Gongura Chepala Pulusu: గోంగూరతో చేపల పులుసు.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది!
ABN , Publish Date - Dec 14 , 2025 | 12:54 PM
పుల్లపుల్లగా ఎంతో రుచికరమైన నోరూరించే గోంగూర చేపల పులుసును మీరు ఎప్పుడైనా తిన్నారా? దీని టేస్ట్ అదిరిపోతుంది. అయితే, ఈ గోంగూర చేపల పులుసును ఎలా చేస్తారో మీకు తెలుసా? అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: చేపల పులుసు అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. అయితే, చేపలతో ఎప్పుడూ చేసుకునే వంటలకు బదులుగా ఈ సండే మరింత స్పెషల్‌గా ఉండేలా గోంగూరతో చేపల పులుసును ట్రై చేయండి. పుల్లపుల్లగా ఎంతో రుచికరమైన నోరూరించే గోంగూర చేపల పులుసు టేస్ట్ అదిరిపోతుంది. అయితే, ఈ గోంగూర చేపల పులుసును ఎలా చేస్తారో మీకు తెలుసా? అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

గోంగూర చేపల పులుసుకు కావలసిన పదార్థాలు:
½ కేజీ శుభ్రం చేసిన చేపలు
1 కట్ట ఎర్ర గోంగూర
1 పెద్ద ఉల్లిపాయ (తరుగు)
2 టమోటాలు (పేస్ట్)
ఉప్పు (రుచికి సరిపడా)
2 ఎండు మిరపకాయలు
2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్
2 టేబుల్ స్పూన్ల కారం
½ టీస్పూన్ పసుపు
1 స్పూన్ వేయించిన మెంతి పొడి
1 స్పూన్ ధనియాల పొడి
½ టీస్పూన్ గరం మసాలా
1 స్పూన్ జీలకర్ర
1 స్పూన్ ఆవాలు
1 కొత్తిమీర తరుగు
½ కప్పు నూనె
తయారీ విధానం:
ముందుగా, ఒక గిన్నెలో శుభ్రం చేసిన చేప ముక్కలను తీసుకుని, అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలిపి 15-20 నిమిషాలు మసాలాలు పడనివ్వండి.
తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టి, అందులో నూనె వేసి వేడి చేసుకోండి.
వేడి నూనెలో చేప ముక్కలను వేసి తక్కువ మంట మీద బాగా వేపండి. రెండు వైపులా బంగారు రంగులో వేగాక, చేపలు తీసి పక్కన పెట్టండి.
కడాయిలో మిగిలిన నూనెలో జీలకర్ర, ఆవాలు, ఎండు మిరపకాయలు వేసి, తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బాగా వేగించాలి.

ఉల్లిపాయలు పసుపు రంగులో మారిన తరువాత, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, దాని పచ్చివాసన పోయేంత వరకు వేగించండి.
ఇప్పుడు ఎర్ర గోంగూర వేసి బాగా మగ్గించాలి.
గోంగూర మగ్గిన తర్వాత పసుపు, కారం, ఉప్పు, మెంతి పొడి, గరం మసాలా, ధనియాల పొడి వేసి బాగా కలిపి, టమోటా పేస్ట్ వేసి ఉడికించాలి.
టమోటా పేస్ట్ బాగా ఉడికిన తర్వాత 1 ½ గ్లాసు నీళ్లు వేసి మరిగించాలి.
ఈ మసాలా రసంలో ముందుగా వేపిన చేప ముక్కలను వేసి, తక్కువ మంటపై 15-20 నిమిషాలు ఉడికించండి.
చేపలు బాగా ఉడికిన తరువాత, కూర నుంచి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోండి.
చివరగా కొత్తిమీర తరుగు వేసి, స్టవ్ ఆఫ్ చేసుకోండి. అలా, మీ రుచికరమైన గోంగూర చేపల పులుసు సిద్ధమవుతుంది.
ఈ గోంగూర చేపల పులుసు పుల్లగా, రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
(NOTE: పై సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
జీవితంలో ఈ విషయాలు ముందే రాసి పెట్టి ఉంటాయి
ఒక తెల్ల వెంట్రుకను పీకితే మిగిలిన వెంట్రుకలు కూడా తెల్లగా అవుతాయా?
For More Latest News