Share News

Winter Health Tips: శీతాకాలంలో మీ ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోండి..!

ABN , Publish Date - Nov 12 , 2025 | 08:09 AM

శీతాకాలంలో ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. కాబట్టి, ఈ సీజన్‌లో శరీరం, మనస్సు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Winter Health Tips:  శీతాకాలంలో మీ ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోండి..!
Winter Health Tips

ఇంటర్నెట్ డెస్క్: శీతాకాలంలో ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం, ఎందుకంటే ఈ కాలంలో జలుబు, ఫ్లూ వంటి శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా వస్తాయి. అంతేకాకుండా, చర్మం తేమను కోల్పోయి పొడిగా మారుతుంది. చేతులు, కాళ్ళు, పెదవులు పగిలిపోతాయి. కీళ్ల నొప్పులు, జుట్టు రాలడం వంటి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి.. ఈ సీజన్‌లో శరీరం, మనస్సు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


క్రమం తప్పకుండా వ్యాయామం

శీతాకాలంలో వ్యాయామం చేయడం మానకూడదు. యోగాసనాలు, ప్రాణాయామం, సూర్య నమస్కారాలు చేయాలి. ఉదయం లేచి ఒక గ్లాసు వేడినీరు తాగాలి. ధ్యానం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, శరీర ఉష్ణోగ్రత, రోగనిరోధక శక్తి పెరుగుతుంది.


వృద్ధులు, పిల్లలు చలిని తట్టుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. కాబట్టి, శరీరంలో వేడిని ఎక్కువగా కోల్పోకుండా ఉన్ని టోపీలు, చేతులకు గ్లౌజులు, కాళ్లకు సాక్సులు ముఖ్యంగా రాత్రి పడుకునేటప్పుడు తప్పకుండా ధరించడం మంచిది. అంతేకాకుండా, రోజుకు కనీసం 15 నిమిషాలు సూర్యకాంతిలో కూర్చోవాలి.


తీసుకోవాల్సిన ఆహారాలు

శీతాకాలంలో వెచ్చగా, ఆరోగ్యంగా ఉండటానికి క్యారెట్, బంగాళాదుంప, చిలకడదుంప కూరగాయలు తీసుకోవాలి. ఆకుకూరలు పాలకూర, మెంతి కూర ఆహారంలో చేర్చుకోవాలి. అలాగే, పోషకాలు అధికంగా ఉండే పండ్లు నారింజ, దానిమ్మ, యాపిల్ తీసుకోవాలి. తృణధాన్యాలు వోట్స్, బార్లీ, బాదం, వాల్‌నట్స్ కూడా తినాలి. అంతేకాకుండా.. నెయ్యి, బెల్లం వంటివి తీసుకోవడం మంచిది. ఈ ఆహారాలు శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో సహాయపడతాయి.


Also Read:

ఏపీలో కిడ్నీ రాకెట్ ముఠా గుట్టురట్టు.. సంచలన విషయాలు వెలుగులోకి...

స్వల్పంగా పెరిగిన ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

For More Latest News

Updated Date - Nov 12 , 2025 | 08:09 AM