Mobile Phone Addiction: ఫోన్‌కు దగ్గరై, కుటుంబానికి దూరమవుతున్న జీవితాలు.. నిపుణుల హెచ్చరిక
ABN , Publish Date - Sep 11 , 2025 | 09:25 AM
మొబైల్ ఫోన్ల వల్ల కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు తగ్గిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఒంటరితనం పెరిగి, కొందరు ఆత్మహత్య వైపు అడుగులు వేస్తున్నారని హెచ్చరించారు. ఇలాంటి క్రమంలో ఏం చేయాలి, ఫ్యామిలీతో ఎలా ఉండాలనే విషయాలను ఇక్కడ చూద్దాం.
ఒకప్పుడు ఒకరికొకరు కలుసుకుని మాట్లాడుకున్న అనుబంధాలు.. ప్రస్తుత కాలంలో ఎక్కువగా మొబైల్ స్క్రీన్లకే పరిమితం అవుతున్నాయి. ఇంట్లో అందరూ ఒకే గదిలో ఉన్నా కూడా, చాలా మంది తమ ఫోన్లలోనే మునిగిపోతున్నారు. ఈ అలవాటు కుటుంబ సభ్యుల మధ్య దూరాన్ని పెంచుతోంది. క్రమంగా అనేక కుటుంబాలు మాట్లాడుకోవడం, భావాలను పంచుకోవడం మర్చిపోయాయయని అల్లహాబాద్ హైకోర్ట్ న్యాయమూర్తి శేఖర్ యాదవ్ ఓ సెమినార్‌లో చెప్పారు.
ఈ దూరం కారణంగా ఒంటరితనం పెరిగి అనేక మంది యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు గుర్తు చేశారు. కాబట్టి ఇలాంటి సంక్లిష్ట సమాజంలో మానవ సంబంధాల ప్రాముఖ్యతను తిరిగి గుర్తు చేసుకోవటం ఎంతో అవసరం ఉందన్నారు.
పిల్లలపై ఒత్తిడి తగ్గించండి
పిల్లలపై పేరెంట్స్ ఏ విషయంలో కూడా ఎక్కువ ఒత్తిడి పెట్టకూడదని సూచించారు. మీరు.. మీ పిల్లలు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అని చెప్పొద్దన్నారు. పిల్లలకి వారికి ఇష్టమైన వాటిలో కావలసిన కెరీర్ ఎంచుకునే స్వేచ్ఛ ఇవ్వాలని సూచించారు. పిల్లలను ఎప్పుడూ మరొకరితో పోల్చకూడదన్నారు. పిల్లలను తక్కువగా భావించకూడదని, వారిని అనేక సార్లు నిరుత్సాహ పరచడం వల్ల వారు డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడవచ్చని హెచ్చరించారు.
చర్చలు చాలా ముఖ్యం
పిల్లలతో తల్లిదండ్రులు మంచి కమ్యూనికేషన్ కల్గి ఉండాలి. వారి భావాలు, సమస్యలను పక్కన పెట్టకుండా చర్చించుకోవాలి. అదే విధంగా మీ స్నేహితుల్లో ఎవరైనా ఆ విధంగా ఉంటే పక్కన పెట్టొద్దని, వారికి సహాయం చేయాలని, వారితో చర్చించాలని న్యాయవాది సూచించారు. వారిని అలాగే వదిలేసినపుడు ఆత్మహత్యల సంఖ్య పెరుగుతుందన్నారు.
విద్యార్థుల మానసిక ఆరోగ్యం
ఉన్నత విద్యా సంస్థలలో విద్యార్థులు చాలా ఒత్తికి గురవుతున్నారని ప్రొఫెసర్ అనుపమ్ అగర్వాల్ తెలిపారు. మార్కులు, ర్యాంకుల పేరుతో విద్యార్థులపై ప్రెషర్ తెస్తున్నారని..వాటిని తట్టుకోలేక పలువురు విద్యార్థుల సూసైడ్ చేసుకుంటున్నట్లు గుర్తు చేశారు. కుటుంబ సమస్యలు, చదువు, వ్యక్తిగత సమస్యలు మొదలైన కారణాల వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు. అలాంటి సమయంలో వారికి సపోర్ట్ చేయాలని సూచించారు.
సహాయం కోరటంలో..
మీరు లేదా మీ పరిచయస్తులలో ఎవరికైనా మానసిక ఒత్తిడి లేదా డిప్రెషన్ వంటి సమస్యలు ఉంటే, దాన్ని దాచిపెట్టవదన్నారు. సహాయం లేదా మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవాలన్నారు. ఈ విషయంలో ఎవరూ కూడా ఒంటరిగా బాధపడకూడదన్నారు.
సహాయం కోసం కొన్ని హెల్ప్‌లైన్లు
వండ్రేవలా ఫౌండేషన్ ఫర్ మెంటల్ హెల్త్ – 9999666555 లేదా help@vandrevalafoundation.com
TISS iCall – 022-25521111 (సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు)
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి