసుకోవాలి. ముఖంపై మేకప్ లేకుండా చూసుకోవాలి.
ఆవిరిని కేవలం 10 నుంచి 15 నిమిషాలు మాత్రమే పెట్టుకోవాలి. అంతకంటే ఎక్కువ సేపు పెట్టుకోవడం మంచిది కాదు.
ఆవిరి పెట్టుకున్నా తర్వాత ముఖాన్ని సున్నితమైన కాటన్ వస్త్రంతో తుడుచుకోవాలి.
ఈ తప్పులు చేయకండి:
ఎక్కువ సేపు ఆవిరి పట్టుకోకండి. పావు గంటకు కంటే ఎక్కువ సేపు ఆవిరిపట్టడం మంచిది కాదు.
అలాగే, ప్రతి రోజూ ఈ పని చేయడం ప్రమాదం. తరచుగా ఆవిరి పట్టుకోవడం వల్ల చర్మం సమస్యలు రావచ్చు, అంతేకాకుండా దురదలు లాంటి సమస్యలు కూడా మొదలవుతాయి.
సున్నిత చర్మం ఉన్న వారు కేవలం తక్కువ వేడి ఉన్న నీటితో మాత్రమే ఆవిరి పెట్టుకోవాలి.
కొంత మంది నీళ్లను స్టౌ పై పెట్టి, మరుగుతున్నప్పుడు అలానే ఆవిరి పట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. అయితే, ఇలా చేయడం చాలా తప్పు. నేరుగా ఆవిరి పట్టుకుంటే ఒక్కోసారి అనుకోకుండా ఎక్కువ ఉష్ణోగ్రత తగిలి ముఖం కమిలిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, ఎప్పుడూ కూడా స్టౌ పై ఆవిరి పెట్టుకోకూకుడదు.
Also Read:
లావు ఉన్న వారికి నిమ్మ తొక్కలు ఓ వరం.. ఎలా అంటే?
శీతాకాలంలో ఖర్జూరాలు ఎందుకు తినాలో తెలుసా?
For More Latest News