Share News

Adulterated Honey: కల్తీ తేనెను ఎలా గుర్తించాలి? తప్పక తెలుసుకోండి..

ABN , Publish Date - Dec 13 , 2025 | 04:51 PM

ఆయుర్వేదంలో తేనెను ఔషధంగా పరిగణిస్తారు. కానీ, మార్కెట్‌లో లభించే కల్తీ తేనె ఆరోగ్యానికి ముప్పుగా మారింది. అయితే, కల్తీ తేనెను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Adulterated Honey: కల్తీ తేనెను ఎలా గుర్తించాలి? తప్పక తెలుసుకోండి..
Adulterated Honey

ఇంటర్నెట్ డెస్క్: ఆయుర్వేదంలో తేనెను ఔషధంగా పరిగణిస్తారు. ఎందుకంటే, ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తేనె శక్తి అందిస్తుంది. ఇమ్యూనిటీ పెంచుతుంది. జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కొన్ని సందర్భాల్లో తలనొప్పి కూడా తగ్గిస్తుంది. కానీ, ప్రస్తుతం మార్కెట్‌లో కల్తీ తేనె అందుబాటులోకి వచ్చింది. దీనిని ఉపయోగిస్తే ప్రయోజనాలకు బదులుగా ఆరోగ్యానికి హాని కలుగుతుంది. కాబట్టి, మీరు నిజమైన తేనెను గుర్తించడం చాలా ముఖ్యం. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..


నీటి పరీక్ష

స్వచ్ఛమైన తేనెను గుర్తించడానికి సులభమైన మార్గం దానిని నీటితో పరీక్షించడం. ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ తేనె కలపండి. ఐదు నిమిషాల తర్వాత, స్వచ్ఛమైన తేనె గట్టిపడి ముద్దగా ఏర్పడుతుంది. నకిలీ తేనె చక్కెర లేదా నీరు కలపడం వల్ల త్వరగా కరిగిపోతుంది.

వెనిగర్ పరీక్ష

వెనిగర్ పరీక్ష అనేది ఒక సాధారణ ఆమ్లత్వ పరీక్ష. ఒక గ్లాసు వెనిగర్‌కు కొన్ని చుక్కల తేనె కలపండి. చుక్కలు వేసిన వెంటనే బుడగలు ఏర్పడితే, తేనె కల్తీ అయి ఉండవచ్చు.


రంగులో మార్పు

తేనె రంగును పరిశీలించండి. స్వచ్ఛమైన తేనె బంగారం రంగులో కనిపిస్తుంది. కల్తీ తేనె లేత రంగులో ఉంటుంది. స్వచ్ఛమైన తేనె మందంగా, జిగటగా ఉంటుంది.

వాసన

నిజమైన తేనె విలక్షణమైన పూల సువాసనను కలిగి ఉంటుంది. అయితే నకిలీ తేనె కృత్రిమ సువాసనను కలిగి ఉంటుంది.


టిష్యూ పేపర్ టెస్ట్

టిష్యూ పేపర్ తీసుకుని దానిపై చుక్క తేనె వేయండి. తేనె స్వచ్ఛమైనదైతే టిష్యూ పేపర్ వెంటనే దానిని పీల్చుకోలేదు. కొంత సమయం తీసుకుంటుంది. పైగా తేనె మరకలు కూడా కనిపించవు. అదే కల్తీ తేనె అయితే వెంటనే టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది.


(NOTE: పై సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Also Read:

జీవితంలో ఈ విషయాలు ముందే రాసి పెట్టి ఉంటాయి

ఒక తెల్ల వెంట్రుకను పీకితే మిగిలిన వెంట్రుకలు కూడా తెల్లగా అవుతాయా?

For More Latest News

Updated Date - Dec 13 , 2025 | 04:56 PM