Share News

New Year Celebrations: హ్యాంగోవర్ నుంచి ఇలా బయటపడండి..

ABN , Publish Date - Dec 29 , 2025 | 09:44 PM

మరో రెండు రోజుల్లో నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు యావత్ ప్రపంచం సిద్ధమైంది. డిసెంబర్ 31 అర్థరాత్రి ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ బిగ్ సెలబ్రేషన్స్ చేసుకుంటారు. న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఇప్పటికే ఎవరి ప్లాన్స్ వారు చేసుకుంటారు.

New Year Celebrations: హ్యాంగోవర్ నుంచి ఇలా బయటపడండి..
Hangover Home Remedies

Tips for Hangover: మరో రెండు రోజుల్లో నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు యావత్ ప్రపంచం సిద్ధమైంది. డిసెంబర్ 31 అర్థరాత్రి ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ బిగ్ సెలబ్రేషన్స్ చేసుకుంటారు. న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఇప్పటికే ఎవరి ప్లాన్స్ వారు చేసుకుంటారు. ఇక న్యూఇయర్ పార్టీలో మందు, చిందు అనేది కామన్. యువత మద్యం మత్తులో ఊగిపోతుంటారు. ఆ రోజు రాత్రంతా ఫుల్లుగా తాగేస్తారు. ఫుల్ మస్తీ చేస్తారు. తాగుడు, చిందేసుడు వరకు బాగానే ఉంటుంది. కానీ, ఆ మరుసటి రోజే సినిమా కనిపిస్తుంది. చాలా మంది హ్యాంగోవర్ సమస్యతో బాధపడుతుంటారు. మరి హ్యాంగోవర్ సమస్య నుంచి ఎలా బయటపడాలి? అంటే ఇందుకోసం అద్భుతమైన చిట్కాలు తీసుకువచ్చాం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ చిట్కాలతో కేవలం 10 నిమిషాల్లో హ్యాంగోవర్ సమస్య నుంచి బయటపడొచ్చు.


పసుపు నీళ్లు:

పసుపు నీళ్లు హ్యాంగోవర్ నుంచి బయట పడేందుకు సహాయపడుతుంది. ఇందులో నొప్పి, వాపు, ఇన్‌ఫెక్షన్ వంటి లక్షణాలను తగ్గించే శక్తి ఉంటుంది. హ్యాంగోవర్ లక్షణాలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. హ్యాంగోవర్ సమస్యతో బాధపడేవారు 1 టీస్పూన్ పసుపును, ఒక నిమ్మ చెక్క రసాన్ని గోరువెచ్చని నీటిలో కలిపి తాగాలి. ఇందులో కొద్దిగా నల్లమిరియాలు, తేనె కూడా కలపవచ్చు.

కొబ్బరినీళ్లు:

కొబ్బరి నీళ్లు కూడా హ్యాంగోవర్ సమస్యను తగ్గిస్తుంది. ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం శరీరం డీహైడ్రేడ్ అవుతుంది. కొబ్బరినీళ్లు తీసుకోవడం వల్ల ఇందులోని ఎలక్ట్రోలైట్లు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. తద్వారా డీహైడ్రేషన్ సమస్య తగ్గి.. హ్యాంగోవర్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

నిమ్మకాయ నీరు:

హ్యాంగోవర్ సమస్యకు నిమ్మకాయ నీరు కూడా అత్యంత ప్రభావవంతంగా పని చేస్తుంది. ఒక గ్లాసు నిమ్మరసం, చిటికెడు ఉప్పు కలిపి తాగాలి. శరీరంలో ఎలక్ట్రోలైట్లను పెంచుతుంది. తద్వారా శరీరం హైడ్రేట్‌గా మారి.. హ్యాంగోవర్ సమస్య నుంచి ఉపశమనం పొందుతుంది. వికారం, వాంతులు, తలనొప్పి సమస్య నుంచి ఉపశమనం పొందుతుంది.


పెరుగు:

పెరుగు, మజ్జిగ తాగడం వల్ల కూడా హ్యాంగోవర్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. చక్కెర గానీ, ఉప్పు గానీ కలపకుండా సాదా మజ్జిగ, పెరుగు తీసుకోవాలి.

అరటిపండ్లు:

హ్యాంగోవర్‌ సమస్య నుంచి ఉపశమనం పొందడంలో అరటిపండ్లు చాలా ప్రభావవంతంగా పని చేస్తాయి. వీటిలో ఉండే పొటాషియం, కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి డీహైడ్రేషన్ సమస్యను తగ్గిస్తాయి.

పుదీనా నీరు:

పుదీనా కూడా హ్యాంగోవర్ నుంచి ఉపశమనం కల్పించడంలో అద్భుతంగా పని చేస్తుంది. తాజా పుదీనా ఆకులను వేడి నీటిలో కాసేపు మరిగించాలి. ఆ తరువాత వడకట్టి తాగాలి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా వికారం, వాంతుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

గ్రీన్ టీ:

గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి త్వరిత శక్తిని అందిస్తుంది. హ్యాంగోవర్ నుంచి బయటపడటానికి సహాయపడుతుంది.

వెజిటేబుల్, చికెన్ సూప్:

హ్యాంగోవర్ సమయంలో శరీరంలో ఎలక్ట్రోలైట్స్ తగ్గిపోతాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు తేలికపాటి వెజిటేబుల్ సూప్, చికెన్ సూప్ తీసుకోవాలి. ఇది శరీరానికి అవసరమైన ఖనిజాలను అందిస్తుంది. ఇది సులభంగా జీర్ణమవుతుంది. వెచ్చని సూప్ శరీరానికి శక్తిని ఇస్తుంది.


Also Read:

తిరుమల చేరుకున్న రేవంత్ రెడ్డి.. స్వాగతం పలికిన ఏపీ మంత్రులు..

చైల్డ్‌ ట్రాఫికింగ్ నిందితుల కస్టడీ కోరుతూ మియాపూర్‌ పోలీసుల పిటిషన్‌..

న్యూ ఇయర్.. మందుబాబులకు ఇక డబుల్ కిక్కే..

Updated Date - Dec 29 , 2025 | 09:44 PM