Tips to Buy Jaggery: బెల్లం కొనేటప్పుడు జాగ్రత్త.. ఈ ముఖ్య విషయాలు గుర్తించుకోండి.!
ABN , Publish Date - Nov 14 , 2025 | 10:32 AM
శీతాకాలంలో బెల్లం తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది వేడెక్కే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది శరీరాన్ని లోపలి నుండి వెచ్చగా ఉంచుతుంది. అయితే, బెల్లం కొనేటప్పుడు ఈ ముఖ్య విషయాలు గుర్తించుకోండి.!
ఇంటర్నెట్ డెస్క్: బెల్లం ఆరోగ్యానికి మంచిది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరానికి శక్తిని అందిస్తుంది. శీతాకాలంలో బెల్లం తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే, ఇది వేడెక్కించే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది శరీరాన్ని లోపలి నుండి వెచ్చగా ఉంచుతుంది. ఇది శరీర ఉష్ణోగ్రత సమతుల్యతను కాపాడుతుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి వంటి శీతాకాలపు వ్యాధుల నుండి రక్షిస్తుంది. అంతేకాకుండా.. మలబద్ధకం, గ్యాస్‌ను దూరంగా ఉంచుతుంది. కానీ నేటి కాలంలో, ఆహార పదార్థాలలో కల్తీ విపరీతంగా పెరిగిపోయింది. అనేక రకాల బెల్లం మార్కెట్లో అందుబాటులో ఉంది. అయితే, న్యాణమైన వాటిని గుర్తించడం కష్టం. కాబట్టి, వాటిని కొనేటప్పుడు ఈ ముఖ్య విషయాలు గుర్తించుకోండి..
రంగు:
బెల్లం కొనేటప్పుడు, తేలికైన బంగారు రంగులో ఉన్నది కాకుండా ముదురు రంగులో ఉన్నదాన్ని తీసుకోండి. ఎందుకంటే, తేలికైన బెల్లంను బ్లీచింగ్ లేదా రసాయనాలతో ప్రాసెస్ చేస్తారు. ముదురు రంగు బెల్లంను స్వచ్ఛమైన చెరకు రసంతో తయారు చేస్తారు. వీటిలో ఎలాంటి రసాయనాలు ఉండవు.
రుచి:
బెల్లం కొనేటప్పుడు ముందుగా దాని రుచి చూడండి. ఉప్పగా ఉండే బెల్లం తీసుకోకండి. వాటిని రసాయనాలతో ప్రాసెస్ చేసి ఉంటారు. అంతేకాకుండా, ఇది పాత స్టాక్ అయి ఉంటుంది. కాబట్టి కొంచెం ఉప్పగా లేని బెల్లం ఎంచుకోండి.
పగలగొట్టండి:
బెల్లం చాలా మృదువుగా ఉండి చేతులతో సులభంగా విరిగిపోతే, అది రసాయనాలతో ప్రాసెస్ చేసి ఉండవచ్చు. స్వచ్ఛమైన, కల్తీ లేని బెల్లం పగలగొట్టడం చాలా కష్టం.
Also Read:
శీతాకాలం.. ఆహారాన్ని పదే పదే వేడి చేసి తింటున్నారా? జాగ్రత్త!
శీతాకాలంలో మీ ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోండి..!
For More Latest News