Share News

Guinness Record: 273 మంది ఆటోగ్రాఫ్‌లను పచ్చబొట్టుగా..

ABN , Publish Date - Dec 28 , 2025 | 10:38 AM

ప్రపంచంలోనే అత్యధిక ‘సిగ్నేచర్‌ టాటూ’లున్న వాడిగా గిన్నిస్‌ రికార్డు సాధించాడు. ఫంకీ మటాస్‌(38)కు చిన్నప్పట్నుంచీ టాటూలంటే పిచ్చి. ఆ ఇష్టంతోనే టాటూ ఆర్టిస్టుగా మారాడు. ఖాళీ సమయాల్లో మ్యూజిక్‌ షోలు, ఫిల్మ్‌ ఈవెంట్స్‌కి వెళ్తుండేవాడు.

Guinness Record: 273 మంది ఆటోగ్రాఫ్‌లను పచ్చబొట్టుగా..

- టాటూ ఆటోగ్రాఫ్‌లు...

అమెరికాకు చెందిన ఓ వ్యక్తి తన వీపును కాన్వాస్‌గా మార్చుకుని ఏకంగా 273 మంది ఆటోగ్రాఫ్‌లను పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. ప్రపంచంలోనే అత్యధిక ‘సిగ్నేచర్‌ టాటూ’లున్న వాడిగా గిన్నిస్‌ రికార్డు సాధించాడు. ఫంకీ మటాస్‌(38)కు చిన్నప్పట్నుంచీ టాటూలంటే పిచ్చి. ఆ ఇష్టంతోనే టాటూ ఆర్టిస్టుగా మారాడు. ఖాళీ సమయాల్లో మ్యూజిక్‌ షోలు, ఫిల్మ్‌ ఈవెంట్స్‌కి వెళ్తుండేవాడు. 21 ఏళ్ల వయసులో ఓ ఈవెంట్‌లో కలిసిన వ్యక్తి ఆటోగ్రాఫ్‌ని సరదాగా వీపుపై రాయించుకుని... ఆపై దాన్ని టాటూగా మార్చుకున్నాడు. ఆ రోజు నుంచి తన ఆలోచనకు కనెక్ట్‌ అయిన వ్యక్తులు, స్నేహితుల సంతకాలను మార్కర్‌తో వీపుపై రాయించుకోవడం.. దాన్ని టాటూగా మార్చుకోవడం మొదలెట్టాడు.


book5.2.jpg

సామాన్యులతో మొదలెట్టిన ఈ సిగ్నేచర్‌ టాటూల ప్రస్థానం సెలబ్రిటీల దాకా పాకింది. ఈ జాబితాలో అమెరికన్‌ ర్యాపర్‌, నటుడు కర్టిస్‌ జేమ్స్‌ జాక్సన్‌ 3 (50 సెంట్‌), ప్రముఖ లాటిన్‌ ఆర్టిస్ట్‌ బ్యాడ్‌ బన్నీ, ప్రపంచ ప్రఖ్యాత నటుడు సామ్యూల్‌ ఎల్‌. జాక్సన్‌, హాలీవుడ్‌ నటుడు విల్‌ స్మిత్‌, కామిక్‌ బుక్‌ రచయిత స్టాన్‌ లీ, పరుగుల వీరుడు హుసేన్‌ బోల్ట్‌... ఇలా ఎందరో సెలబ్రిటీలున్నారు. టాటూల ఫంకీ ఇంతకుముందు మరో రికార్డు కూడా నెలకొల్పాడు. స్కైడైవింగ్‌ చేస్తూ, మోటార్‌ సైకిల్‌ నడుపుతూ, గుర్రంపై స్వారీ చేస్తూ పచ్చబొట్టు వేయించుకున్న మొట్టమొదటి వ్యక్తిగా అరుదైన ఫీట్‌ సాధించాడు.


ఈ వార్తలు కూడా చదవండి..

బ్రేకులే లేనట్టు దూసుకుపోతున్న పసిడి, వెండి!

ఆ మావోయిస్టులకు ఆశ్రయం ఇవ్వొద్దు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 28 , 2025 | 10:38 AM