Viral invention: ఇది సాధారణ వాషింగ్ మెషిన్ కాదు.. 999 సంవత్సరాలు పని చేయడం గ్యారెంటీ..
ABN , Publish Date - Nov 24 , 2025 | 07:07 PM
ట్యాలెంట్ ఉపయోగించి చేసే నూతన ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే నూతన ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Jugaad Video).
raghu_ke_memes అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో వెరైటీ వాషింగ్ మెషిన్ కనిపిస్తోంది. మీరు రకరకాల వాషింగ్ మెషీన్లను చూసి ఉండవచ్చు. కానీ ఇలాంటిది మాత్రం మీరు చూసి ఉండరు. ఆ వీడియోలో ఒక వ్యక్తి తన ఇంట్లో సిమెంట్, ఇటుకలను ఉపయోగించి వాషింగ్ మెషిన్ నిర్మించాడు. దాని పైన టైల్స్ కూడా అమర్చాడు. ఆ వాషింగ్ మెషీన్‌లో అతడు బట్టలు ఉతుకుతున్నాడు. ఆ వెరైటీ వాషింగ్ మెషిన్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (brick washing machine).
ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు పది లక్షల మంది వీక్షించారు (innovative creation viral). 18 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. అలా సిమెంట్, ఇటుకలతో చుట్టూ ప్రహారీలా నిర్మించుకుని, లోపల వాషింగ్ డ్రమ్ సెట్ చేసుకుంటే అది చాలా కాలం పని చేస్తుందని ఒకరు కామెంట్ చేశారు. ఈ వాషింగ్ మెషిన్ 999 సంవత్సరాలకు పైగా పని చేస్తుందని ఒకరు పేర్కొన్నారు. తమకూ అలాంటిది కావాలని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
స్విగ్గీ, జొమాటో ఈమె ముందు బలాదూర్.. ఈ అమ్మ ట్యాలెంట్‌కు నెటిజన్లు ఫిదా..
పెట్రోల్ బంక్‌లో సున్నా మాత్రమే చూస్తున్నారా.. అయితే ఈ మోసం గురించి తెలుసుకోండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..