Dosa Making Tips: రెస్టారెంట్ స్టైల్‌లో దోసె కావాలా? ఇంట్లోనే ఇలా చేయండి..
ABN , Publish Date - Dec 10 , 2025 | 06:43 PM
శీతాకాలంలో రుచికరమైన దోసెలు తినాలనుకుంటున్నారా? అయితే, ఇంట్లోనే ఈ చిట్కాలు పాటిస్తే రెస్టారెంట్ స్టైల్‌లో దోసె వస్తాయి. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: టిఫిన్‌లలో దోసెను చాలా మంది ఇష్టంగా తింటారు. ఇది రుచిగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అంతేకాకుండా, సులభంగా జీర్ణమవుతుంది. ఇది మినపప్పు, బియ్యంతో తయారవుతుంది, ప్రోటీన్ అందిస్తుంది. రెస్టారెంట్ స్టైల్‌లో పర్ఫెక్ట్ దోస పిండి చేయడానికి బియ్యం, మినప్పప్పు, మెంతులు సరైన నిష్పత్తిలో నానబెట్టి, వేరువేరుగా మెత్తగా రుబ్బి, ఉప్పు కలిపి 8-12 గంటలు పులియబెట్టాలి. పిండిని పలుచగా చేసి, నూనెతో వేయించడం ద్వారా మంచి క్రిస్పీ దోసలు వస్తాయి.
కావాల్సిన పదార్థాలు:
బియ్యం: 3 కప్పులు
మినప్పప్పు: 1 కప్పు
మెంతులు: 1 టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
తయారీ విధానం:
బియ్యం, మినప్పప్పు, మెంతులను వేర్వేరు గిన్నెల్లో తీసుకుని, నీటితో శుభ్రంగా కడిగి కనీసం 4-6 గంటలు లేదా రాత్రిపూట నానబెట్టాలి.
నానబెట్టిన మినప్పప్పును, బియ్యాన్ని ముతకగా ఉండేలా మెత్తగా రుబ్బాలి. రుబ్బేటప్పుడు చల్లటి నీటిని వాడటం మంచిది.
రుబ్బిన పప్పు, బియ్యం మిశ్రమాన్ని కలిపి ఉప్పు వేసి బాగా కలపాలి. పిండి మరీ గట్టిగా, మరీ పల్చగా లేకుండా, దోసె వేయడానికి సరైన పల్చదనంలో ఉండాలి.
ఈ మిశ్రమాన్ని మూతపెట్టి వెచ్చని ప్రదేశంలో 8-12 గంటల పాటు పులియబెట్టాలి.
దోసె పెనం వేడి చేసి, పిండిని పలుచగా చేసి, కొద్దిగా నూనె/నెయ్యి వేసి బంగారు రంగు వచ్చేవరకు మీడియం మంటపై కాల్చాలి.
చిట్కాలు:
దోసెలు మరింత మెత్తగా కావాలంటే, రుబ్బేటప్పుడు కొన్ని అటుకులు కలపవచ్చు.
పెనం బాగా వేడిగా ఉంటే దోసె క్రిస్పీగా వస్తుంది. మంటను సరిగ్గా ఉంచాలి.
చట్నీతో తింటే టేస్ట్ సూపర్‌గా ఉంటుంది.
(NOTE: పై సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
జీవితంలో ఈ విషయాలు ముందే రాసి పెట్టి ఉంటాయి
ఒక తెల్ల వెంట్రుకను పీకితే మిగిలిన వెంట్రుకలు కూడా తెల్లగా అవుతాయా?
For More Latest News