Share News

Goli Idli Recipe: గోలి ఇడ్లీ రెసిపీ.. ఎలా తయారు చేస్తారో తెలుసా?

ABN , Publish Date - Dec 09 , 2025 | 02:02 PM

గోలి ఇడ్లీని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. దీనిని తయారు చేయడం చాలా సింపుల్. అయితే, దీనిని ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా?

Goli Idli Recipe: గోలి ఇడ్లీ రెసిపీ.. ఎలా తయారు చేస్తారో తెలుసా?
Goli Idli Recipe

ఇంటర్నెట్ డెస్క్: గోలి ఇడ్లీ అంటే చిన్న చిన్న గుండ్రటి ఇడ్లీలు. వీటిని సాధారణ ఇడ్లీ పిండితో (కొన్నిసార్లు బియ్యం పిండి/రవ్వతో ఇన్స్టంట్‌గా) చిన్న ఉండలుగా చేసి ఆవిరిలో ఉడికించడం ద్వారా తయారు చేస్తారు. ఇవి పిల్లలకు చాలా ఇష్టమైనవి. చూడటానికి రసగుల్లా లాగా ఉంటాయి. గోలి ఇడ్లీని ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


గోలి ఇడ్లీకి కావలసిన పదార్థాలు

  • కప్పు నీరు

  • 1 స్పూన్ ఉప్పు

  • 1 స్పూన్ నెయ్యి

  • 1 కప్పు బియ్యం

  • నూనె 1 స్పూన్

  • ఆవాలు

  • కరివేపాకు

  • తరిగిన మిరపకాయ1/2

  • స్పూన్ అల్లం పేస్ట్


గోలి ఇడ్లీ తయారీ విధానం:

  • నీటిలో నూనె, ఉప్పు, కొద్దిగా వంట సోడా వేసి మరిగించి అందులో బియ్యం పిండి కలిపి ముద్దలా చేసి చిన్న ఉండలుగా చేయాలి. ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నూనె రాసి ఈ చిన్న ఉండలను వాటిపై ఉంచి మూత పెట్టి 8-10 నిమిషాలు ఆవిరిలో ఉడికించాలి. (పిండిని బట్టి సమయం మారవచ్చు). నూనె రాసిన ఇడ్లీ ప్లేట్లలో పెట్టి ఆవిరి మీద ఉడికించాలి. చివరగా ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసిన తాలింపులో వాటిని వేసి కలుపుకోవాలి. ఆవిరి మీద ఉడికిన గోలి ఇడ్లీలను తీసి కొబ్బరి చట్నీ, సాంబార్ లేదా మీకు నచ్చిన పొడితో వేడిగా వడ్డించుకోని తినాలి.


(Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతుంది. కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధృవీకరించలేదు )

Also Read:

న్యూ ఇయర్ పార్టీ.. ఇండియాలో బెస్ట్ బీచ్ డెస్టినేషన్స్ ఏవో తెలుసా?

కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో కనిపించే సంకేతాలు ఇవే.!

For MOre Latest News

Updated Date - Dec 09 , 2025 | 02:44 PM