Share News

Dementia: వృద్ధాప్యంలో మతిమరుపు.. ఈ ముప్పు తప్పాలంటే..

ABN , Publish Date - Dec 15 , 2025 | 03:06 PM

వృద్ధాప్యంలో మతిమరుపు, ఆల్జైమర్స్ లాంటి సమస్యల ముప్పు తగ్గాలంటే కొన్ని అలవాట్లను చేసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. వీటి ద్వారా జీవితాంతం చక్కని మానసిక ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని అంటున్నారు.

Dementia: వృద్ధాప్యంలో మతిమరుపు.. ఈ ముప్పు తప్పాలంటే..
memory loss prevention

ఇంటర్నెట్ డెస్క్: వయసు పెరిగే కొద్దీ కొందరిలో మతిమరుపు వస్తుంటుంది. ఆల్జైమర్స్ లాంటి వ్యాధి బారిన పడితే మతిమరుపుతో పాటు మరిన్ని సమస్యలు ఎదురవుతాయి. ఆధునిక జమానాలో జీవనశైలి కారణంగా ఈ మతిమరుపు ముప్పు పెరుగుతోంది. అయితే, ఈ సమస్య నుంచి తప్పించుకునేందుకు కొన్ని అలవాట్లు తప్పనిసరిగా చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా వృద్ధాప్యంలో మతిమరుపునకు దారి తీసే ఆల్జైమర్స్, ఇతర మెదడు సంబంధిత ముప్పును సులువుగా తప్పించుకోవచ్చు.

మతిమరుపు ముప్పును తగ్గించే అలవాట్లలో కసరత్తు ముందు వరుసలో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కసరత్తుల వల్ల మెదడుకు రక్త ప్రసరణ పెరిగి ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. జ్ఞాపకశక్తిని పెంచే బ్రెయిడ్ డిరైవ్డ్ న్యూరోట్రాపిక్ ఫ్యాక్టర్ స్థాయిలు పెరుగుతాయి. రోజు కేవలం 30 నిమిషాల పాటు చేసే కసరత్తులో ఈ అద్భుత ఫలితాలు లభిస్తాయి.

ఆకు కూరలు బెర్రీలు, ఆలివ్ ఆయిల్, చేపలు, పప్పులు అధికంగా ఉన్న డైట్ తింటే మెదడుపై ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది. ఇన్సులీన్ సెన్సిటివీ కూడా పెరిగి మెదడు దృఢంగా మారుతుంది.


ఒంటరితనంతో మెదడు ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి, కొలిగ్స్, ఫ్రెండ్స్‌తో చిట్‌చాట్ వంటివి మానసిక ఉల్లాసాన్ని కలిగించి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

పజిల్స్ సాల్వ్ చేయడం, కొత్త విషయాలు నేర్చుకోవడం వంటి వాటి వల్ల మెదడు క్రియాశీలకమై మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. వృద్ధాప్య సంబంధిత సమస్యలు దరిచేరవు.

బీపీ, డయాబెటిస్, ఊబకాయం వంటివన్నీ మతిమరుపు రిస్క్‌ను పెంచుతాయి. కాబట్టి ఇలాంటి దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారు ఆయా వ్యాధులను నియంత్రణలో పెట్టుకుంటే మతిమరుపు ముప్పు తగ్గుతుంది.

మద్యపానం, ధూమపానం వంటివన్నీ మెదడు సామర్థ్యం తగ్గేలా చేస్తాయి. మెదడులోని వైట్ మ్యాటర్‌ తగ్గేలా చేస్తాయి. కాబట్టి, చెడు అలవాట్లకు దూరంగా ఉండటం భవిష్యత్తులో మీకు మీరు ఇచ్చుకునే ఓ బహుమతి అన్న విషయం మర్చిపోకూడదు. కాబట్టి, తక్షణం ఈ అలవాట్లను మొదలు పెడితే జీవితాంతం చక్కని ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని వైద్యులు భరోసా ఇస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

నా కుమారుడు రోజూ ఉదయం 4 గంటలకే నిద్ర లేస్తాడు: నటుడు మాధవన్

40 ఏళ్లు దాటిన పురుషులు జిమ్‌లో కసరత్తులతో కండలు పెంచగలరా

Read Latest and Health News

Updated Date - Dec 15 , 2025 | 08:03 PM