Food in Aluminum Foil: అల్యూమినియం ఫాయిల్‌లో ప్యాక్ చేసిన ఫుడ్ తింటున్నారా? ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోండి.!
ABN , Publish Date - Oct 07 , 2025 | 11:14 AM
అల్యూమినియం ఫాయిల్‌ను సాధారణంగా ఫుడ్ ప్యాకింగ్ చేయడానికి ఉపయోగిస్తారు. అయితే, ఇలా ప్యాక్ చేసిన ఫుడ్ తినడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయని మీకు తెలుసా?
ఇంటర్నెట్ డెస్క్: హోటల్స్, రెస్టారెంట్ లలో ఆహారాన్ని ప్యాక్ చేయడానికి అల్యూమినియం ఫాయిల్‌ను వాడతారు. ఎందుకంటే ఇది గాలి, తేమ, కాంతి, బ్యాక్టీరియా నుండి ఆహారాన్ని రక్షిస్తుంది. అలాగే ఆహారం వేడిగా ఉండటానికి సహాయపడుతుంది. అయితే, అల్యూమినియం ఫాయిల్‌లో ప్యాక్ చేసిన ఫుడ్ తినడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయని మీకు తెలుసా?
అల్యూమినియం ఫాయిల్ దుష్ప్రభావాలు
అల్యూమినియం ఫాయిల్ వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అల్యూమినియం ఫాయిల్‌లో ఆహారాన్ని ప్యాక్ చేయడం వలన అల్యూమినియం లీక్ అయ్యి ఆహారంలోకి చేరే అవకాశం ఉంది. ఈ అల్యూమినియం శరీరంలోకి ఎక్కువగా చేరితే, ఆల్జీమర్స్ వంటి నాడీ సంబంధిత సమస్యలు, ఎముకల బలహీనత వంటి ఆరోగ్య సమస్యలు రావచ్చని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. అందువల్ల, వేడి లేదా ఆమ్ల పదార్థాలను, అలాగే ఉప్పుతో కూడిన ఆహారాలను అల్యూమినియం ఫాయిల్‌లో ప్యాక్ చేయడం లేదా నిల్వ చేయడం మానుకోవాలి.

పుల్లని వస్తువులను ఉంచవద్దు
అల్యూమినియం ఫాయిల్‌ను మరి ముఖ్యంగా ఆమ్ల ఆహారాలైన టమోటాలు, నిమ్మకాయలు, వెనిగర్ వంటి వాటికి ఉపయోగించకూడదు, ఎందుకంటే ఆమ్లం ఫాయిల్‌తో రసాయన చర్య జరిపి, అల్యూమినియం ఆహారంలోకి చేరేలా చేస్తుంది. ఇలా ఎక్కువ కాలం పాటు అల్యూమినియం తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి, ఈ ఆహారాలను నిల్వ చేయడానికి గాజు లేదా ప్లాస్టిక్ కంటైనర్‌లను ఉపయోగించడం మంచిది.

వ్యాధుల ప్రమాదం
బాగా వేడిచేసిన ఆహారాన్ని అల్యూమినియం ఫాయిల్‌లో ఉంచకండి.
మీరు అల్యూమినియం ఫాయిల్‌ను ఒకటి కంటే ఎక్కువసార్లు తిరిగి ఉపయోగించడం ఏ మాత్రం మంచిది కాదు. ఒకసారి ఉపయోగించిన తర్వాత, మీరు దానిని పారవేయాలి.
మీరు, మీ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే, అల్యూమినియం ఫాయిల్ వాడకాన్ని వీలైనంత వరకు పరిమితం చేయండి.
Also Read:
ముఖం మీద మొటిమలను ఎలా నివారించాలో తెలుసా?
డ్రైవింగ్‌లో ఇలా చేస్తే డేంజర్.. సీపీ సజ్జనార్ హెచ్చరిక
For More Latest News