Fried Rice Side Effects: ఫ్రైడ్ రైస్ బాగా తింటున్నారా? ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోండి.!
ABN , Publish Date - Nov 26 , 2025 | 02:18 PM
చాలా మంది ఫ్రైడ్ రైస్‌ను బాగా ఇష్టంగా తింటారు. కొంతమంది ఎగ్ ఫ్రైడ్ రైస్, మరికొంత మంది చికెన్ ఫ్రైడ్ రైస్ ఎక్కువగా తింటారు. అయితే, ఈ షాకింగ్ విషయాలు తెలిస్తే మీరు దాన్ని అస్సలు ముట్టుకోరు..
ఇంటర్నెట్ డెస్క్: చాలా మంది ఇంటి ఫుడ్ కన్నా, రోడ్డు పక్కన దొరికే ఫాస్ట్ ఫుడ్‌ను తినడానికి ఇష్టపడతారు. కొంతమంది ఎగ్ ఫ్రైడ్ రైస్, మరికొంత మంది చికెన్ ఫ్రైడ్ రైస్ ఎక్కువగా తింటారు. స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో బయటకు వెళ్లి ఫాస్ట్ ఫుడ్ తింటారు. కానీ, ఈ ఫాస్ట్ ఫుడ్ మీ ఆరోగ్యానికి హానికరమని మీకు తెలుసా? ఫ్రైడ్ రైస్ తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఫ్రైడ్ రైస్ ఆరోగ్యానికి హానికరం..
ఫ్రైడ్ రైస్ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఒకసారి వండిన బియ్యాన్ని మళ్లీ వేడి చేసి వేయించడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. దీనివల్ల గుండెల్లో మంట, అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అదేవిధంగా, ఫ్రైడ్ రైస్ కోసం ఉపయోగించే నూనెను చాలాసార్లు ఉపయోగించి ఉంటారు. అంతేకాకుండా, సుగంధ ద్రవ్యాలు, అదనపు నూనెను పదే పదే వేడి చేసినప్పుడు, దానిలో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ గుండెకు హాని కలిగిస్తాయి. ఫ్రైడ్ రైస్ ఎక్కువగా తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్, గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకే గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు బయట లభించే ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఫ్రైడ్ రైస్‌లో ఉపయోగించే సోయా సాస్, చిల్లీ సాస్, ఉప్పు, వెనిగర్ వంటి అనేక పదార్థాలు అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతాయి. ముఖ్యంగా చైనీస్, ఫ్రైడ్ రైస్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి, ఊబకాయానికి దారితీస్తాయి. అదనంగా, ఈ ఆహారాలను పెద్ద పరిమాణంలో తీసుకోవడం వల్ల తలనొప్పి, ఛాతీ నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
Also Read:
కవితపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపాటు
ఇది సాధారణ వాషింగ్ మెషిన్ కాదు.. 999 సంవత్సరాలు పని చేయడం గ్యారెంటీ..
For More Latest News