Healthy Snacks For Winter: శీతాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే హెల్తీ స్నాక్స్ ఇవే..
ABN , Publish Date - Dec 13 , 2025 | 02:19 PM
శీతాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే హెల్తీ స్నాక్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే, ఈ సీజన్‌లో ఏ స్నాక్స్ తీసుకోవడం మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: శీతాకాలంలో ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే, మన శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. దీని కారణంగా మనం తరచూ జలుబు, దగ్గు, జ్వరం, ఫ్లూ, గొంతు నొప్పి వంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి, ఈ సీజన్‌లో మనం రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. కేవలం పండ్లు, కూరగాయలు మాత్రమే కాకుండా శీతాకాలంలో మనకు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే స్నాక్స్ కూడా ఉన్నాయి.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పల్లి పట్టి
శీతాకాలంలో పల్లీలు బెల్లంతో తయారు చేసే పల్లి పట్టి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని న్యూట్రిషియన్లు చెబుతున్నారు. ఇందులో మైక్రో మినరల్స్ ఎక్కువగా ఉంటాయని, విటమిన్స్, పాలిఫినాల్స్ పుష్కలంగా ఉంటాయని అంటున్నారు. పల్లీలు బెల్లంతో కలిపి తింటే శరీరానికి మంచి చేసే కొవ్వు పెరుగుతుందని చెబుతున్నారు. పల్లి పట్టి ఇమ్యూనిటీ బూస్టర్ లాంటిదని చెబుతున్నారు. పిల్లలకు ఈ స్నాక్స్ ఇస్తే బోలెడు పోషకాలు శరీరానికి అందుతాయని అంటున్నారు.

1 కప్పు పల్లీలను వేయించి తొక్కలు తీసి దంచాలి. బెల్లాన్ని పాన్‌లో కరిగించి పాకం వచ్చే వరకు ఉడికించాలి. అందులో దంచిన పల్లీలు వేసి కలపాలి. చేతులకు నెయ్యి రాసుకుని మిశ్రమాన్ని చిన్న ఉండలుగా లేదా ప్లేట్‌లో పరచాలి. గట్టిపడగానే ముక్కలుగా కట్ చేస్తే రుచికరమైన పల్లి పట్టి సిద్ధమవుతుంది.
నువ్వుల లడ్డు:
నువ్వులలో ఐరన్, ప్రొటీన్, విటమిన్ బి, ఇ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలు మన కళ్ళు, కాలేయం, ఇతర ప్రధాన అవయవాలకు ప్రయోజనకరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నువ్వుల లడ్డూల కోసం వాడే బెల్లం పాకు మనకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందని అంటున్నారు. చలికాలంలో రక్తనాళాలు కుంచించుకుపోకుండా, బెల్లం పాకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుందని సూచిస్తున్నారు. ఇది తక్కువ కేలరీల ఆహారం కావడంతో బరువు తగ్గేవారు కూడా దీనిని తీసుకోవచ్చు.

1 కప్పు నువ్వులను పాన్‌లో తేలికగా వేయించి చల్లారాక పొడిగా దంచాలి. బెల్లాన్ని కరిగించి పాకం వచ్చే వరకు ఉడికించాలి. ఆ పాకంలో దంచిన నువ్వుల పొడి వేసి కలపాలి. చేతులకు నెయ్యి రాసుకుని మిశ్రమాన్ని లడ్లుగా చేసుకుంటే రుచికరమైన నువ్వుల లడ్లు సిద్ధమవుతుంది. శీతాకాలంలో ఈ హెల్తీ స్నాక్స్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అయితే, బయట షాపులలో వీటిని తీసుకోవడం కంటే ఇంట్లోనే తయారుచేసుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
(NOTE: పై సమాచారం ఆరోగ్య నిపుణుల ఆధారంగా మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
జీవితంలో ఈ విషయాలు ముందే రాసి పెట్టి ఉంటాయి
ఒక తెల్ల వెంట్రుకను పీకితే మిగిలిన వెంట్రుకలు కూడా తెల్లగా అవుతాయా?
For More Latest News