Revanth Reddy Tirumala visit: తిరుమల చేరుకున్న రేవంత్ రెడ్డి.. స్వాగతం పలికిన ఏపీ మంత్రులు..
ABN , Publish Date - Dec 29 , 2025 | 09:36 PM
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శ్రీనివాసుడి దర్శనార్థం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుమల చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాదు నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి జిల్లా అధికారులు స్వాగతం పలికారు.
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శ్రీనివాసుడి దర్శనార్థం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుమల చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాదు నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి జిల్లా అధికారులు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన రేవంత్ రెడ్డి తిరుమలకు బయలుదేరి వెళ్లారు (Telangana CM Tirumala).

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చం నాయుడు కూడా తిరుమలకి చేరుకున్నారు (Revanth Reddy temple visit). వీరికి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళి, టీటీడీ బోర్డు మెంబర్ పనబాక లక్ష్మి తదితరులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి..
బట్టలు లేకుండా తాగుతూ, తూగుతూ.. బ్రిటన్‌లో వెరైటీ న్యూ ఇయర్ పార్టీ..
మీ కళ్లు పవర్‌ఫుల్ అయితే.. ఈ Qల మధ్యలో O ఎక్కడుందో 15 సెకెన్లలో కనిపెట్టండి..