Financial Planning: సంపాదన ఉన్నా తీరని కష్టాలు.. మధ్యతరగతి వారు చేసే పొరపాట్లు ఇవే
ABN , Publish Date - Nov 05 , 2025 | 02:20 PM
మధ్యతరగతి వారు సాధారణంగా చేసే కొన్ని పొరపాట్ల కారణంగా కష్టాల నుంచి బయటపడలేకపోతున్నారని డైమ్ సంస్థ వ్యవస్థాపకురాలు ఓ పోస్టు పెట్టారు. ఇది ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: కష్టపడి పనిచేసే మనస్తత్వం, ఆదాయం ఉన్నా కూడా ఎన్నో మధ్యతరగతి కుటుంబాలు అర్థిక చిక్కుల్లో కొట్టుమిట్టాడుతుంటాయి. ఇందుకు కారణాలు తెలియక సతమతం అవుతుంటాయి. అయితే, ఈ పరిస్థితికి నాలుగు ప్రధాన కారణాలు ఉన్నాయని డైమ్ సంస్థ వ్యవస్థాపకురాలు చంద్రలేఖ కామెంట్ చేశారు. ఆమె పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది (Middle Class- Financial Mistakes).
లింక్డ్‌ఇన్‌లో చంద్రలేఖ ఈ పోస్టు పెట్టారు. కొన్ని అలవాట్ల కారణంగా మధ్యతరగతి వారి జీవితాలు నిత్య పోరాటంగా మారుతున్నాయని, ఆర్థిక స్థిరత్వం సాధించలేక చతికిలపడుతున్నాయని చెప్పారు. కేవలం ఆదాయ లేమి మాత్రమే మధ్యతరగతి వారి కష్టాలకు కారణం కాదని వివరించారు. మంచి ఆదాయం ఉన్నప్పటికీ ఎన్నో మధ్య తరగతి కుటుంబాలు సంపదను ఎలా కూడబెట్టుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నాయని అన్నారు. మధ్యతరగతి జీవుల ప్రవర్తనలో నాలుగు తప్పులను సూచించారు.
చాలా మంది మధ్యతరగతి వారు అప్పు చేయడం సాధారణమనే ఆలోచనతో ఉంటారు. ఫలితంగా క్రెడిట్ కార్డు అప్పులు, ఈఎమ్‌ఐల భారం కింద పడి నలిగిపోతుంటారు.
క్లిష్టమైన పరిస్థితుల్లో ఆదుకునేలా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తారు. చివరకు సమస్యలు ఎదురైతే.. ఖర్చులు తడిసిమోపెడై మధ్యతరగతి జీవితాలు తలకిందులవుతున్నాయి.
స్టేటస్ పేరిట దుబారా ఖర్చులకు దిగడం మధ్యతరగతి వారు చేసే మరో తప్పిదం. సంపాదనకు మించిన అప్పులతో కార్లు, ఇళ్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు కొని చిక్కులు కొనితెచ్చుకుంటూ ఉంటారు.
ధనికులు మాత్రం తమ ప్రాధాన్యతల విషయంలో పూర్తి స్పష్టతతో ఉంటారు. ముందుగా ఆర్థిక భద్రత, స్థిరత్వాన్ని సాధించుకున్నాక అప్పుడు స్వేచ్ఛగా ఖర్చుపెట్టేందుకు సిద్ధమవుతారు. కాబట్టి, మధ్యతరగతి వారు కూడా ముందు పొదుపు, పెట్టుబడులపై దృష్టి సారించాలని ఆమె సూచించారు. అప్పుడే అసలైన ఆర్థిక స్వాతంత్ర్యం సిద్ధిస్తుందని అన్నారు.
ఇవి కూడా చదవండి
భారతీయ విద్యార్థుల వీసా దరఖాస్తుల్లో 74 శాతం తిరస్కరణ.. షాకిచ్చిన కెనడా
ఈ20 ఇంధనంతో మైలేజీ సమస్యా.. ఇలా చేస్తే మీ సమస్యకు పరిష్కారం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి