Horsegram Soup: ఉలవచారు తాగడం వల్ల ఇన్ని లాభాలా
ABN , Publish Date - Nov 04 , 2025 | 08:51 PM
చలికాలంలో శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడంతోపాటు జ్వరాన్ని అదుపులో ఉంచేందుకు ఉలవలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఉలవల్లో పోషక పదార్థాలు చాలా ఉన్నాయి.
ఉలవచారు తరచూ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడంతోపాటు జ్వరాన్ని అదుపులో ఉంచేందుకు ఉలవలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఉలవల్లో పోషక పదార్థాలు చాలా ఉన్నాయి. ఎదిగే పిల్లలకు ఇవి టానిక్‌లా పని చేస్తాయి. ఉలవల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇవి శరీరంలో ఉష్ణాన్ని పెంచుతాయి. ఉలవలను ఆయుర్వేదంలో అధికంగా ఉపయోగిస్తారు. శరీరంలో కొలెస్ట్రాల్‌తోపాటు బరువును తగ్గిస్తుంది. మొలకెత్తిన ఉలవలు సులభంగా జీర్ణమవుతాయి. రుమాటిజమ్, పైల్స్ చికిత్సకు వీటిని ఉపయోగిస్తారు. స్త్రీల రుతు సమస్యలను తగ్గిస్తుంది. కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది. ఉలవచారు తాగితే జీర్ణ సంబంధిత సమస్యలు నయమవుతాయి.
ఇక ఉలవలు.. వాతాలు, నొప్పులు నయమవుతాయి. వీటిని రోజు తీసుకుంటే.. ఎంత పని చేసిన అలసట అనేది ఉండదు. ఉలవల పిండి ద్వారా వచ్చే పాలల్లో చక్కెర కలుపుకొని తీసుకుంటే బాలింతకు పాలు పడతాయి. దీంతో పిల్లలకు డబ్బా పాలు పట్టాల్సిన పని ఉండదు. ఉలవతో చేసిన ఆహారం తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.
ఇలా తీసుకోండి..
ఒక కప్పు ఉలవలకు నాలుగు కప్పుల నీళ్లు కలిపి కుక్కర్‌లో ఉడికించి ఉలవచారు చేసుకోవాలి. దీనిలో చిటికెడ్ ఉప్పు కలిపి రోజూ ఉదయం వేళ.. ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా తీసుకుంటే సన్నబడతారు.
సెగ్గడ్డలకు..
ఉలవ ఆకులను మెత్తగా నూరి.. కొద్దిగా పసుపు కలిపి పైపూతగా రాస్తే సెగ్గడ్డలు సైతం తగ్గుతాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
నకిలీ మద్యం కేసు.. కస్టడీకి నిందితులను ఇస్తూ కోర్టు కీలక ఆదేశాలు
బస్సును ఢీకొట్టిన టిప్పర్.. స్పందించిన డీజీపీ
For More Latest News