Lifestyle International: ఏటా రూ 120 కోట్ల పెట్టుబడులు
ABN , Publish Date - Sep 20 , 2025 | 04:00 AM
దుబాయ్‌కి చెందిన ల్యాండ్‌మార్క్ గ్రూప్ సంస్థ.. లైఫ్‌స్టైల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఏటా రూ.120 కోట్ల పెట్టుబడులతో...
కొత్తగా 12-14 షోరూమ్స్ ఏర్పాటు
లైఫ్‌స్టైల్ ఇంటర్నేషనల్ సీఈఓ దేవ్ అయ్యర్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): దుబాయ్‌కి చెందిన ల్యాండ్‌మార్క్ గ్రూప్ సంస్థ.. లైఫ్‌స్టైల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఏటా రూ.120 కోట్ల పెట్టుబడులతో కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. శుక్రవారం నాడిక్కడ సంస్థ సీఈఓ, ఈడీ దేవ్ అయ్యర్.. టాలీవుడ్ నటి పూజా హెగ్డేతో కలిసి దసరా కలెక్షన్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా అయ్యర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లైఫ్‌స్టైల్ 124 స్టోర్లను నిర్వహిస్తోందని, విస్తరణలో భాగంగా ప్రతి సంవత్సరం కొత్తగా 12-14 షోరూమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం ఏటా రూ.120 కోట్ల వరకు పెట్టుబడులు పెడుతున్నట్లు ఆయన వివరించారు. కాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సంస్థ 14 స్టోర్స్‌ను నిర్వహిస్తోందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 4 షోరూమ్స్‌ను ప్రారంభించనున్నట్లు అయ్యర్ తెలిపారు. గడచిన ఆర్థిక సంవత్సరంలో లైఫ్‌స్టైల్ టర్నోవర్ రూ.5,000 కోట్లుగా ఉందని, ఈ ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధిని అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు. లైఫ్‌స్టైల్ మొత్తం ఆదాయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వాటా 11 శాతంగా ఉందన్నారు. వస్త్రాలపై జీఎ్‌సటీ తగ్గింపు రిటైల్ పరిశ్రమలో జోష్ నింపనుందని, దీంతో ఈ పండగ సీజన్‌లో అమ్మకాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
డీయూఎస్‌యూ ఎన్నికల్లో ఏబీవీపీ విజయభేరి
హఫీజ్‌ను కలిసినందుకు మన్మోహన్ కృతజ్ఞతలు.. అఫిడవిట్‌లో యాసిన్ మాలిక్ వెల్లడి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి