Share News

Reheating Food Risks: శీతాకాలం.. ఆహారాన్ని పదే పదే వేడి చేసి తింటున్నారా? జాగ్రత్త!

ABN , Publish Date - Nov 12 , 2025 | 11:22 AM

శీతాకాలంలో చాలా మంది ఆహారాన్ని పదే పదే వేడి చేసి తింటారు. అయితే, ఈ అలవాటు ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Reheating Food Risks: శీతాకాలం.. ఆహారాన్ని పదే పదే వేడి చేసి తింటున్నారా? జాగ్రత్త!
Reheating Food Risks

ఇంటర్నెట్ డెస్క్: శీతాకాలం వచ్చిందంటే అందరికీ వేడివేడిగా తినాలని ఉంటుంది. చాలా మంది ఒకేసారి ఎక్కువగా వండి, మిగిలిపోయిన ఆహారాన్ని తర్వాత వేడి చేసి తింటారు. ఇది సమయం ఆదా చేసే అలవాటు అయినా, ఆహారంలో ఉన్న పోషకాలు తగ్గిపోవడంతో పాటు బ్యాక్టీరియా పెరుగుదలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


ఫుడ్ పాయిజనింగ్‌

వండిన ఆహారాన్ని మళ్లీ వేడి చేసినప్పుడు దానిలోని ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు సమతుల్యత కోల్పోతాయి. ముఖ్యంగా బియ్యం, బంగాళాదుంపలు, పుట్టగొడుగులు, చికెన్, గుడ్లు లాంటి ఆహారాల్లో బాసిల్లస్ సెరియస్ (Bacillus cereus) అనే బ్యాక్టీరియా పెరిగి, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, ఫుడ్ పాయిజనింగ్‌కి కారణమవుతుంది.


శీతాకాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల ఆహారం త్వరగా చల్లబడుతుంది. ఇలా చల్లబడిన ఆహారాన్ని మళ్లీ వేడి చేయడం వల్ల బ్యాక్టీరియా, ఫంగస్‌ పెరుగుదల అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శీతాకాలంలో సూప్, సాంబార్, కూరగాయలు, బియ్యం వంటివి మళ్లీ వేడి చేయడం వల్ల శరీరంలో ఇన్ఫెక్షన్లు రావచ్చు. ఇది ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, రోగులపై తీవ్ర ప్రభావం చూపుతుంది.


ఆహారాన్ని పదే పదే వేడి చేయడం వల్ల వచ్చే సమస్యలు

  • ఆహారంలోని నూనెలు, మసాలాలు ఆక్సిడైజ్ అవుతాయి

  • విషపూరిత పదార్థాలు ఏర్పడి కాలేయంపై ప్రభావం చూపుతాయి

  • రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది

  • వాపు, అలసట, జీర్ణ సమస్యలు తలెత్తుతాయి


ఏం చేయాలి?

  • ఒకేసారి తినగలిగినంత ఆహారమే వండండి

  • మిగిలిన ఆహారాన్ని వెంటనే ఫ్రిజ్‌లో ఉంచండి

  • పిల్లలు, వృద్ధులు, రోగులకు మళ్లీ వేడి చేసిన ఆహారం ఇవ్వకండి

  • ఆహారం వండిన వెంటనే తినే అలవాటు చేసుకోండి

  • వండిన ఆహారాన్ని పదే పదే వేడి చేసి తినే అలవాటు మానుకోండి.


Also Read:

పనిలో ఇలాంటి వారికి దూరంగా ఉండటం మంచిది

మూడు కోట్ల విలువైన వస్తువులు సీజ్.. విమానాశ్రయంలో కలకలం

For More Latest News

Updated Date - Nov 12 , 2025 | 11:22 AM