Child trafficking case: చైల్డ్ ట్రాఫికింగ్ నిందితుల కస్టడీ కోరుతూ మియాపూర్ పోలీసుల పిటిషన్..
ABN , Publish Date - Dec 29 , 2025 | 09:04 PM
చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో ప్రధాన నిందితులు అయిన గంగాధర్, బాబు, హర్ష, నాగలక్ష్మిని విచారించి మరిన్ని వివరాలు రాబట్టాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
చిన్నారుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠా సభ్యులను ఎనిమిది రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కూకట్‌పల్లి కోర్టులో మియాపూర్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో ప్రధాన నిందితులు అయిన గంగాధర్, బాబు, హర్ష, నాగలక్ష్మిని విచారించి మరిన్ని వివరాలు రాబట్టాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు (Miyapur police custody plea).
గుజరాత్ నుంచి చిన్నారులను తీసుకొచ్చి హైదరాబాద్, మంచిర్యాలలో విక్రయిస్తున్న ముఠా సభ్యులను పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకున్నారు (child trafficking accused). ఆ ముఠాలో సృష్టి ఫెర్టిలిటీ కేసుకు సంబంధించిన నిందితులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
సృష్టి కేసులో బెయిల్‌పై వచ్చిన నిందితులే ఈ చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఒక్కో చిన్నారిని రూ.4 నుంచి రూ.5 లక్షల వరకు విక్రయిస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. నిందితుల నుంచి ఇద్దరు శిశువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
బట్టలు లేకుండా తాగుతూ, తూగుతూ.. బ్రిటన్‌లో వెరైటీ న్యూ ఇయర్ పార్టీ..
మీ కళ్లు పవర్‌ఫుల్ అయితే.. ఈ Qల మధ్యలో O ఎక్కడుందో 15 సెకెన్లలో కనిపెట్టండి..