Benefits Of Lemon Peel: లావు ఉన్న వారికి నిమ్మ తొక్కలు ఓ వరం.. ఎలా అంటే?
ABN , Publish Date - Oct 30 , 2025 | 12:47 PM
నిమ్మ జ్యూస్ లో కంటే తొక్కలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయని చాలా మందికి తెలియదు. ఈ తొక్కలు ఒక న్యూట్రియెంట్ పవర్ హౌస్ లాంటివి అని నిపుణులు చెబుతున్నారు. ఈ తొక్కలో విటమిన్-సి, డీ-లిమొనెన్, ఫెక్టిన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: మనమందరం నిమ్మకాయలను వివిధ సందర్భాల్లో ఆహారంలో వినియోగిస్తుంటాము. అయితే ఎక్కువ మంది నిమ్మ రసాన్ని వాడుకుని.. దాని తొక్కల(Lemon Peel)ను పడేస్తుంటారు. అలా తొక్కే కదా అని పడేస్తే.. మనం చాలా నష్టపోయినట్లే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అధిక బరువు ఉన్న వాళ్లకు ఈ నిమ్మ తొక్కలు వరం లాంటివి. వాటిని సరిగ్గా వినియోగించుకుంటే.. బాడీ ఫ్యాట్ తగ్గి.. నాజూగ్గా మారవచ్చు. మరి.. నిమ్మ తొక్కలను ఎలా ఉపయోగిస్తే.. అధిక బరువు(Weight Loss) తగ్గొచ్చు ఇప్పుడు తెలుసుకుందాం..
నిమ్మ జ్యూస్ లో కంటే తొక్కలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయని చాలా మందికి తెలియదు. ఈ తొక్కలు ఒక న్యూట్రియెంట్ పవర్ హౌస్ లాంటి(Nutritional Value of Lemon Peel)వి అని నిపుణులు చెబుతున్నారు. ఈ తొక్క(Lemon Peel)లో విటమిన్-సి, డీ-లిమొనెన్, ఫెక్టిన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. దీనిలోని విటమిన్ సీ శరీరంలోని రోగ నిరోధక శక్తిని బూస్ట్ చేస్తుంది. అలానే మన చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి కణాల డ్యామేజ్‌ను విటమిన్-సి ఆపుతుంది. అలానే దీనిలోని ఫైబర్, ఫెక్టిన్ అనేవి జీర్ణ వ్యవస్థకు హెల్ప్ చేస్తాయి. వీటి వల్ల త్వరగా ఆకలి వేయదు. ఫ్లేవనాయిడ్స్, డీ-లిమొనెన్ లు మెటబాలిజంను పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. బోన్ హెల్త్‌కు కాల్షియం, మెగ్నీషియం బలం ఇస్తాయి.
నిమ్మ తొక్క(Lemon Peel)లో ఉండే డీ-లిమొనెన్ శరీరంలోని కాంపౌండ్ కొవ్వును కరిగించడానికి మెటబాలిజంను మెరుగుపరుస్తుంది. ఈ తొక్కను మన డైలీ లైఫ్ లో చేర్చుకోవడం చాలా ఈజీ. నిమ్మ తొక్కలను బాగా కడిగిన తర్వాత ఎండలో ఉంచి డ్రై చేయాలి. బాగా ఎండిన తర్వాత మిక్సీలో వేసి .. పౌడర్ లా చేయాలి. ఆ పౌడర్ ను రోజూ ఉదయం ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగాలి. అలా రోజూ చేయడం వల్ల.. మనకు తెలియకుండానే బాడీ వెయిట్ తగ్గుతుంద(Weight Loss)ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గేందు(Health Tips)కు వేలకు వేలు ఖర్చు చేయకుండా నిమ్మ తొక్కలతోనే మార్పు తెచ్చుకోవచ్చు. వాతావరణం మారినప్పుడు వచ్చే వచ్చే జలుబు, దగ్గు లాంటి వాటి నుంచి శరీరం త్వరగా కోలుకునేందుకు నిమ్మ తొక్కలు(Lemon Peel Health Benefits) ఉపయోగపడతాయట.
ఇవి కూడా చదవండి...
యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టండి.. డిప్యూటీ సీఎం ఆదేశం
శ్రీశైలంలో కుండపోత వర్షం.. విరిగిపడ్డ కొండచరియలు